డీలర్ల చెంతకు చేరుతున్న రెనో క్యాప్చర్

Written By:

రెనో తమ అప్‌కమింగ్ వెహికల్, క్యాప్చర్ ఎస్‌యూవీ విడుదలను అనివార్య కారణాల వలన గత కొంత వాయిదా వేస్తూ వచ్చింది. అయితే, ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో తమ ఖరీదైన ఫ్లాగ్‌షిప్ మోడల్ క్యాప్చర్‌ను డీలర్లకు సరఫరా చేస్తోంది.

రెనో క్యాప్తర్ విడుదల, బుకింగ్స్‌తో పాటు మరిన్ని వివరాలు ఇవాళ్టి కథనంలో...

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

రెనో క్యాప్చర్ విడుదల తేదీని అధికారికంగా వెల్లడించలేదు. అయితే, డీలర్ల కథనం మేరకు నవంబరు మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రెనో ఇప్పటికే క్యాప్చర్ మీద అధికారిక బుకింగ్స్ ప్రారంభించింది. రెనో డీలర్లు, రెనో మొబైల్ యాప్ లేదా స్మార్ట్ ఫోన్ నుండి రూ. 25 వేలు చెల్లించి క్యాప్చర్ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

రెనో ఇండియా లైనప్‌లో డస్టర్‌ పై స్థానాన్ని క్యాప్చర్ భర్తీ చేయనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జీప్ కంపాస్, హ్యుందాయ్ క్రెటా, మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 లకు గట్టి పోటీనివ్వనుంది.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

రెనో క్యాప్చర్‌ను తొలుత రష్యాలో విడుదల చేసింది. డస్టర్ ఎస్‌యూవీని నిర్మించిన అదే ఫ్లాట్‌ఫామ్ మీద క్యాప్చర్‌మను నిర్మించారు. రష్యా తరువాత రెనో క్యాప్చర్‌ను విడుదల చేస్తున్న రెండవ దేశం ఇండియా.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

రష్యన్ మరియు ఇండియన్ మోడళ్లు చూడటానికి ఒకేలా ఉన్నప్పటికీ, రెండింటి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంది. క్యాప్చర్ లాంచ్ అనంతరం కొంత కాలానికి ప్లాటిన్ అనే వెర్షన్ క్యాప్చర్‌ను ప్రీమియమ్ ఇంటీరియర్ ఫీచర్లతో విడుదల చేయనుంది.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

రెనో క్యాప్చర్ క్రాసోవర్ ప్రీమియమ్ ఎస్‌యూవీలో లెథర్ సీట్లు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, స్టైలిష్ క్రోమ్ గ్రిల్, సరికొత్త ఫ్రంట్ బంపర్, ఆకర్షణీయమైన సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, సి-ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

రెనో క్యాప్చర్‌ను కేవలం రెండు వేరియంట్లలో మాత్రమే విక్రయించనున్నట్లు తెలిసింది. మరియు రెనో క్యాప్తర్ బేస్ వేరియంట్ అంటూ ఏదీ ఉండదని కూడా సమాచారం.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

రెనో క్యాప్చర్‌ను కేవలం రెండు వేరియంట్లలో మాత్రమే విక్రయించనున్నట్లు తెలిసింది. మరియు రెనో క్యాప్తర్ బేస్ వేరియంట్ అంటూ ఏదీ ఉండదని కూడా సమాచారం.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

రెనో క్యాప్చర్ లోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 105బిహెచ్‌పి పవర్ మరియు 142ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా ఇందులోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 248ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Read more on: #renault #రెనో
English summary
Read In Telugu: Renault Captur launch in November, dealerships start to get cars
Story first published: Wednesday, October 25, 2017, 9:55 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark