మరో రెండు నెలల్లో రెనో నుండి కొత్త ఎస్‌యూవీ: కంప్లీట్ డీటైల్స్

Written By:

దేశీయంగా తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీని పరిచయం చేసింది రెనో. ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ భారతీయులకు తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీ డస్టర్‌ను పరిచయం చేసింది. రెనో డస్టర్ రాకతో అనేక కొత్త ఎస్‌యూవీలు విడుదలయ్యాయి. అయితే ఇప్పుడు మరో సెగ్మెంట్‌ను ఇండియన్స్‌కు పరిచయం చేయడానికి రెనో సిద్దమైంది.

రెనో అతి త్వరలో కప్తుర్ కారును క్రాసోవర్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి విడుదల చేయనుంది. దీని గురించి పూర్తి వివరాలు వివరంగా...

రెనో కప్తుర్ క్రాసోవర్ ఎస్‌యూవీ

రెనో తొలుత కప్తుర్ క్రాసోవర్‌ ఎస్‌యూవీని 2016 లో రష్యాలో ఆవిష్కరించింది. ప్రస్తుతం రష్యా మరియు దక్షిణ అమెరికాలోని కొన్ని మార్కెట్లలో విక్రయాల్లో ఉంది. రెనోకు ప్రధాన మార్కెట్‌గా నిలిచిన ఇండియాలోకి వచ్చే పండుగ సీజన్ నాటికి విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

రెనో కప్తుర్ క్రాసోవర్ ఎస్‌యూవీ

కుడి వైపు స్టీరింగ్ వీల్‌తో లభించే రెనో కప్తుర్‌ను ఇండియాలో తొలుత విడుదల చేయనుంది. ఇప్పటి వరకు లెప్ట్ హ్యాండ్ స్టీరింగ్ వీల్‌తో మాత్రమే కప్తుర్ విక్రయాల్లో ఉంది. రెనో కప్తుర్ క్రాసోవర్ ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, డస్టర్ ఎస్‌యూవీకి పై స్థానాన్ని భర్తీ చేయనుంది.

రెనో కప్తుర్ క్రాసోవర్ ఎస్‌యూవీ

డస్టర్‌ను డెవలప్ చేసిన ఎమ్ఒ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా కప్తుర్ ఎస్‌యూవీని రూపొందించారు, అదే వేదిక మీద ఇండియాలో విడుదల కానున్న నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీని అభివృద్ది చేస్తున్నారు. రెనో కప్తుర్

రెనో కప్తుర్ క్రాసోవర్ ఎస్‌యూవీ

ఇండియన్-స్పెక్ రెనో కప్తుర్ ఎస్‌‌యూవీ 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న కె9కె డీజల్ ఇంజన్ వేరియంట్లో రానుంది. అదే విధంగా డస్టర్‌లో లభించే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఇందులో అందివ్వనుంది.

రెనో కప్తుర్ క్రాసోవర్ ఎస్‌యూవీ

తాజాగా అందుతున్న సమాచారం మేరకు, తొలుత మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో మాత్రమే లభించనుంది. అయితే ఆలస్యంగా కప్తుర్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా అందించే అవకాశాలు ఉన్నాయి.

రెనో కప్తుర్ క్రాసోవర్ ఎస్‌యూవీ

దేశీయ విపణిలోకి విడుదలయ్యే కప్తుర్ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌లో ఫుల్-ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లతో రానుంది, డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ మరియు ఎక్ట్సీరియర్‌లో రూఫ్ టాప్ పెయింట్‌ను కస్టమర్లకు నచ్చిన కలర్ ఆప్షన్‌లో కస్టమైజ్ చేయించుకోవచ్చు.

రెనో కప్తుర్ క్రాసోవర్ ఎస్‌యూవీ

మీడియా న్యావిగేషన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటి గల 7-అంగుళాల తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కప్తుర్ డ్యాష్‌బోర్డ్‌లో ప్రత్యేకాకర్షణగా నిలవనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెనో కప్తుర్ హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి పోటీగా విపణిలోకి వస్తోంది. అయితే అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో, క్రెటాను ఎదుర్కునే విధంగా ధరలు నిర్ణయిస్తే, రెనోకు డస్టర్ తరహా మరో విజయం ఖాయం!

Read more on: #రెనో #renault
English summary
The Renault Captur is a crossover SUV and will be launched in India during this festive season.
Story first published: Saturday, July 15, 2017, 14:52 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark