నెల రోజుల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఏ మేరకు పెరిగాయో తెలుసా ?

గడిచిన నెల రోజుల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు విపరీతంగా పెరిగాయి.పెట్రోల్ మీద ఏకంగా 6 రుపాయాలు మరియు డీజల్ మీద 3.67 రుపాయలు వరకు పెరిగింది.

By Anil

గడిచిన నెల రోజుల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు విపరీతంగా పెరిగాయి. రోజూ వారిగా ఇంధన ధరలను సమీక్షించి ఏ రోజుకారోజు కొత్త ధరలతో ఇంధన విక్రయాలు చేపడతామని చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం తెలిసిందే.

ఇంధన ధరలు

ఈ మధ్య కాలంలో ఇంధన ధరలు అరుదుగా తగ్గుతూ పరిపాటిగా పెరగుతూ వచ్చాయి. దీంతో పెట్రోల్ మీద ఏకంగా 6 రుపాయలు మరియు డీజల్ మీద 3.67 రుపాయలు వరకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 69.04 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 57.03 లుగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో గరిష్టంగా నమోదయ్యాయి.

ఇంధన ధరలు

గతంలో చమురు సంస్థలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇంధన ధరలను సవరించేవి. అయితే పదిహేనేళ్ల క్రితం ప్రయోగించి చూసిన ప్రతి రోజు ఇంధన ధరల సవరణను జూలై 2017 నుండి అమల్లోకి తెచ్చాయి. ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు పెట్రోల్ మరియు డీజల్ కొత్త ధరలతో అమల్లోకి వస్తాయి.

Recommended Video

Tata Nexon Review: Specs
ఇంధన ధరలు

గతంలో ఇంధన ధరల సవరణ జరిగేటపుడు ఒక్కసారిగా రెండు లేదా మూడు రుపాయలు పెరిగేది. అయితే ఇలా పెంచడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించే వారు. కానీ ఇప్పుడు రోజు వారి ఇంధన ధరల సవరణను అందుబాటులోకి తెచ్చాక ప్రతి రోజు 1 నుండి 15 పైసలు వరకు పెంచుతున్నారు.

ఇంధన ధరలు

ఇలా ప్రతి రోజు కొద్ది కొద్దిగా పెరిగిన ఇంధన ధరలు నెల రోజుల్లో ఆరు రుపాయలకు చేరుకుంది. ఒక్కసారిగా కాకుండా రోజుకింత పెంచడంతో ప్రజలు, పాత్రికేయులు కూడా దీనిని గుర్తించలేకపోయారు. అయితే గత మాసపు ఇంధన ధరలతో పోల్చుకుంటే ధరలపై భారీ పెంపు స్పష్టంగా కనబడుతోంది.

ఇంధన ధరలు

డ్రైవ్‍‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పెట్రోల్ మరియు డీజల్ ధరలను మునపటి ఒక్కసారిగా రెండు లేదా మూడు రుపాయలు పెంచడం ప్రజల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే రోజూ వారి ఇంధన ధరల సవరణ ద్వారా ఒక రోజు తగ్గడం మరియు ఒక రోజు పెరగడం వంటివి ప్రజల మీద అంత ప్రభావం చూపవు.

మీకు నచ్చిన నగరంలో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఇక్కడ తెలుసుకోండి....

Most Read Articles

English summary
Read In Telugu: Petrol Prices Up By Rs 6 Per Litre Since July And Diesel By Rs 3.67
Story first published: Monday, August 28, 2017, 12:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X