2018 జనవరిలో విడుదలవుతున్న కొత్త కార్లు

2018 జనవరిలో కొన్ని కొత్త కార్లు విడుదలవ్వడానికి ఇప్పటికే సర్వం సిద్దం చేసుకున్నాయి. మీ కోసం వచ్చే జనవరిలో విడుదలవుతున్న కార్లు మరియు వాటి వివరాలు నేటి కథనంలో...

By Anil

2017 సంవత్సరం ఎన్నో రకాల కొత్త కార్లు మరియు బైకులకు వేదికయ్యింది. 2017లో కొత్త కారు కొనాలని భావించి కొనలేకపోయిన వారు ఎందరో ఉంటారు. ఇప్పుడు వీరి దృష్టంతా వచ్చే ఏడాదిలో ఎలాంటి కార్లు విడుదలవుతున్నాయనే దాని మీద ఉంటుంది.

2018 జనవరిలో కొన్ని కొత్త కార్లు విడుదలవ్వడానికి ఇప్పటికే సర్వం సిద్దం చేసుకున్నాయి. మీ కోసం వచ్చే జనవరిలో విడుదలవుతున్న కార్లు మరియు వాటి వివరాలు నేటి కథనంలో...

2018 జనవరిలో విడుదలవుతున్న కొత్త కార్లు

5. డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్

డాట్సన్ ఎంట్రీ లెవల్ మరియు టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్ రెడి-గో కారు నిర్ధిష్టమైన సేల్స్ తీసుకొస్తోంది. తొలుత 0.8లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో, ఆ తరువాత 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో విడుదలైన రెడి-గో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌కు మాత్రమే పరిమితమైంది.

2018 జనవరిలో విడుదలవుతున్న కొత్త కార్లు

స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కార్లన్నింటిలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుండటంతో డాట్సన్ ఇండియా తమ రెడి-గో 1.0-లీటర్ వెర్షన్‌ను ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే జనవరి 2018 విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. రెగ్యులర్ మోడల్‌తో పోల్చుకుంటే ఆటోమేటిక్ వెర్షన్ రెడి-గో ధర రూ. 30,000 ల వరకు అధికంగా ఉండే ఛాన్స్ ఉంది.

Recommended Video

Best Cars India Should Get - DriveSpark
2018 జనవరిలో విడుదలవుతున్న కొత్త కార్లు

4. ఆడి క్యూ5

ఆడి ఇండియా 2018లో తొలి విడుదలగా క్యూ5 ఎస్‌యూవీని జనవరి 18, 2018 న లాంచ్ చేయడానికి నిర్ణయించుకుంది. గతంలో ఆడి పరిచయం చేసిన క్యూ5 తో పోల్చుకుంటే ఈ లేటెస్ట్ వెర్షన్ బరువు సుమారుగా 100కిలోల వరకు తగ్గిపోయింది. సరికొత్త ఆడి క్యూ5 న్యూ సింగల్ ఫ్రేమ్ గ్రిల్ మరియు మ్యాట్రిక్స్ ఎల్ఇడి హెడ్ లైట్లు మరియు ఎల్ఇడి ల్యాంప్స్‌తో రానుంది.

2018 జనవరిలో విడుదలవుతున్న కొత్త కార్లు

సాంకేతికంగా క్యూ5 ఎస్‌యూవీలో 2.0-లీటర్ కెపాసిటి గల క్వాట్రో అల్ట్రా టిడిఐ డీజల్ ఇంజన్ రానుంది. ఇది 163 మరియు 190 రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేస్తుంది, అయితే గరిష్టంగా 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా 2.0-లీటర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ మరియు ఆడి క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

2018 జనవరిలో విడుదలవుతున్న కొత్త కార్లు

3. లెక్సస్ ఎల్ఎస్500హెచ్

టయోటా కిర్లోస్కర్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ లెక్సస్ వచ్చే ఏడాది ఎల్ఎస్500హెచ్ లగ్జరీ సెడాన్‌ని లాంచ్ చేయడానికి సిద్దమైంది. జనవరి 15, 2018 వ తేదీని తమ లగ్జరీ హైబ్రిడ్ సెడాన్ కారును లెక్సస్ లాంచ్ చేయనుంది. లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ ధర అంచనాగా రూ. 1.5 కోట్ల వరకు ఉండవచ్చు.

2018 జనవరిలో విడుదలవుతున్న కొత్త కార్లు

లెక్సస్ ఎల్ఎస్500హెచ్ సెడాన్‌ కారులో 3.5-లీటర్ కెపాసిటి గల వి6 పెట్రోల్ ఇంజన్ రెండు ఎలక్ట్రిక్ మోటార్ల అనుసంధానంతో వస్తోంది. పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు గల ఇందులో హైబ్రిడ్ వ్యవస్థ గరిష్టంగా 354బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 10-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో వచ్చే ఎల్ఎస్ 500హెచ్ 5.2-సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది.

Trending On DriveSpark Telugu:

అందరూ స్పాట్‌లోనే ఛిద్రమయ్యారు

37 కిమీల మైలేజ్‌తో బాలెనోకు పోటీగా వస్తున్న నిస్సాన్ నోట్

2018 ఫిబ్రవరిలో భారీ సంచలనానికి తెర దించిన మారుతి

2018 జనవరిలో విడుదలవుతున్న కొత్త కార్లు

2. పోర్షే పనమెరా స్పోర్ట్ టురిస్మో

జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే ఈ జనవరి 2018లో విపణిలోకి సరికొత్త పనమెరా స్పోర్ట్ టురిస్మో లగ్జరీ కారును విడుదల చేస్తోంది. చూడటానికి రెగ్యులర్ వెర్షన్ పనమెరా కారునే పోలి ఉన్నప్పటికీ ఇది టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్‌తో రానుంది.

2018 జనవరిలో విడుదలవుతున్న కొత్త కార్లు

పోర్షే తమ పనమెరా స్పోర్ట్ టురిస్మో మీద ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది. టుర్బో స్పోర్ట్ టురిస్మో ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.08 కోట్లు మరియు దీనితో పాటు విడుదల కానున్న మరో వేరియంట్ పనమెరా టుర్బో ఎస్ ఇ-హైబ్రిడ్ స్పోర్ట్ టురిస్మో ధర రూ. 2.38 కోట్లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

2018 జనవరిలో విడుదలవుతున్న కొత్త కార్లు

1. ల్యాంబోర్ఘిని ఉరస్

సూపర్ కార్ల తయారీ సంస్థ ల్యాంబోర్ఘిని జనవరి 11, 2018 వ తేదీన ఉరస్ లగ్జరీ మరియు హై పర్ఫామెన్స్ ఎస్‌యూవీని లాంచ్ చేస్తోంది. 2018 ఏడాదిలో జరుగుతున్న అతి పెద్ద లాంచ్ ఇదేనని చెప్పవచ్చు. ల్యాంబోర్ఘిని తమ హురాకాన్ మరియు అవెంటేడర్ సూపర్ కార్ల నుండి సేకరించిన అంశాలతో ఉరస్ ఎస్‌యూవీని డెవలప్ చేసింది.

2018 జనవరిలో విడుదలవుతున్న కొత్త కార్లు

ల్యాంబోర్ఘిని ఉరస్ ఎస్‌యూవీలో 4.0-లీటర్ కెపాసిటి గల ట్విన్ టుర్బో వి8 ఇంజన్ అందిస్తోంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న ఇది 621బిహెచ్‌పి పవర్ మరియు 850ఎన్ఎమ్ టార్క్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా అన్ని చక్రాలకు అందనుంది. ఇంటీరియర్‌లో ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ లెథర్ సీట్లు, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఎన్నో అధునాతన ఫీచర్లను అందిస్తోంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: New car launches in January 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X