మారుతి దీపావళి ఆఫర్లు: లక్ష రుపాయల వరకు డిస్కౌంట్

Written By:

ఎంతో మంది కస్టమర్లు తమకు నచ్చిన కారును ఈ పండుగ పర్వాదినాల్లో ఎంచుకోవడానికి దీపావళి ఆఫర్లు ఎప్పుడొస్తాయా అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి కలల్ని నిజం చేస్తూ, కోటి కాంతుల దీపావళి సంబరాల్లో తమ కార్లను ఎంచుకునే కస్టమర్లకు మారుతి సుజుకి భారీ డిస్కౌంట్లు మరియు ఆఫర్లను ప్రకటించింది.

మారుతి ఏయే కార్ల మీద ఎలాంటి ఆఫర్లను ప్రకటించిందో ఇవాళ్టి కథనంలో సమగ్రంగా మీ కోసం...

మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి ఆల్టో

మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ మరియు ఎంట్రీ లెవల్ కారు ఆల్టో మీద దీపావళి ఆఫర్లను ప్రకటించి మధ్యతరగతి కస్టమర్లను చేరుకునే ప్రయత్నం చేస్తోంది. దీపావళి ఆఫర్ క్రింద ఆల్టో మీద రూ. 35,000 లు డిస్కౌంట్ మరియు కె10 వెర్షన్ మీద రూ. 27,000 ల గరిష్ట డిస్కౌంట్ లభిస్తోంది.

మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

ఏడేళ్ల వయస్సున్న కార్లతో ఎక్స్‌చ్చేంజ్ చేసుకునే వారు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ క్రింద రూ. 20,000 లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సున్న పాత కార్లను ఎక్స్‌చ్చేంజ్ చేసే వారికి పది వేల రుపాయల బోనస్ లభిస్తుంది.

మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

మారుతి వ్యాగన్ఆర్ మీద గరిష్టంగా రూ. 35,000 ల క్యాష్ డిస్కౌంట్ కలదు. వ్యాగన్ఆర్ ఆటోమేటిక్ వేరియంట్ మీద కూడా దీపావళి ఆఫర్ కలదు, ఈ వేరియంట్ మీద గరిష్టంగా రూ. 40,000 ల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

ఏడేళ్ల వయస్సున్న కార్ల ఎక్స్‌చ్చేంజ్ ద్వారా వ్యాగన్ఆర్ మ్యాన్యువల్ వేరియంట్ ఎంచుకునే వారికి రూ. 20,000 ల బోనస్ మరియు అంత కన్నా పాత కార్ల మీద 10 వేల బోనస్ లభిస్తోంది. అదే విధంగా, ఆటోమేటిక్ వేరియంట్లను ఎంచుకునే వారికి 7 ఏళ్ల వయస్సున్న కార్లకు రూ. 29,000 లు మరియు అంతకన్నా పాత కార్ల మీద రూ. 19,000 ల ఎక్స్‌చ్చేంజ్ బోనస్ కలదు.

Recommended Video - Watch Now!
2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి సుజుకి సెలెరియో

మారుతి తమ సెలెరియో హ్యాచ్‌బ్యాక్ మీద గరిష్టంగా రూ. 29,000 ల డిస్కౌంట్ మరియు ఎక్స్‌చ్చేంజ్ ద్వారా ఎంచుకునే వారికి 7-ఏళ్ల పాత కారు మీద రూ. 19,000 లు మరియు అంత కన్నా పాత కారు మీద రూ. 9,000 ల బోనస్ లభిస్తోంది.

మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

సెలెరియో ఆటోమేటిక్ వేరియంట్ మీద రూ. 34,000 ల డిస్కౌంట్, ఏడేళ్ల పాత వాహనాల డిస్కౌంట్ మీద రూ. 24,000 లు మరియు అంతకంటే పాత వాహనాల మీద రూ. 14,000 ల ఎక్స్‌చ్చేంజ్ బోనస్ అదనంగా లభిస్తోంది.

మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి ఇండియా లైనప్‌లో మోస్ట్ పాపులర్ హ్యాచ్‍‌బ్యాక్ కారుగా గుర్తింపు తెచ్చుకున్న స్విఫ్ట్ కారును వచ్చే ఏడాది భారీ మార్పులతో నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్‌గా విడుదల కానుంది. స్విఫ్ట్ లోని ఎల్ఎక్స్ఐ వేరియంట్ మీద రూ. 20,000 లు, విఎక్స్ఐ మరియు జడ్ఎక్స్ఐ వేరియంట్ల మీద రూ. 15,000 ల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

డీజల్ వెర్షన్ స్విఫ్ట్ మీద గరిష్టంగా రూ. 40,000 ల వరకు డిస్కౌంట్ కలదు. ఏడేళ్ల కంటే పాత వాహనాల మీద రూ. 15,500 లు మరియు అంత కంటే ఎక్కువ పాత వాహనాల ఎక్స్‌చ్చేంజ్ మీద రూ. 5,500 ల ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ లభిస్తోంది.

మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి సుజుకి ఎర్టిగా

మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పీవీ లోని వివిధ వేరియంట్ల మీద రకరకాల ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. మారుతి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ గల డీజల్ వెర్షన్ ఎర్టిగా మీద గరిష్టంగా రూ. 40,000 ల డిస్కౌంట్ మరియు ఏడేళ్ల పాత వెహికల్ మరియు అంత కంటే ఎక్కువ పాత వాహనాలతో ఎక్స్‌చ్చేంజ్ జరిపితే వాటి మీద వరుసగా రూ. 45,000 లు మరియు రూ. 35,000ల ఎక్స్‌చ్చేంజ్ బోనస్ లభిస్తుంది.

మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

ఎర్టిగా పెట్రోల్ వేరియంట్ మీద గరిష్టంగా రూ. 15,000 ల డిస్కౌంట్ కలదు. ఏడేళ్ల పాత వెహికల్ మీద రూ. 20,000 లు మరియు ఏడేళ్ల కంటే ఎక్కువ పాత వాహనాలతో ఎక్స్‌చ్చేంజ్ చేసుకుంటే 15,000 రుపాయల అదనపు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ లభిస్తుంది.

మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి సుజుకి సియాజ్

మారుతి సుజుకి మిడ్‌సైజ్ సెడాన్ సియాజ్ మీద ఈ సారి అత్యుత్తమ ఆఫర్లు, డిస్కౌంట్లు మరియు ఎక్స్‌చ్చేంజ్ బోనస్‌లు ప్రకటించింది. మారుతి సియాజ్ డీజల్ హైబ్రిడ్ వేరియంట్ మీద గరిష్టంగా లక్ష రుపాయల డిస్కౌంట్ కలదు.

మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

సియాజ్ డీజల్ వెర్షన్ మీద రూ. 40,000 ల క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 50,000 ల ఎక్స్‌చ్చేంజ్ బోనస్ కలదు. పెట్రోల్ వెర్షన్ సియాజ్ మీద కేవలం రూ. 50,000 ల ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మినహాయిస్తే ఎలాంటి అదనపు డిస్కౌంట్లు లేవు.

English summary
Read In Telugu: Maruti’s offering big Diwali discounts on Ciaz, Ertiga, Swift, Alto, Celerio and WagonR
Story first published: Friday, October 13, 2017, 14:15 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark