రేంజ్ రోవర్ ఎవోక్ పెట్రోల్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు మైలేజ్...

Written By:

దిగ్గజ బ్రిటీష్ వాహన తయారీ సంస్థ ల్యాండ్ రోవర్ ఇండియన్ మార్కెట్లోకి తమ రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యువిని పెట్రోల్ వేరియంట్లో విడుదల చేసింది. 2.0-లీటర్ సామర్థ్యం గల దీని ప్రారంభ ధర రూ. 53.20 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

రేంజ్ రోవర్ ఎవోక్ పెట్రోల్

ల్యాండ్ రోవర్ నేడు (జనవరి 11, 2017) విడుదల చేసిన నూతన శ్రేణి ఎవోక్ పెట్రోల్ వేరియంట్ దేశవ్యాప్తంగా 23 ల్యాండ్ రోవర్ షోరూమ్‌లలో లభిస్తుందని తెలిపింది.

రేంజ్ రోవర్ ఎవోక్ పెట్రోల్

2.0-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 236.7బిహెచ్‌పి పవర్ మరియు 339ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి అనుసంధానం చేసిన 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

రేంజ్ రోవర్ ఎవోక్ పెట్రోల్

సరికొత్త రేంజ్ రోవర్ ఎవోక్ పెట్రోల్ వేరియంట్ కేవలం 7.1 సెకండ్ల కాలవ్యవధిలోనే గంటకు 0 నుండి 96.5కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు ఇది గరిష్టంగా 217 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

రేంజ్ రోవర్ ఎవోక్ పెట్రోల్

రేంజ్ రోవర్ ఎవోక్ లో ప్రస్తుతం ఐదు డీజల్ వేరియంట్లు ఉన్నాయి. అవి, ప్యూర్, ఎస్ఇ, ఎస్ఇ డైనమిక్, హెచ్ఎస్ఇ మరియు హెచ్ఎస్ఇ డైనమిక్. ఈ ఐదు వేరియంట్లలో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టర్బో చార్జ్‌డ్ డీజల్ న్ కలదు.

రేంజ్ రోవర్ ఎవోక్ పెట్రోల్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ సూరి మాట్లాడుతూ, 2017 మోడల్‌ ఇయర్ తో సిరకొత్త రేంజ్ రోవర్ ఎవోక్ 2.0-లీటర్ పెట్రోల్ వేరియంట్ విడుదల ఎంతో మంది పెట్రోల్ ఎస్‌యువి ప్రేమికులకు బాగా నచ్చుతుందని తెలిపాడు.

రేంజ్ రోవర్ ఎవోక్ పెట్రోల్

ప్రపంచ వ్యాప్తంగా సురక్షితమైన విమానాల గురించి

కార్ల విషయానికి వస్తే భద్రత పరంగా ఏది బెస్ట్ ఏది వేస్ట్ అని ఇట్టే చెప్పేయగలం. మరి విమానాలకయితే ఎలా...? ఒక్కసారి టేకాఫ్ తీసుకున్న తరువాత అన్ని అంశాలు కలిసొస్తేనే సురక్షితంగా ల్యాండ్ అవ్వగలం.

రేంజ్ రోవర్ ఎవోక్ పెట్రోల్

మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్ గురించి సవివరంగా

మారుతి సుజుకి ఇగ్నిస్ వేరియంట్‌‌ను పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో విడుదల చేస్తోంది. అయితే ఇగ్నిస్‌లోని టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫాలో మాత్రమం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందివ్వడం లేదు.

English summary
Range Rover Evoque Petrol Launched In India; Priced At Rs. 53.20 Lakh
Story first published: Wednesday, January 11, 2017, 16:16 [IST]
Please Wait while comments are loading...

Latest Photos