ఎస్-క్రాస్ మీద బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి

Written By:

మారుతి సుజుకి ఎస్-క్రాస్ కాంపాక్ట్ క్రాసోవర్ మీద బుకింగ్స్ ప్రారంభించింది. నెక్ట్స్ జనరేషన్ ఎస్-క్రాస్ ను ఈ వారంలోనే విపణిలోకి విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా 280కి పైగా ఉన్నా నెక్సా విక్రయ కేంద్రాలలో రూ. 11,000 లు చెల్లించి ఫేస్‌లిఫ్ట్ ఎస్-క్రాస్‌ను బుక్ చేసుకోవచ్చు.

మారుతి ఎస్-క్రాస్

మారుతి ఫేస్‌లిఫ్ట్ ఎస్-క్రాస్ క్రాసోవర్ 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ ఫ్రమ్ సుజుకి(SHVS) పరిజ్ఞానంతో రానుంది. అయితే, 1.6-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌ ఇందులో రావడం లేదు.

మారుతి ఎస్-క్రాస్

ఎస్-క్రాస్ రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చుకుంటే ఫ్రంట్ డిజైన్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కండలు తిరిగిన శరీరాకృతితో, క్రోమ్ సరౌండింగ్స్ గల హెడ్ ల్యాంప్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్‌తో పాటు సరికొత్త క్రోమ్ ఫ్రంట్ గ్రిల్ వంటివి ప్రత్యేకాకర్షణగా నిలిచాయి.

మారుతి ఎస్-క్రాస్

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్లో సరికొత్త ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే లైట్లతో పాటు బానెట్ మరియు బంపర్‌ను రీడిజైన్ చేసి అందివ్వడం జరిగింది.

మారుతి ఎస్-క్రాస్

ఎస్-క్రాస్ ప్రక్క డిజైన్‌ను పరిశీలిస్తే, మునుపటి వెర్షన్‌నే పోలి ఉంటుంది. అయితే, ఇందులో నూతన 215/60 ఆర్16 టైర్లు ఉన్నాయి. ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌లో నూతన డ్యూయల్ టోన్ మెషీన్ ఫినిషింగ్ గల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. రియర్ డిజైన్‌లో సరికొత్త ఎల్ఇడి టెయిల్ లైట్ క్లస్టర్ కలదు.

మారుతి ఎస్-క్రాస్

మారుతి ఎస్-క్రాస్ ఇంటీరియర్‌లో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల సరికొత్త టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రానుంది. ఎక్ట్సీరియర్‌లో ఉన్న క్రోమ్ సొబగుల తరహాలోనే, ఇంటీరియర్‌లో పియానో బ్లాక్ తొడుగులు ఉన్నాయి. సాఫ్ట్ ఫీల్ కలిగించే మెటీరియల్‌తో రూపొందించిన డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ ఇందులో ఉన్నాయి.

మారుతి ఎస్-క్రాస్

గతంలో వచ్చిన కథనం మేరకు, మారుతి ఎస్-క్రాస్ లో 1.6-లీటర్ డీజల్ ఇంజన్ రావడం లేదు, కేవలం 1.3-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ మాత్రమే అందివ్వడానికి మారుతి సిద్దమవుతోంది. మధ్యమ స్థాయి హైబ్రిడ్ టెక్నాలజీతో 1248సీసీ కెపాసిటి ఉన్న డీజల్ ఇంంజన్ 90బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్ ప్రస్తుతం సియాజ్ మరియు ఎర్టిగా కార్లలో కూడా ఉంది.

మారుతి ఎస్-క్రాస్

ఎస్-క్రాస్‌లో రానున్న ఇంజన్ నూతన స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో లభించనుంది. ఇందులో హైబ్రిడ్ సాంకేతికతను ప్రవేశపెడుతుండటంతో, బ్రేక్ ఎనర్జీ ద్వారా ఉత్పత్తి అయ్యే పవర్ ఇంటగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ మోటర్‌కు అందుతుంది. ప్రస్తుతం ఉన్న ఎస్-క్రాస్ తో పోల్చుకుంటే అతి త్వరలో విడుదల కానున్న ఇది ఎంతో శక్తివంతమైనది.

మారుతి ఎస్-క్రాస్

మారుతి సుజుకి రోహ్తక్ లోని సంస్థ యొక్క అధునాతన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రంలో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి, పరీక్షించింది. దీనిని ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్, సైడ్ ఇంపాక్ట్ మరియు పెడస్ట్రైన్ సేఫ్టీ వంటి అంశాలకు అనుగుణంగా నిర్మించారు.

మారుతి ఎస్-క్రాస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ విపణిలోకి విడుదలైతే, మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ లోని కొన్ని వేరియంట్లకు గట్టి పోటీనివ్వనుంది. అంతే కాకుండా, ఇది మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానుండటంతో రూ. 8 లక్షల నుండి 10 లక్షల ధరల శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Maruti Suzuki Commences Bookings For The New Version Of S-Cross
Story first published: Tuesday, September 26, 2017, 12:07 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark