డబ్బుతో నైపుణ్యాన్ని కొనలేం: వ్రాంగ్లర్‌కు గుణపాఠం చెప్పిన థార్

Written By:

మహీంద్రా థార్ వెహికల్‌తో పోల్చుకుంటే జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీ చాలా ఖరీదైనది. అయితే రెండు వెహికల్స్ కూడా ఆఫ్ రోడింగ్ వాహనాలే. కానీ బురద మట్టిలో ఇరుక్కుపోయిన వ్రాంగ్లర్‌ను మహీంద్రా థార్ గట్టెక్కించింది. డబ్బుతో ఏమైనా కొనగలం, కానీ నైపుణ్యాన్ని కొనలేం. దీనిని నిరూపించే సంఘటనే ఇవాళ్టి కథనంలో.....

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బురద మట్టిలో ఇరుక్కుపోయిన వ్రాంగ్లర్‌ను మహీంద్రా థార్ గట్టెక్కించింది

అమెరికా లగ్జరీ ఎస్‌యూవీల తయారీ సంస్థ జీప్ ఇండియాలోకి రాకముందు, జీప్ అంటే ఏది అని ప్రశ్నిస్తే, చాలా మంది నుండి వచ్చే సమాధానం పాత జీపు లేదా థార్. జీప్ కంపెనీ ఇండియాకు వచ్చేంత వరకు చాలా మందికి తెలిసిన జీప్ మహీంద్రా థార్ ఎస్‌యూవీ.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బురద మట్టిలో ఇరుక్కుపోయిన వ్రాంగ్లర్‌ను మహీంద్రా థార్ గట్టెక్కించింది

జీప్ వెహికల్స్ అంటే పడిచచ్చిపోయే అభిమానుల జోబులకు చిల్లులు మాత్రం ఖాయం. ఎందుకంటే ఆఫ్ రోడింగ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మమ్మల్ని మించినవారు లేరని భావించే జీప్ సంస్థ తమ ఉత్పత్తుల ధరలను భారీగా ఉంచింది. రెండు మూడు సార్లు ఆఫ్ రోడ్ మీద డ్రైవ్ చేసి జీప్ వెహికల్స్ ఎంచుకునే వారు చాలా మంది ఉన్నారు.

బురద మట్టిలో ఇరుక్కుపోయిన వ్రాంగ్లర్‌ను మహీంద్రా థార్ గట్టెక్కించింది

అలాంటి వ్యక్తే ఒకరు జీప్ వ్రాంగ్లర్ ఎలాంటి రోడ్లనైనా చేదిస్తుందనే నమ్మకంతో ప్రక్కనే ఉన్న మట్టి గుంతను దాటడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో నాలుగు చక్రాలు కూడా బురద మట్టిలో దిగబడిపోయాయి. ఎంత యాక్సిలరేట్ చేసిన, ఎలా ప్రయత్నించినా గట్టేక్కే అవకాశమే లేకుండా పోయింది.

బురద మట్టిలో ఇరుక్కుపోయిన వ్రాంగ్లర్‌ను మహీంద్రా థార్ గట్టెక్కించింది

అదృష్టవశాత్తు ఇండియన్ ఫేవరేట్ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ మహీంద్రా థార్ అక్కడే ఉంది. బురదలో ఇరుక్కుపోయిన, లక్షలు ఖరీదు చేసే వ్రాంగ్లర్‌ను మహీంద్రా థార్ సునాయసంగా లాక్కొచ్చేసింది.

బురద మట్టిలో ఇరుక్కుపోయిన వ్రాంగ్లర్‌ను మహీంద్రా థార్ గట్టెక్కించింది

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరైన ఆఫ్ రోడింగ్ ఎస్‌యూవీ అంటే, గుంతలను దాటించడం మరియు అన్ని అవాంతరాలను ఎదుర్కుంటుందని భావించకండి. లక్షలకు లక్షలు డబ్బు పోసి కొనే వాహనాలు మాత్రమే కాకుండా తక్కువ ధరలో లభించే ఎస్‌యూవీలు కూడా అదే పనితీరును కనబరుస్తాయి. కాబట్టి ఏ వెహికల్‌కు ఎంత సామర్థ్యం ఉంది, వాటి ధర ఎలా ఉందని గమనించి ఆఫ్ రోడ్ వాహనాలను ఎంచుకోండి.

అయితే, దానికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది డబ్బు మన నైపుణ్యాన్ని పెంచలేవు. కాబట్టి డ్రైవింగ్ పట్ల మంచి అనుభవం మరియు ఆఫ్ రోడింగ్‌లో మంచి మెళుకువలను తెలుసుకోండి.

English summary
Read In Telugu: Mahindra Thar Rescuing A Jeep Wrangler Stuck in The Mud Is Proof Money Can't Buy You Skills
Story first published: Tuesday, September 5, 2017, 19:31 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark