విడుదలకు సిద్దమైన నెక్ట్స్ జనరేషన్ రెనో డస్టర్

Written By:

రెనో సంస్థకు తోబుట్టువుగా ఉన్న డాసియా సంస్థ తమ సెకండ్ జనరేషన్ డస్టర్‌ను ప్యారిస్‌లో జరగనున్న స్పెషల్ ఈవెంట్‌లో ఆవిష్కరించనుంది. అయితే డాసియా దీనిని అధికారికంగా 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
నెక్ట్స్ జనరేషన్ రెనో డస్టర్

తాజా రిపోర్ట్స్ ప్రకారం, సరికొత్త 2017 రెనో నెక్ట్స్ జనరేషన్ డస్టర్‌ను రెనో-నిస్సాన్ యొక్క నూతన సిఎమ్ఎఫ్-బి ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఉన్న డస్టర్ బిఒ/లోగాన్ వేదిక ఆధారంగా రూపొందించబడింది. ఇదే వేదిక మీద క్యాప్చర్ కూడా అభివృద్ది చేయబడింది.

నెక్ట్స్ జనరేషన్ రెనో డస్టర్

రెనో క్యాప్చర్ క్రాసోవర్ 2017 చివరి నాటికి ఇండియన్ మార్కెట్లోకి రానుంది మరియు 2017 రెనో డస్టర్ 2018 నాటికి విడుదలయ్యే అవకాశం. ఇందుకు కారణం, ఈ మధ్యనే మిడ్ లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌లో పరిచయం చేయడం.

నెక్ట్స్ జనరేషన్ రెనో డస్టర్

నూతన డస్టర్ సిఎమ్ఎఫ్-బి ఫ్లాట్ ఆదారంగా మళ్లీ అభివృద్ది చేస్తే, హార్డ్ వేర్ పరంగా అనేక భాగాల్లో మార్పులు ఉంటాయి. ఇదే కనుక జరిగితే, దీని ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నెక్ట్స్ జనరేషన్ డస్టర్‌గా పరీక్షించబడుతున్న మోడల్‌లో ఎలాంటి డిజైన్ మార్పులు చోటు చేసుకోలేదు.

నెక్ట్స్ జనరేషన్ రెనో డస్టర్

నలుపు మరియు తెలుపు చారలతో ఉన్న పేపర్ ద్వారా పూర్తిగా కప్పేయడంతో డిజైన్ మరియు ఫీచర్లను గుర్తించడం సాధ్యం కాలేదు. అయితే,ఈ సెకండ్ జనరేషన్ డస్టర్‌లోని ఫ్రంట్ డిజైన్ పరంగా మార్పులు మరియు ఇంటీరియర్‌లో అధునాతన ఫీచర్లు రానున్నాయి.

నెక్ట్స్ జనరేషన్ రెనో డస్టర్

కొత్త డిజైన్ సొబగుల విషయానికి వస్తే, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, సరికొత్త ముందు మరియు వెనుక వైపు బంపర్ లలో ప్రీమియ్ మార్పులు జరగనున్నాయి. డస్టర్ ఎక్ట్సీరియర్ మార్పులతో పాటు ఇంటీరియర్‌లో మార్పులు జరగనున్నాయి. వీటిలో ప్రత్యేకించి సౌకర్యానికి సంభందించిన వాటికే పెద్ద పీట వేస్తున్నట్లు తెలిసింది.

నెక్ట్స్ జనరేషన్ రెనో డస్టర్

ప్రస్తుతం సేఫ్టీ ఫీచర్ల పరంగా అందరిలో అవగాహన పెరగడంతో రెనో తమ నెక్ట్స్ జనరేషన్‌ డస్టర్‌లో ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ వంటి స్టాండర్డ్‌ ఫీచర్లను తప్పనిసరిగా అందివ్వనుంది.

నెక్ట్స్ జనరేషన్ రెనో డస్టర్

రెనో ఈ నెక్ట్స్ జనరేషన్ డస్టర్ ఎస్‌యూవీని అదే 5-సీటింగ్ సామర్థ్యం ఉన్న లేఔట్లో వస్తుందా... లేదంటే 7-సీటింగ్ లేఔట్లో పరిచయం చేస్తుందా అనే విషయం ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. అంతర్జాతీ విపణిలోకి ఆవిష్కరించిన అనంతరం ఇది రెనో నుండి స్పష్టం కానుంది.

నెక్ట్స్ జనరేషన్ రెనో డస్టర్

నెక్ట్స్ జనరేషన్ 2017 డస్టర్ అప్‌గ్రేడెడ్ 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్, దీనిని తక్కువ ఉద్గారాలు మరియు ఎక్కువ పవర్‌ను దృష్టిలో ఉంచుకుని అభివృద్ది చేయడం జరిగింది. దీంతో పాటు 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కూడా రానుంది.

English summary
Read In Telugu Next-Generation Renault Duster Unveil Date Confirmed
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark