సరికొత్త 2018 ఆల్టో: మరోసారి సత్తా చాటుకోనున్న మారుతి

Written By:

మారుతి సుజుకి భారత విపణిలోకి విడుదల చేసే ప్రతి మోడల్ భారీ సేల్స్‌తో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలోకి చేరుతున్నాయి. అందులో తాజాగా విడుదలైన కొత్త డిజైర్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

మారుతి సుజుకి 2018 ఆల్టో

భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా కొన్ని సంవత్సరాల నుండి మొదటి స్థానంలో ఉన్న ఆల్టోను క్రిందకు నెట్టేసి, ఆ స్థానాన్ని డిజైర్ ఆక్రమించేసింది. ధర ఏ మాత్రం లెక్కచేయకుండా విడుదలైనప్పటి నుండి డిజైర్‌ను భారీగా ఎంచుకుంటున్నారు. దీంతో డిమాండుకు తగ్గ ఉత్పత్తి చేయలేక మారుతి భారీ వెయిటింగ్ పీరియడ్ ప్రకటించింది.

Recommended Video - Watch Now!
[Telugu] 2018 Hyundai Verna Indian Model Unveiled - DriveSpark
మారుతి సుజుకి 2018 ఆల్టో

ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో పూర్తి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న మారుతి వచ్చే ఏడాది కొత్త తరం స్విఫ్ట్ మరియు ఆల్టో కార్లను విడుదలకు సిద్దం చేస్తోంది. నూతన ఆల్టో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇది కనుక మార్కెట్లోకి లాంచ్ అయితే, ప్రతి మద్య తగరగతి ఫ్యామిలీకి బెస్ట్ కారుగా నిలవనుంది. దీని గురించి వివరాలు ఇవాళ్టి కథనంలో...

మారుతి సుజుకి 2018 ఆల్టో

2018 మారుతి ఆల్టో గా రానున్న మోడల్ జపాన్ డొమెస్టిక్ మార్కెట్లో సుజుకి ఆల్టోగా అమ్మడవుతోంది. కొత్త తరం ఆల్టో 660సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్‌తో రానున్నట్లు సమాచారం.

Trending On DriveSpark Telugu:

మహీంద్రా & టాటా లకు మారుతి సుజుకి దిమ్మతిరిగే షాక్

కొత్త కార్ల రిజిస్ట్రేషన్ నిలిపేసిన సింగపూర్

ఇండియాలో అత్యధిక మైలేజ్ ఇచ్చే 14 బెస్ట్ డీజల్ కార్లు

మారుతి సుజుకి 2018 ఆల్టో

క్రాసోవర్ డిజైన్ శైలిలో వచ్చే 2018 మారుతి ఆల్టో లోని 660సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ అత్యుత్తమ మైలేజ్ మరియు పవర్ ఉత్పత్తి చేస్తుంది. 658సామర్థ్యమున్న R06A పెట్రోల్ యూనిట్ ఇంజన్ 51బిహెచ్‌పి పవర్ మరియు 63ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగలదు.

మారుతి సుజుకి 2018 ఆల్టో

జపాన్ జెసి08 సైకిల్ మైలేజ్ టెస్టులో లీటర్‌కు 37కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదని నిరూపించబడింది. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న 796(800సీసీ) ఇంజన్ కంటే తక్కువ శబ్దాన్ని ఇస్తుంది.

మారుతి సుజుకి 2018 ఆల్టో

డిజైన్ మార్పులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆల్టో కన్నా పొడవుగా ఉంటుంది. అంతే కాకుండా దానితో పోల్చుకుంటే తేలికపాటి బరువును కలిగి ఉండటం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

మారుతి సుజుకి 2018 ఆల్టో

ప్రతి ఇండియన్ కస్టమర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2018 మారుతి ఆల్టోను రూపొందించడం జరుగుతోంది. దీని విడుదల గురించి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే, 2018 చివరి నాటికి మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.

మారుతి సుజుకి 2018 ఆల్టో

ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ మీద నూతన మార్పులతో వస్తున్న సరికొత్త 2018 మారుతి ఆల్టో ప్రారంభ ధర రూ. 2. 8 లక్షలు మరియు గరిష్ట ధర రూ. 4.2 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.

మారుతి సుజుకి 2018 ఆల్టో

ఎక్ట్సీరియర్ డిజైన్:

ప్రస్తుతం ఉన్న మారుతి ఆల్టో డిజైన్‌‌తో పోల్చుకుంటే అప్‌కమింగ్ ఆల్టో డిజైన్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఆకర్షణీయమైన మరియు విభిన్న లుక్ సొంతం చేసుకునేందుకు అధునాతన ఫ్రంట్ గ్రిల్, హెడ్ ల్యాంప్ డిజైన్‌తో పాటు పొడవాటి బాడీ, రియర్ స్పాయిలర్ మరియు క్విడ్‌తో పోల్చుకుంటే మంచి స్పోర్టి శైలిని పొందేంకు సరికొత్త బంపర్లు కూడా ఇందులో ఉన్నాయి.

మారుతి సుజుకి 2018 ఆల్టో

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్లు:

ఎక్ట్సీరియర్ తరహాలోనే ఇంటీరియర్ మొత్తం మారిపోయింది. సరికొత్త అప్‌హోల్‌స్ట్రే మరియు డ్యాష్ బోర్డుతో పాటు విశాలమైన క్యాబిన్ మరియు బూట్ స్పేస్ కల్పించడం జరిగింది. అధిక లగేజ్ స్పేస్ కోసం చివరి వరుస సీటును మడిపివేసే అవకాశం కూడా కలదు.

మారుతి సుజుకి 2018 ఆల్టో

భద్రత పరంగా 2018 మారుతి ఆల్టో కారులో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగును తప్పనిసరిగా అందించి, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను ఆప్షనల్‌గా పరిచయం చేయనుంది.

మారుతి సుజుకి 2018 ఆల్టో

వీటితో పాటు ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, నాలుగు పవర్ విండోలు, బ్లూటూత్, ఏయుఎక్సక్ కనెక్టివిటి, రిమోట్ లాకింగ్, మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లతో పాటు మరెన్నో ఫీచర్లున్నాయి.

English summary
Read In Telugu: Next-Gen Maruti Alto To Launch With a 660cc Engine; Expect 30 KMPL of Max. Mileage!

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark