నవంబర్ డిస్కౌంట్స్: ఆరు కార్ల మీద అదిరిపోయే ఆఫర్లు ప్రకటించిన మారుతి సుజుకి

Written By:

పండుగ సీజన్ వెళ్లిపోవడంతో కార్ల మీద ఉన్న ఆఫర్లన్నీ వెళ్లిపోయాయని దిగులు చెందుతున్నారా....? డోంట్ వర్రీ... మీలాంటి కస్టమర్ల కోసం భారతదేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ మోస్ట్ పాపులర్ మోడళ్ల మీద భారీ డిస్కౌంట్లతో ముందుకొచ్చింది. ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు కొన్ని కార్ల మీద ఏకంగా లక్ష రుపాయల డిస్కౌంట్ ప్రకటించింది.

మారుతి సుజుకి ఆఫర్లు

నవంబరు 2017 కోసం మారుతి సుజుకి ప్రకటించిన ఆఫర్లు దేశవ్యాప్తంగా ఎంచుకోదగిన మోడళ్ల మీద అమల్లోకి వచ్చాయి. మరెందుకు ఆలస్యం ఏ యే కార్ల మీద ఎలాంటి ఆఫర్లున్నాయో చూద్దాం రండి...

Recommended Video - Watch Now!
[Telugu] 2017 Skoda Octavia RS Launched In India - DriveSpark
మారుతి సుజుకి ఆఫర్లు

మారుతి సుజుకి ఆల్టో

సుమారుగా రెండు దశాబ్దాలుగా భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ కారుగా నిలిచి మారుతి ఆల్టో డిజైర్ మరియు రెనో క్విడ్ కారణంగా ఒక మెట్టు క్రిందకుదిగి ఇండియా యొక్క రెండవ బెస్ట్ సెల్లింగ్ కారుగా జాబితాలో నిలిచింది. పోటీపెరిగడంతో స్థానం మారినప్పటికీ ఆల్టో అమ్మకాల్లో ఏలాంటి మార్పులు జరగలేదు.

మారుతి సుజుకి ఆఫర్లు

మారుతి ఆల్టో 800సీసీ మరియు 1 లీటర్ రెండు ఇంజన్ వేరియంట్ల మీద నవంబర్ 2017 ఆఫర్లు వర్తిస్తున్నాయి. ఆల్టో పెట్రోల్ మరియు సిఎన్‌జి వేరియంట్ల మీద 20 వేలు క్యాష్ బ్యాక్, 25 వేలు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు 5 వేలు కార్పోరేట్ ఆఫర్‌తో కలుపుకొని మొత్తం రూ. 50,000 రుపాయల వరకు లాభాలను అందిస్తోంది.

మారుతి సుజుకి ఆఫర్లు

మారుతి ఆల్టో కె10 ఆటోమేటిక్ వేరియంట్ల మీద 17 వేల రుపాయల క్యాష్ బ్యాక్, 20 రుపాయల ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు 5 వేల రుపాయల కార్పోరేట్ ఆఫర్ కలుపుకొని మొత్తం రూ. 47,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

మారుతి సుజుకి ఆఫర్లు

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి లైనప్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌ స్థానాన్ని వచ్చే ఏడాది రాను సరికొత్త స్విఫ్ట్ భర్తీ చేయనుంది. దీంతో చాలా మంది స్విఫ్ట్ ప్రేమికులు అప్‌డేటెడ్ స్విఫ్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో వీలైనన్ని విక్రయాలు జరిపేందుకు స్విఫ్ట్ మీద డిస్కౌంట్లను ప్రకటించింది.

మారుతి సుజుకి ఆఫర్లు

మారుతి స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ మీద రూ. 15,000 లు క్యాష్ బ్యాక్, రూ. 20,000 లు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ ఆఫర్ రూ. 5 వేలతో కలుపుకొని మొత్తం రూ. 40,000 ల డిస్కౌంట్ ప్రకటించింది.

మారుతి సుజుకి ఆఫర్లు

మారుతి స్విఫ్ట్ డీజల్ హ్యాచ్‌బ్యాక్ మీద రూ. 20,000 లు క్యాష్ బ్యాక్, రూ. 20,000 లు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ ఆఫర్ రూ. 5 వేలతో కలుపుకొని మొత్తం రూ. 40,000 ల డిస్కౌంట్ ప్రకటించింది.

మారుతి సుజుకి ఆఫర్లు

మారుతి సుజుకి సెలెరియో

మారుతి సుజుకి సెలెరియోను టాటా టియాగో పోటీని చెప్పుకోవచ్చు. విపణిలో ఇప్పుడు టాటా టియాగో మరియు మారుతి సెలెరియో మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మారుతి అతి త్వరలో సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌ను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ విడుదలకు సిద్దం చేస్తోంది.

మారుతి సుజుకి ఆఫర్లు

అయితే, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కు ముందు ప్రస్తుతం లైనప్‌లో ఉన్న సెలెరియో మీద యాభై వేలకు పైగా డిస్కౌంట్లను ప్రకటించింది. మారుతి సెలెరియో మ్యాన్యువల్ వేరియంట్ మీద రూ. 25,000 లు క్యాష్ బ్యాక్, రూ. 19,000 లు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ ఆఫర్ రూ. 5 వేలతో కలుపుకొని మొత్తం రూ. 49,000 ల డిస్కౌంట్ ప్రకటించింది.

మారుతి సుజుకి ఆఫర్లు

అదే విధంగా మారుతి సెలెరియోలోని ఆటోమేటిక్ వేరియంట్ ఎంచుకునే వారికి రూ. 29,000 లు క్యాష్ బ్యాక్, రూ. 24,000 లు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ ఆఫర్ రూ. 5 వేలతో కలుపుకొని మొత్తం రూ. 58,000 ల డిస్కౌంట్ ప్రకటించింది.

మారుతి సుజుకి ఆఫర్లు

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

బాక్సీ స్టైల్ వ్యాగన్ఆర్ విడుదలైనప్పటి నుండి భారీ సేల్స్ సాధించింది. ఇండియాలో 20 లక్షల వ్యాగన్ఆర్ కార్ల రోడ్డు మీద ఉన్నాయి. వ్యాగన్ఆర్ ఈ మధ్యనే ఈ రికార్డును నెలకొల్పింది. ఇండియన్స్ ఎక్కువగా ఎంచుకుంటున్న వ్యాగన్ఆర్ మీద గరిష్టంగా రూ. 60,000 ల డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.

మారుతి సుజుకి ఆఫర్లు

వ్యాగన్ఆర్ కారును ఎక్కువ మంది కస్టమర్లు క్యాబ్ మరియు అద్దె కోసం కాకుండా వ్యక్తిగత అవసరాలకే ఎంచుకుంటున్నారు. అందుకే సిఎన్‌జి వేరియంట్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో వ్యాగన్ఆర్ సిఎన్‌జి, పెట్రోల్ మరియు ఆటోమేటిక్ అన్ని వేరియంట్ల మీద ఒకే తరహా డిస్కౌంట్లను ప్రకటిచింది.

మారుతి సుజుకి ఆఫర్లు

వ్యాగన్ఆర్ మీద రూ. 30,000 లు క్యాష్ బ్యాక్, రూ. 25,000 లు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ ఆఫర్ రూ. 5 వేలతో కలుపుకొని మొత్తం రూ. 60,000 ల డిస్కౌంట్ ప్రకటించింది.

మారుతి సుజుకి ఆఫర్లు

మారుతి సుజుకి ఎర్టిగా

మారుతి ప్యాసింజర్ కార్ల లైనప్‌లో ఫ్యామిలీకి బాగా సెట్ అయ్యే కారు ఎర్టిగా. ఎక్కువ మంది ఫ్యామిలీలు ఎర్టిగా ఎమ్‌పీవిని ఎంచుకోవడంతో అధిక మైలేజ్ కోసం డీజల్ వెర్షన్‌లో హైబ్రిడ్ టెక్నాలజీని పరిచయం చేసింది. అయితే, జిఎస్‌టి రావడంతో హైబ్రిడ్ వేరియంట్ల కార్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సేల్స్ కోసం ఎర్టిగా మీద భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.

మారుతి సుజుకి ఆఫర్లు

మారుతి ఎర్టిగా డీజల్-హైబ్రిడ్ వేరియంట్ మీద రూ. 20,000 ల క్యాష్ బ్యాక్, రూ. 45,000ల ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు రూ.5,000 ల కార్పోరేట్ ఆఫర్‌తో కలుపుకొని మొత్తం 70,000 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది.

మారుతి సుజుకి ఆఫర్లు

ఎర్టిగా ఎమ్‌‌పీవీ లోని పెట్రోల్ మరియు సిఎన్‌జి వేరియంట్ల మీద రూ. 5,000 ల క్యాష్ బ్యాక్, రూ. 20,000ల ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు రూ.5,000 ల కార్పోరేట్ ఆఫర్‌తో కలుపుకొని మొత్తం 00,000 రుపాయల డిస్కౌంట్ ప్రకటించింది.

మారుతి సుజుకి ఆఫర్లు

మారుతి సుజుకి సియాజ్

మారుతి సుజుకి లైనప్‌లో ఉన్న ఏకైక మిడ్ సైజ్ సెడాన్ కారు సియాజ్. దీని మీద మారుతి గరిష్టంగా రూ. 1 లక్ష రుపాయల డిస్కౌంట్ ప్రకటించింది. విపణిలో ఉన్న హోండా సిటి మరియు హ్యుందాయ్ వెర్నా నుండి గట్టి పోటీని ఎదుర్కుంటున్న తరుణంలో సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మీద భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.

మారుతి సుజుకి ఆఫర్లు

దీనికి, తోడు నూతన ట్యాక్స్ విధానం జీఎస్‌టీని అమల్లోకి తీసుకురావడంతో గతంలో హైబ్రిడ్ కార్ల మీద వర్తించే లాభాలను వెనక్కి వెళ్లిపోయాయి. అంతే కాకుండా హైబ్రిడ్ కార్ల మీద ట్యాక్స్ విపరీతంగా పెరగడంతో ఈ టెక్నాలజీ గల కార్ల సేల్స్ పూర్తిగా పడిపోయాయి.

మారుతి సుజుకి ఆఫర్లు

మారుతి సుజుకి సియాజ్ డీజల్ హైబ్రిడ్ వేరియంట్ మీద రూ. 40,000 ల క్యాష్ బ్యాక్, రూ. 50,000 ల ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు రూ. 10,000 కార్పోరేట్ ఆఫర్ కలుపుకొని మొత్తం రూ. 1,00,000ల డిస్కౌంట్ ప్రకటించింది.

మారుతి సుజుకి ఆఫర్లు

సియాజ్ పెట్రోల్ వేరియంట్ మీద రూ. 20,000 ల క్యాష్ బ్యాక్, రూ. 50,000 ల ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు రూ. 10,000 కార్పోరేట్ ఆఫర్ కలుపుకొని మొత్తం రూ. 80,000ల డిస్కౌంట్ ప్రకటించింది.

English summary
Read In Telugu: Maruti offering large discounts on Ciaz, Swift, Alto, Celerio, WagonR & Ertiga

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark