మహీంద్రా కెయువి100 యానివర్సరీ ఎడిషన్ విడుదల: ప్రత్యేకతలు

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా తమ కెయువి100 వాహనాన్ని స్పెషల్ ఎడిషన్‌గా విపణిలోకి విడుదల చేసింది. సమయం, సందర్భం లేకుండా ఏంటి ఈ స్పెషల్ విడుదల అనుకుంటున్నారా...? మహీంద్రా ఈ చిన్న ఎస్‌యువి వాహనాన్ని విడుదల చేసి సరిగ్గా ఏడాది పూర్తియిన కారణం చేత మొదటి సంవత్సరపు యానివర్సరీ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.

మహీంద్రా ఈ యానివర్సరీ ఎడిషన్ కెయువి100 వాహనాన్ని కేవలం కె8 ట్రిమ్ లో మాత్రమే అందిస్తోంది, ఫ్లాంబోయంట్ రెడ్ లేదా డాజ్లింగ్ సిల్వర్ బాడీతో మెటాలిక్ బ్లాక్ రూఫ్ వచ్చే విధంగా ఎక్ట్సీరియర్‌ను డిజైన్ చేసారు.

కెయువి100 యానివర్సరీ ఎడిషన్ 15-అంగుళాల పరిమాణం గల పెద్ద అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. అయితే కె6 మరియు కె6 ప్లస్ వేరియంట్లు స్పైడర్ డిజైన్‌లో 14-అంగుళాల పరిమాణం గల అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉన్నాయి.

బ్లాక్ మరియు ప్రీమియమ్ థీమ్ వచ్చే విధంగా ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగింది. అంతే కాకుండా కస్టమర్లు పర్సనలైజ్ చేసుకునేందుకు మహీంద్రా అందించే నాలుగు యాక్ససరీ కిట్ అందివ్వడం జరిగింది.

మహీంద్రా అందించే కిట్‌లలో, స్పోర్టివ్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ కిట్స్ మరియు ప్రీమియమ్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ కిట్లు కలవు. తమ కెయువి100 వాహనాన్ని మరింత స్పోర్టివ్‌గా మార్చుకునేందుకు మల్టిపుల్ యాక్సరీలను అందివ్వడం జరిగింది.

కెయువి100 యానివర్సరీ ఎడిషన్ విడుదల సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రవీణ్ సాహ్ మాట్లాడుతూ, నూతన ఎస్‌యువి సెగ్మెంట్‌ను క్రియేట్ చేస్తూ మహీంద్రా విడుదల చేసిన కెయువి100 విజయం పట్ల కస్టమర్లకు ధన్యవాదాలు చెప్పుకున్నారు.

ప్రవీణ్ సాహ్ మాట్లాడుతూ, మహీంద్రా కెయువి100 యానివర్సరీని సరికొత్త అవతారంలో విడుదల చేసింది. డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ కలర్, స్పోర్టివ్ మరియు ప్రీమియమ్ బ్లాక్ ఇంటీరియర్స్ మరియు పెద్ద పరిమాణంలో అల్లాయ్ వీల్స్ తో పాటు విభిన్నమైన యాక్ససరీ కిట్లను అందివ్వడం జరిగిందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం మహీంద్రా కెయువి100 ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.58 లక్షలు ఎక్స్ షోరూమ్‌(ఢిల్లీ)గా ఉంది, కేవలం టాప్ ఎండ్ వేరియంట్ కె8 ట్రిమ్‌లో మాత్రమే లభించే యానివర్సరీ ఎడిషన్ ధర రూ. 6.37 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా విచ్చేసిన అబుదాబి మహారాజు గారి అత్యంత ఆడంబరమైన విమానం

టాటా హెక్సా ఎమ్‌పివీ ఫోటో గ్యాలరీ...
 

English summary
Mahindra Launches The KUV100 Anniversary Edition; Priced At Rs 6.37 Lakh
Please Wait while comments are loading...

Latest Photos