2017 లాజీ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించిన రెనో

ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా స్వల్ప మార్పులకు గురైన 2017 లాజీ ఫేస్‌లిఫ్ట్ ను రెనో ఆవిష్కరించింది.

By Anil

రెనో 2017 లాజీ ఫేస్‌లిఫ్ట్ ను ఆవిష్కరించింది. ఏప్రిల్ 2017 లో యూరోపియన్ మార్కెట్లో విడుదలకు ముందుగా రెనో దీనిని ఆవిష్కరణ చేసింది, ఇదే వేరియంట్ 2018 నాటికి దేశీయంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

2017 రెనో లాజీ ఫేస్‌లిఫ్ట్

రెనో 2017 లాజీ ఫేస్‌లిఫ్ట్ ను ఆవిష్కరించింది. ఏప్రిల్ 2017 లో యూరోపియన్ మార్కెట్లో విడుదలకు ముందుగా రెనో దీనిని ఆవిష్కరణ చేసింది, ఇదే వేరియంట్ 2018 నాటికి దేశీయంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

2017 రెనో లాజీ ఫేస్‌లిఫ్ట్

రెనో పరిచయం 2017 ఫేస్‌లిఫ్ట్ లాజీ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా కాస్మొటిక్ మార్పులకు గురైంది. అయితే మునుపటి అవే ఇంజన్ వేరియంట్లు ఇందులో రానున్నాయి. కొత్త రూపాన్ని సంతరించుకోవడానికి డస్టర్ ప్రేరణతో దీనికి సొబగులద్దడం జరిగింది.

2017 రెనో లాజీ ఫేస్‌లిఫ్ట్

రెనో ఈ ఫేస్‌లిఫ్టెడ్ లాజీ ముందు వైపు డిజైన్‌లో నూతన డిజైన్‌లో ఉన్న ప్రంట్ గ్రిల్ అందించింది. ఫ్రంట్ గ్రిల్ మరియు బంపర్‌కు మధ్య భాగంలో లైసెన్ల్ ప్లేట్ కలదు. 16-అంగుళాల సరికొత్త అల్లాయ్ వీల్స్ కలవు.

2017 రెనో లాజీ ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్‌లో నూతన ఫోర్ స్పోక్స్ గల స్టీరింగ్ వీల్, రీడిజైన్ చేయబడిన ఎయిర్ వెంట్స్, స్టీరింగ్ వీల్ మీద కొత్త హారన్ ప్యాడ్, శాటిన్ క్రోమ్ సొబగులు గల నూతన డ్యాష్ బోర్డ్ లతో పాటు లాజీ స్టె‌ప్‌వే ఫేస్‌లిఫ్ట్‌లో త్రీడీ అప్‌హోల్‌‌స్ట్రే కలదు.

ఫీచర్లు

ఫీచర్లు

రివర్స్ పార్కింగ్ కెమెరా, ఆర్మ్ రెస్ట్, వెనుక సీటులో ప్రయాణికుల కోసం ఫోల్డింగ్ టేబుల్, డ్రైవర్ కోసం వన్ టచ్ విండో ఫంక్షన్ లతో పాటు మునుపటి లాజీలోని అన్ని ఇంటీరియర్ ఫీచర్లు ఇందులో రానున్నాయి.

2017 రెనో లాజీ ఫేస్‌లిఫ్ట్

సాంకేతికంగా ప్రస్తుతం రెనో లాజీ లో 1.5-లీటర్ సామర్థ్యం గల కె9కె డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 83.83బిహెచ్‌పి పవర్ వర్షన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 108.5 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే వర్షన్ 6-స్పీడ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.

2017 రెనో లాజీ ఫేస్‌లిఫ్ట్

రెనో లాజీ ఇండియన్ మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కుంటోంది. ప్రస్తుతం ఎస్‌యువి వాహనాల అమ్మకాలు పుంజుకుంటున్న నేపథ్యంలో ఎమ్‌పివిలకు డిమాండ్ తగ్గుతోంది. అయితే నూతన లాజీ స్విఫ్ట్ ఎర్టిగా వేరియంట్‌తో పోటీ పడనుంది.

2017 రెనో లాజీ ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం దేశీయంగా దీనిని వ్యక్తిగత అవసరాలకు కొనుగోలు చేసే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. క్యాబ్ మరియు ట్యాక్సీలుగా విక్రయించబడుతోంది. అయితే 2017 ఫేస్‌లిఫ్ట్ విడుదలతో ఈ ధోరణి మారుతుందో లేదో చూడాలి మరి.

2017 రెనో లాజీ ఫేస్‌లిఫ్ట్

  • టాటా మోటార్స్ నుండి మరో మోడల్: టియాగో ఆక్టివ్
  • డిసి డిజైన్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్: ధర రూ. 2.5 లక్షలు
  • చెన్నై నుండి బెంగళూరుకు 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు
  • 2017 రెనో లాజీ ఫేస్‌లిఫ్ట్

    ఒక మంచి ఎమ్‌పివి వాహనం కోనుగోలు చేయాలనుకుంటున్నారా...? నాణ్యత, ఫీచర్లు, ధృడత్వం, సామర్థ్యం మరియు విశ్వసనీయత వంటి అన్ని అంశాలకు న్యాయం చేస్తూ ధరకు తగ్గ విలువలతో లభించే మోడల్ టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి. దీనికి సంభందించిన ఫోటోలు మీ కోసం....

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
2017 Renault Lodgy Facelift Revealed
Story first published: Saturday, January 21, 2017, 16:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X