రెనో స్కాలా స్థానాన్ని భర్తీ చేయనున్న రెనో సింబల్ సెడాన్

Written By:

రెనో ఇండియా రానున్న ఐదేళ్లలోపు విపణిలోకి ఐదు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో కొన్ని మోడళ్లు ఇప్పటికే పలుమార్లు లీకయ్యాయి. అందులో ఒకటి సింబల్ సెడాన్. ఫ్రెంచ్‌కు చెందిన రెనో సింబల్ సి-సెడాన్ ను దేశీయంగా ఉన్న స్కాలా సెడాన్ స్థానంలోకి విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

 రెనో సింబల్

ఫ్రెంచ్ కార్ల దిగ్గజానికి 2016 ఏడాది చాలా ముఖ్యమైనదిని చెప్పవచ్చు. క్విడ్ విడుదలతో భారీ అమ్మకాల దిశగా దూసుకుపోతోంది రెనో. 2008 లో దేశీయంగా పరిచయం అయిన రెనో 2016 లో ఏకంగా 1,00,000 కార్ల అమ్మకాలతో సరికొత్త మైలురాయిని దాటింది.

 రెనో సింబల్

విడుదల చేసే ఉత్పత్తులు బాగుంటే తయారీ సంస్థల చరిత్రతో పనిలేకుండా ఫలితాలు సాద్యమవుతాయనే అంశాన్ని రెనో అక్షరాల నిజం చేసింది. ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లకు 2016 ఏడాది మంచి వేదికగా నిలిచింది.

 రెనో సింబల్

న్యూ జనరేషన్ సింబల్ సెడాన్ యొక్క ఫోటోలను ఆటోపోలిస్ అనే వెబ్‌సైట్ ప్రచురించింది. మరియు ఈ నూతన తరం సింబల్ సెడాన్ ను బ్రెజిల్‌లో గుర్తించినట్లు ఆటోపోలిస్ తెలిపింది. దీని ద్వారా రెనో కుటుంబం యొక్క నూతన డిజైన్ భాష సింబల్ సెడాన్ ద్వారా గుర్తించవచ్చు.

 రెనో సింబల్

తాజాగా విడుదలైన సింబల్ సెడాన్ రహస్య ఫోటోలను గమనిస్తే ఆంగ్లపు సి-ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే లైట్లు మరియు హెడ్ లైట్లతో పాటు సరికొత్త కొలియోస్ ఎస్‌యువి నుండి సేకరించి చిన్న పరిమాణంలో అందించిన ఫ్రంట్ గ్రిల్ మరింత ఆకర్షణీయంగా ఉంది. వెనుక భాగం కాస్త బాక్సీ ఆకారంలో ఉంది.

 రెనో సింబల్

సి-సెగ్మెంట్ సింబల్ సెడాన్ పూర్తిగా బిఒ వేదిక ఆధారంగా నిర్మించబడింది. ఇది పూర్తి స్థాయిలో దేశీయ విపణిలోకి విడుదలయితే రెనో నిస్సాన్ మీద ఆదారపడాల్సిన ఆవసరం దాదాపుగా తగ్గిపోతుంది. ప్రస్తుతం రెనో మరియు నిస్సాన్ భాగస్వామ్యంతో అభివృద్ది చేయబడిన కామన్ మోడ్యూల్ ఫ్యామిలీ(CMF)ను ఇరు సంస్థలు సంయుక్తంగా వినియోగించుకుంటున్నాయి.

 రెనో సింబల్

స్కాలా స్థానంలో విపణిలోకి విడుదల చేయాలని భావిస్తున్న సింబల్ సెడాన్‌లో 1.6-లీటర్ కె4ఎమ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డిసిఐ డీజల్ ఇంజన్ వేరియంట్లతో రానుంది. సిబల్ సెడాన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లతో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 రెనో సింబల్

ఈ మధ్యనే రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సాహ్నే మాట్లాడుతూ, దేశీయంగా రెనో అందుబాటులో ఉంచే ఉత్పత్తులను 80 శాతం వరకు ప్రాంతీయంగానే ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తద్వారా పోటీదారులను ఎదుర్కొంటూ వినియోగదారులను అధిక సంఖ్యలో ఆకర్షించే విధంగా తమ ఉత్పత్తుల ధరలను నిర్ణయిస్తామని తెలిపాడు.

 రెనో సింబల్

రెనో ఇండియా ఈ సింబల్ సెడాన్ ను డస్టర్ కు దిగువ స్థానంలో ప్రవేశపెట్టనుంది. మరియు దీనిని ఆరు నుండి 8 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

 రెనో సింబల్

రెనో ఇండియా తమ సింబల్ సెడాన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న హోండా సిటి, మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా మరియు వోక్స్‌వ్యాగన్ వెంటో లకు గట్టిపోటీనివ్వనుంది.

 రెనో సింబల్

పెరిగిన వెహికల్ రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ ధరలు

డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ మరియు వాహన రిజిస్ట్రేన్ రుసుములను పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేటి కథనంలో ధరల వివరాలు తెలుకోగలరు.

మారుతి సుజుకి స్విఫ్ట్ కొనాలనుకుంటున్నారా...? అయితే కొద్ది రోజులు వేచి ఉండండి. త్వరలో 2017 స్విప్ట్ మార్కెట్లోకి విడుదల కానుంది. నూతన డిజైన్ శైలిలో విడుదల కానున్న స్విఫ్ట్ ఎలా ఉందో ఇక్కడ ఉన్న ఫోటోల మీద క్లిక్ చేయండి....

 

Read more on: #రెనో #renault
English summary
Next-Gen Renault Symbol Could Be The Replacement For Scala In India
Story first published: Monday, January 9, 2017, 12:22 [IST]
Please Wait while comments are loading...

Latest Photos