ఎక్స్‌యూవీ500 స్పోర్ట్జ్ వేరియంట్ విడుదల చేసిన మహీంద్రా

Written By:

దేశీయ దిగ్గజ ఎస్‌యూవీ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా నేడు ఇండియన్ మార్కెట్లోకి ఎక్స్‌యూవీ500 లోని డబ్ల్యూ10 ఆధారంగా లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్‌లోని మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ. 16.5 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 17.56 లక్షలు ఎక్స్ షోరూమ్‌ (ఢిల్లీ)గా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్జ్

ఎక్స్‌యూవీ500 ప్రేమికులకు ఇది నిజంగా శుభవార్త అని చెప్పవచ్చు. ఈ సరికొత్త స్పోర్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్‌లో చాలా వరకు కాస్మొటిక్ సొబగులు చోటు చేసుకున్నాయి. అందులో స్పోర్టివ్ బాడీ డీకాల్స్, ఎర్రటి రంగులో ఉన్న బ్రేక్ కాలిపర్లతో డార్క్ అల్లాయ్ చక్రాలు కలవు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్జ్

కాషాయం రంగులో ఉన్న రూఫ్ రెయిల్స్, డోర్ హ్యాండిల్స్, మరియు ఫాగ్ ల్యాంప్స్ తొడుగులు ఉన్నాయి. ఇంటీరియర్‌లో కూడా స్పోర్ట్జ్ బ్యాడ్జ్ పేరు కలదు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్జ్

ఫీచర్ల పరంగా ఇందులో 7-అంగుళాల పరిమాణం గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యావిగేషన్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సెన్సింగ్ వైపర్లు మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ కలవు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్జ్

సాంకేతికంగా ఈ ఎక్స్‌యూవీ500 స్పోర్ట్జ్ వేరియంట్ 2.2-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 330ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్జ్

ఈ వేరియంట్లోని ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ల అనుసంధానంతో అందుబాటులో ఉంది. ఇంజన్ యొక్క పవర్ మరియు టార్క్ స్టాండర్డ్‌గా ఆల్ వీల్ డ్రైవ్‌ సిస్టమ్‌ అందివ్వడం జరిగింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్జ్

ప్రస్తుతం ఈ ఎక్స్‌యూవీ500 స్పోర్ట్జ్ వేరియంట్ మునుపటి ఎక్స్‌యూవీల కన్నా కాస్త ధర ఎక్కువగా ఉంది. అయితే డిజైన్, మరియు ఫీచర్ల పరంగా మునుపటి వేరియంట్ల కన్నా ఇది విభిన్నమైనది చెప్పవచ్చు.

 
English summary
Mahindra XUV500 Sportz — Limited Edition Variant Launched In India
Story first published: Monday, February 6, 2017, 16:01 [IST]
Please Wait while comments are loading...

Latest Photos