ఈ చిన్న కారుతో మారుతికి ముచ్చెమటలు ఖాయం!

Written By:

ఇండియన్ ప్యాసింజర్ కార్ల విభాగంలో మారుతి సుజుకి తర్వాత అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న సంస్థ హ్యందాయ్ మోటార్స్. ఒకప్పుడు చిన్న కార్ల సెగ్మెంట్లో శాంట్రో ద్వారా మారుతికి ముచ్చెమటలు పట్టించిన హ్యుందాయ్ అతి త్వరలో సరికొత్త శాంట్రో స్మాల్ కారును విపణిలోకి విడుదల చేయనుంది.

హ్యుందాయ్ శాంట్రో

దేశీయంగా 16 సంవత్సరాల పాటు విక్రయాల్లో ఉన్న హ్యుందాయ్ శాంట్రో స్మాల్ హ్యాచ్‌బ్యాక్ 2014లో ఏడాదిలో మార్కెట్ నుండి శాస్వతంగా వైదొలిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు హ్యందాయ్ తమ శాంట్రోను మళ్లీ విడుదల చేయనుంది.

Recommended Video - Watch Now!
Tata Motors Delivers First Batch Of Tigor EV To EESL - DriveSpark
హ్యుందాయ్ శాంట్రో

సరికొత్త హ్యుందాయ్ శాంట్రో రానున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ప్రదర్శనకు వచ్చి, 2018 మధ్య భాగానికి మార్కెట్లోకి విడుదల కానుంది. విపణిలోకి చిన్న కారును ప్రవేశపెట్టడాన్ని హ్యుందాయ్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ వైకె కూ స్పష్టం చేశారు.

హ్యుందాయ్ శాంట్రో

చిన్న కారు అంటే తరువాత తరం శాంట్రో కారా... లేదంటే మరేదైనా కొత్త మోడల్ ఉండబోతోందా... అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. కానీ హ్యుందాయ్ చిన్న కారుకు సంభందించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.

హ్యుందాయ్ శాంట్రో

కాబట్టి హ్యుందాయ్ శాంట్రోనే తమ తరువాత చిన్న కారు అని చెప్పవచ్చు. గతంలో ఉన్న శాంట్రో బాక్సీ డిజైన్‌కు స్వస్తి పలికి అధునాతన శైలిలో ఉన్న డిజైన్, విశాలవంతమైన మరియు సౌకర్యవంతమైన క్యాబిన్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చి పోటీదారులకు ముచ్చెమటలు పట్టించనుంది.

హ్యుందాయ్ శాంట్రో

శాంట్రో ఆధారిత చిన్న కారులో 0.8-లీటర్ సామర్థ్యం ఉన్న మరియు 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానున్నాయి. పేరుకు చిన్న కారే అయినప్పటికీ అధునాతన ఇంటీరియర్ ఫీచర్లు మరియు ప్రీమియమ్ ఫీల్ కలిగించేలా ఇంటీరియర్ తీర్చిదిద్దనుంది.

హ్యుందాయ్ శాంట్రో

హ్యుందాయ్ తమ అప్ కమింగ్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును ఏహెచ్2 అనే కోడ్ పేరుతో అభివృద్ది చేస్తోంది. ఇది విపణిలోకి వస్తే ఇయాన్ మరియు గ్రాండ్ ఐ10 కార్ల మధ్య ఉన్న స్థానాన్ని భర్తీ చేయనుంది.

హ్యుందాయ్ శాంట్రో

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ తొలుత శాంట్రో కారు ద్వారా దేశీయ విపణిలో కార్యకలాపాలు ప్రారంభించింది. 16 సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణంలో ఇండియాలో మొత్తం 18.95 లక్షల శాంట్రో కార్లను హ్యుందాయ్ విక్రయించింది. ఆ పదహారేళ్లు కూడా మారుతి సుజుకికు విపరీతమైన పోటీనిచ్చింది.

హ్యుందాయ్ శాంట్రో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయ విపణి నుండి హ్యుందాయ్ శాంట్రో వైదొలగిన తరువాత, చిన్న కార్ల సెగ్మెంట్లో అంత పోటీలేదు. శాంట్రో వెనుదిరగడంతో మారుతి సుజుకి అత్యధిక చిన్న కార్లను విక్రయించింది. శాంట్రో మళ్లీ మార్కెట్‌ను తాకితే విపణిలో ఉన్న మారుతి ఆల్టో కె10, రెనో క్విడ్, డాట్సన్ రెడి-గో మరియు టాటా టియాగో వంటి స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Next-Gen Hyundai Santro India Launch Details Revealed
Story first published: Monday, August 28, 2017, 16:16 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark