మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ విడుదల: ఇంజన్, ఫీచర్లు మరియు పూర్తి వివరాల కోసం

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ ను విపణిలోకి విడుదల చేసింది. మారుతి నుండి బాలెనో ఆర్ఎస్ మొట్టమొదటి శక్తివంతమైన హాట్ హ్యాచ్‌బ్యాక్. వేరియంట్లు, ధర, ఫీచర్లు, ఇంజన్ మరియు పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి...

By Anil

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తమ బాలెనో యొక్క శక్తివంతమైన మోడల్‌, బాలెనో ఆర్ఎస్‌ను పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ. 8.69 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు మారుతి తెలిపింది.

బాలెనో ఆర్ఎస్ ఇంజన్ వివరాలు

బాలెనో ఆర్ఎస్ ఇంజన్ వివరాలు

మారుతి సుజుకి తమ శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ బాలెనో ఆర్ఎస్ లో 998సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను అందించింది. ఇది 5,500ఆర్‌పిఎమ్ వేగం వద్ద 101బిహెచ్‌పి పవర్ మరియు 1,700-4,500ఆర్‌పిఎమ్ మధ్య గరిష్టంగా 150ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ విడుదల

ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ముందు చక్రాలకు అందుతుంది. అత్యంత శక్తివంతమైన బాలెనో ఆర్ఎస్ లో బ్రేకింగ్ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తూ నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులను అందివ్వడం జరిగింది.

డిజైన్ అంశాలు

డిజైన్ అంశాలు

డిజైన్ పరంగా బాలెనో ఆర్ఎస్ సాధారణ బాలెనో డిజైన్ అంశాలనే పోలి ఉంది. అయితే పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల ఇముడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్‌ను స్టాండర్డ్ అందివ్వడం జరిగింది. రెండు హెడ్ లైట్లను తాకుతూ ఉన్నటువంటి క్రోమ్ పట్టీ ఫ్రంట్ గ్రిల్ మద్యలో కలదు.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ విడుదల

ఎక్ట్సీరియర్ బాడీతో బాలెనో మరియు ఆర్ఎస్ వేరియంట్లను పోల్చితే, ఆర్ఎస్‌లో ఉన్న క్రోమ్ సొబగులను గుర్తించవచ్చు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, బాడీ కలర్‌లో ఉన్న అవుట్ సైడ్ రియర్ మిర్రర్స్ మరియు ఇండికేటర్స్ కలవు, మరియు బాడీ కలర్‌లో ఉన్న ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ విడుదల

నల్లటి రంగును పులుముకున్న అల్లాయ్ వీల్స్ నాలుకు చక్రాలకు అందించారు. వెనుక వైపు డిజైన్ విషయానికి వస్తే, బాలెనో ఆర్ఎస్ స్పోర్ట్స్‌లో రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ ఎల్ఇడి టెయిల్ లైట్ల కాంబినేషన్, ఆర్ఎస్ బ్యాడ్జి మరియు నెంబర్ ప్లేట్ కోసం ప్రత్యేకమైన ఆకృతిలో బంపర్ డిజైన్ కలదు.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ విడుదల

బాలెనో ఆర్ఎస్ ఇంటీరియర్‌ విషయానికి వస్తే, బ్లాక్ థీమ్ లెథర్ ఇంటీరియర్, లెథర్ తొడుగు ఉన్న స్టీరింగ్ వీల్, మారుతి వారి తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లున్నాయి.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ విడుదల

అదనపు ఫీచర్లయిన పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ ఎయిక్ కండీషనింగ్, రిమోట్ కీ లెస్ ఎంట్రీ మరియు సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే అవకాశం ఉంది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ విడుదల

మారుతి భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఫోర్స్ లిమిటర్లు గల సీట్ బెల్ట్ ప్రి టెన్షనర్,ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ వంటి వాటిని ఇందులో అందించింది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ విడుదల

సరికొత్త మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ హాట్ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం విపణిలో ఉన్న వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ టిఎస్ఐ, ఫియట్ అబర్త్ పుంటో మరియు ఫోర్డ్ ఫిగో 1.5-లీటర్ పెట్రోల్ వేరియంట్ వంటి వాటికి గట్టి పోటీనివ్వగలదు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

మారుతి సుజుకి ఒక్కో సెగ్మెంట్లోకి ఆలస్యంగా ప్రవేశిస్తోంది. అందులో హాట్ హ్యాచ్‌బ్యాక్(శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్) ఒకటి. అత్యంత అగ్రెసివ్‌గా మారుతి దీని ధరను నిర్ణయించింది, ఇప్పటికే దేశవ్యాప్తంగా శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ ప్రేమికులు బారీగా ఉన్నారు, కాబట్టి ఈ సెగ్మెంట్లో బాలెనో ఆర్ఎస్ మంచి విజయాన్నివ్వడం ఖాయం....

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ విడుదల

మరిన్ని మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ హ్యాచ్‌బ్యాక్ ఫోటోల కోసం....

Most Read Articles

English summary
Maruti Baleno RS Launched In India; Priced At Rs 8.69 Lakh
Story first published: Saturday, March 4, 2017, 11:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X