మహీంద్రా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎస్201 విడుదల వివరాలు

Written By:

భారత దేశపు దిగ్గజ ఎస్‌యూవీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా పూర్తిగా దేశీయ మార్కెట్ కోసం సరికొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ది చేస్తోంది. శాంగ్‌యాంగ్ మోటార్స్ యొక్క ఎక్స్100 ఫ్లాట్‌ఫామ్ ఆధారిత ఎస్‌యూవీని ఎస్201 అనే పేరుతో రూపొందిస్తోంది, ప్రస్తుతం విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటాకు బలమైన పోటీనివ్వనున్న దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి...

ప్రస్తుతం ఎస్201 మోడల్ శాంగ్‌యాంగ్ ఎక్స్100 వేదిక ఆధారంగా వస్తున్నప్పటికీ, దీని డిజైన్ మరియు శైలి ఎక్స్100 తో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటుంది.

మహీంద్రా లైనప్‌లో ఉన్న నువోస్పోర్ట్ మరియు స్కార్పియో వాహనాల మధ్య స్థానాన్ని భర్తీ చేయనున్న ఇది 2018 చివరి నాటికి లేదా 2019 ప్రారంభంలో మార్కెట్లోకి విడుదల అవకాశం ఉంది.

ప్రస్తుతం అందిన సమాచారం మేరకు మహీంద్రా కొనుగోలు చేసిన దిగ్గజ ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ పినిన్ఫారినా మరియు శాంగ్‌యాంగ్ టివోలి భాగస్వామ్యంతో ఈ ఎస్201 కాంపాక్ట్ ఎస్‌యూవీని డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది.

పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో రానున్న దీని ధర రూ. 9 నుండి 13 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉండనుంది.

ఇంజన్ విషయానికి వస్తే, 1.5-లీటర్ సామర్థ్యం గల టిజిడిఐ పెట్రోల్ మరియు ఎమ్‌హాక్100 డీజల్ ఇంజన్‌ను ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం మహీంద్రా టియువి300లో ఈ ఎమ్‌హాక్ 100 డీజల్ ఇంజన్‌ను గుర్తించవచ్చు.

మహీంద్రా ఫ్యూచర్ ఉత్పత్తుల గురించి చూస్తే, సరికొత్త యు321ఎమ్‌పీవీని అభివృద్ది చేస్తోంది. ఇది మహీంద్రా ఎక్స్‌యూవీ500 యొక్క ఏరో కాన్సెప్ట్ రూపం అని తెలుస్తోంది. అంతే కాకుండా భవిష్యత్తులో స్కార్పియో మరియు ఎక్స్‌‌యూవీ500 లను పెట్రోల్ వేరియంట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

మహీంద్రా పూర్తి స్థాయిలో తమ ఎస్201 కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేస్తే, ప్రస్తుతం విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు రెనో డస్టర్ లకు గట్టి పోటీనివ్వగలదు.

English summary
Mahindra S201 Sub Compact SUV India Launch Details
Story first published: Saturday, March 4, 2017, 17:44 [IST]
Please Wait while comments are loading...

Latest Photos