భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా మళ్లీ అదే కారు: ఆల్టో కాదండోయ్!!

Written By:

మారుతి సుజుకి ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త మూడవ తరానికి చెందిన డిజైర్ కాంపాక్ట్ సెడాన్‍‌ను విడుదల చేసింది, మరియు ఇది విడుదలైనప్పటి నుండి రోజు రోజుకీ భారీ విజయాన్ని అందుకుంటోంది. దీంతో వరుసగా చివరి రెండు నెలల్లో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా మొదటి స్థానంలో నిలిచింది.

మారుతి సుజుకి డిజైర్

మారుతి సుజుకి ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త మూడవ తరానికి చెందిన డిజైర్ కాంపాక్ట్ సెడాన్‍‌ను విడుదల చేసింది, మరియు ఇది విడుదలైనప్పటి నుండి రోజు రోజుకీ భారీ విజయాన్ని అందుకుంటోంది. దీంతో వరుసగా చివరి రెండు నెలల్లో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా మొదటి స్థానంలో నిలిచింది.

మారుతి సుజుకి డిజైర్

గడిచిన సెప్టెంబరు 2017 లో దేశవ్యాప్తంగా 34,000 యూనిట్ల డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు నెల ఆగష్టు 2017లో 31,000 యూనిట్ల డిజైర్ కార్లను మారుతి విక్రయించింది. ఉత్పత్తికి మించిన డిమాండ్ ఎదురవుతున్నప్పటికీ మారుతి భారీ సంఖ్యలో డిజైర్ డెలివరీలు ఇస్తోంది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
మారుతి సుజుకి డిజైర్

మారుతి సుజుకి ఇండియా లైనప్‌లో సరికొత్త డిజైర్ మీద డిమాండ్ భారీగా ఉంది. ప్రస్తుతం 40,000 మందికి పైగా డిజైర్ డెలివరీ కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఈ కాంపాక్ట్ సెడాన్ మీద వెయిటింగ్ పీరియడ్ తగ్గించడానికి మారుతి తమ గుజరాత్ ప్లాంటులో ఉత్పత్తిని పెంచుతోంది.

మారుతి సుజుకి డిజైర్

డిజైర్‌ను కేవలం వ్యక్తిగత అవసరాలకు మాత్రమే కాదు క్యాబ్ తరహా వాణిజ్య అవసరాలకు కూడా అధికంగా ఎంచుకుంటున్నారు. దేశ నలుమూలల నుండి డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌కు ఇటు క్యాబుగా, అటు పర్సనల్ కారుగా కస్టమర్లు బ్రహ్మరథం పడుతున్నారు.

మారుతి సుజుకి డిజైర్

కొత్త వెర్షన్‌లో వచ్చిన డిజైర్ మునుపటి తరానికి చెందిన డిజైర్‌తో పోల్చుకుంటే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. డిజైన్ మరియు స్టైల్ మొత్తం మారిపోయింది. అంతే పాత తరం డిజైర్‌ కన్నా కొత్త చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

మారుతి సుజుకి డిజైర్

ఎక్ట్సీరియర్ మాత్రమే కాదు, ఇంటీరియర్ విషయానికి వచ్చినా... డిజైర్ చీప్ కారు అనే ఫీల్ అస్సలు కలగదు. ప్రీమియమ్ మరియు లగ్జరీ ఫీల్ కలిగించే ఇంటీరియర్ నూతన డిజైర్ సొంతం. తక్కువ బరువుతో నిర్మించబడిన డిజైర్‌లో అత్యుత్తమ పికప్ మరియు మైలేజ్ సాధ్యమయ్యింది.

మారుతి సుజుకి డిజైర్

అంతే కాకుండా ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో ఆప్షనల్‌గా అందివ్వడం జరిగింది. కస్టమర్ల సౌకర్యం మరియు భద్రతకు పెద్ద పీట వేస్తూ అనేక ఫీచర్లను బడ్జెట్ ధరలోనే పరిచయం చేసింది.

మారుతి సుజుకి డిజైర్

వివిధ రకాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా విభిన్న ఇంజన్ ఆప్షన్‌లు నూతన డిజైర్‌లో ఉన్నాయి. అత్యుత్తమ పవర్, టార్క్ మరియు మైలేజ్ ఇవ్వగల 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ వేరియంట్లు ఉన్నాయి.

మారుతి సుజుకి డిజైర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొన్ని సంవత్సరాల నుండి ప్రతి నెలా భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారు మారుతి ఆల్టో మొదటి స్థానంలో నిలిచేది. అయితే, గత రెండు నెలల నుండి మారుతి డిజైర్ భారీ విక్రయాలతో ఆల్టో స్థానాన్ని డిజైర్ సొంతం చేసుకుంది.

మారుతి సుజుకి విడుదల చేసే ప్రతి మోడల్ సామాన్యుడి అవసరాలకు చాలా దగ్గరగా ఉండటం, బడ్జెట్ ధరలో విలాసవంతమైన ఇంటీరియర్ ఫీచర్లు, దేశవ్యాప్తంగా ఉన్న విసృతమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా తిరుగులేని విజయాన్ని అందుకుంటోంది.

English summary
Read In Telugu: Maruti Dzire becomes India’s highest-selling car, yet again
Story first published: Tuesday, October 10, 2017, 12:55 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark