సరికొత్త టయోటా కరోలా ఆల్టిస్ ఇండియా విడుదల ఈ మార్చిలోనే

Written By:

ప్రస్తుతం తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ నూతన కరోలా ఆల్టిస్ సెడాన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ దిగ్గజ సెడాన్‌లో ఎక్కువ ఫ్రంట్ డిజైన్‌లో అప్‌డేట్స్ జరగనున్నాయి.

టయోటా కరోలా ఆల్టిస్

టయోటా ప్రాథమిక డిజైన్ లక్షణాలలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే టయోటా న్యూ డిజైన్ ఫ్లాట్‌ఫామ్ ప్రకారం మరింత పదునైన ఫ్రంట్ డిజైన్‌కు గురికానుంది.

టయోటా కరోలా ఆల్టిస్

ఇందులో మునుపటి హెడ్ లైట్లతో పాటు, నూతన ఫార్చ్యూనర్‌లో పరిచయం చేసిన తరహాలో బిఐ-బీమ్ ఎల్ఇడి లైట్లు మరియు నూతన డిజైన్‌లోని టెయిల్ ల్యాంప్స్ ఇందులో రానున్నాయి.

టయోటా కరోలా ఆల్టిస్

ఇంటీరియర్ విషయానికి వస్తే, సాప్ట్ టచ్ మెటీరియల్, రీ డిజైన్ చేయబడిన డ్యాష్ బోర్డ్, కొత్తగా అభివృద్ది చేసిన ఎయిర్ కండీషనింగ్ కంట్రోల్స్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో రానున్నాయి.

టయోటా కరోలా ఆల్టిస్

సాంకేతికంగా 2017 టయోటా కరోలా ఆల్టిస్ 140బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.8-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ మరియు 88బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.4-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌లతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

టయోటా కరోలా ఆల్టిస్

పోటీ విషయానికి వస్తే టయోటా కరోలా ఆల్టిస్ సెడాన్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఎలంట్రా మరియు స్కోడా ఆక్టావియా లతో గట్టి పోటీని ఎదుర్కుంటోంది. మరిన్ని స్కోడా ఆక్టావియా ఫోటోలను క్రింది గ్యాలరీలో వీక్షించగలరు....

 

English summary
New Toyota Corolla India Launch This March?
Story first published: Saturday, February 4, 2017, 16:41 [IST]
Please Wait while comments are loading...

Latest Photos