మారుతి సుజుకి నుండి దిమ్మతిరిగే మోడల్

Written By:

మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో క్విడ్ నుండి గట్టి పోటీని ఎదుర్కుటోంది. ఎలాగైనా క్విడ్ ప్రభంజనానికి చెక్ పెట్టేందుకు సరికొత్త క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్‌ను అభివృద్ది చేస్తోంది. 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శనకు రానున్న దీని గురించి మరింత సమాచారం కోసం....

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మారుతి సుజుకి చిన్న కారు

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతి సుజుకి సంస్థకు చెందినవే ఎనిమిది కార్లు ఉన్నాయి. అయినప్పటికీ ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం రెనో విడుదల చేసిన క్విడ్ ఎంట్రీ లెవల్ కారు మెల్ల మెల్లగా మారుతి ఆల్టో అమ్మకాలను తినేస్తోంది.

మారుతి సుజుకి చిన్న కారు

ఈ కారణంతో క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కారుకు విపణిలో చెక్ పెట్టేందుకు సరికొత్త డిజైన్ భాషలో నూతన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను మారుతి సుజుకి అభివృద్ది చేస్తోంది. ప్రస్తుతానికి మార్కెట్ వర్గాలు దీనిని క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్ అని సంభోదిస్తున్నాయి.

మారుతి సుజుకి చిన్న కారు

2018 ఫిబ్రవరిలో జరగనున్న భారతీయ వాహన ప్రదర్శన వేదిక మీదకు రానున్న ఈ క్విడ్ కాంపిటీటర్‌ను 2018 లోనే విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ఆల్టో ను తొలగించి దీనిని ప్రవేశపెట్టే ఆలోచన అయితే లేదనే విషయం స్పష్టమవుతోంది.

మారుతి సుజుకి చిన్న కారు

మారుతి నూతన హ్యాచ్‌బ్యాక్ ఇంజన్ స్థానాన్ని 800సీసీ మరియు 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌లతో భర్తీ చేయనున్నట్లు సమాచారం.

మారుతి సుజుకి చిన్న కారు

ఈ మధ్య భారతీయ కస్టమర్లు ఎస్‌యూవీ ఆధారిత వాహనాలకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రెనో క్విడ్‌ను ప్రవేశపెట్టి భారీ విజయాన్ని మూటగట్టుకుంది.

మారుతి సుజుకి చిన్న కారు

క్విడ్‌కు ప్రత్యక్ష పోటీగా చెప్పుకునేందుకు దీనిని పూర్తిగా ఎస్‌యూవీ ప్రేరిత డిజైన్ శైలిలో మారుతి అభివృద్ది చేసింది. విభిన్నంగా కనిపించేందుకు ఆల్టో కన్నా ఎక్కువ ఎత్తును కలిగి ఉంది.

మారుతి సుజుకి చిన్న కారు

టాటా మోటార్స్ అద్బుతమైన ధరతో విప్లవాత్మక వాహనాన్ని విడుదల చేసింది. షోరూమ్‌కి వెళ్లే ముందు, క్రింది ఫోటో గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి.

English summary
No Kwidding — Maruti Set To Reveal New Hatchback At 2018 Auto Expo
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark