భారత్‌లోకి రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ: బుకింగ్స్ మరియు విడుదల వివరాలు

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో ఇండియన్ మార్కెట్లోకి క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది.

By Anil

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో ఇండియన్ మార్కెట్లోకి క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. దీనిని 25,000 రుపాయల బుకింగ్ ధరతో రెనో క్యాప్తర్ యాప్ మరియు రెనో ఇండియా వెబ్‌సైట్లో బుక్ చేసుకోవచ్చు.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

రెనో ఇంటర్నేషన్ డస్టర్ ఎస్‌యూవీ మరియు లాజీ ఎమ్‌పీవీని నిర్మించిన, సక్సెస్‌ఫుల్ ప్లాట్‌ఫామ్ బిఒ(BO)ఆధారంగా క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీని నిర్మించింది. డిజైన్ మొత్తాన్ని ఇండియన్ కస్టమర్లకు అనుగుణంగా రెనో ఇండియా బృందం అభివృద్ది చేసింది. క్యాప్చర్ ఎస్‌యూవీ ప్రొడక్షన్‌ను రెనో ఇప్పటికే ప్రారంభించింది. మరియు దీనిని అక్టోబర్ 2017లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

రెనో క్యాప్చర్ డిజైన్

రెనో గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా ఎస్‌యూవీ మరియు క్రాసోవర్ లక్షణాలతో క్యాప్చర్ రూపొందించారు. మరియు భారత్‌ విపణిలో రెనో క్యాప్చర్ ఎలాంటి బేస్ వేరియంట్లలో లభించడం లేదు.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

ఇండియన్ స్పెక్ మోడల్, చూడటానికి ప్రీమియమ్ డిజైన్ లక్షణాలతో రెనో కుటుంబం యొక్క వారసత్వపు డిజైన్‌ నుండి ఫ్రంట్ గ్రిల్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఇడి హెడ్ మరియు టెయిల్ ల్యాంప్స్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

Recommended Video

Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

ఇంటీరియర్‌లోని ట్విన్ పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. డ్యాష్ బోర్డులో డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే కలదు. మరియు ఇంటీరియర్ మొత్తాన్ని కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కస్టమైజేషన్ చేయించుకునే ఆప్షన్లను అందిస్తోంది.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

రెనో క్యాప్చర్‌లో స్మార్ట్ యాక్సెస్ కార్డ్ మరియు ఇంజన్ స్టార్ట్ బటన్ కలదు. రేడియో, బ్లూటూత్ టెక్నాలజీ, వాయిస్ గుర్తించే ఫీచర్(ఐఒఎస్ కోసం), మ్యాప్స్, టెంపరేచర్ మరియు సమయాన్ని చూపించే వంటి ఎన్నో ఫీచర్లను 7-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

రెనో క్యాప్చర్ లోని భద్రత ఫీచర్లు

భద్రత పరంగా రెనో క్యాప్చర్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, స్టెబిలిటి కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, వంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లను అదించింది.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

ఇందులో క్రూయిజ్ కంట్రోల్ కలదు, దీని ద్వారా - యాక్సిలరేషన్ మరియు స్పీడ్ లిమిటర్ లేకుండానే ముందస్తు నిర్ధిష్ట వేగాన్ని మెయింటెన్ చేయవచ్చు. దీంతో పాటు చిన్న పిల్లల సీట్ల కోసం ఐఎస్ఒపిక్స్ మౌంట్స్ ఉన్నాయి. క్యాప్చర్‌కు నిర్వహించిన ముందు మరియు ప్రక్క వైపుల క్రాష్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించింది.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

రెనో ఇంజన్ స్పెసిఫికేషన్స్ మరియు గేర్‌బాక్స్

రెనో క్యాప్చర్‌ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లు ఉన్నాయి. ఇందులోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న హెచ్4కె 16-వాల్వులు, నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 105బిహెచ్‌పి పవర్ మరియు 142ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

క్యాప్చర్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ సామర్థ్యం గల కె9కె డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న ఇది గరిష్టంగా 109బిహెచ్‌పి పవర్ మరియు 240ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

కస్టమర్లకు రెనో విసృతమైన కస్టమైజేషన్ అవకాశాన్ని కల్పిస్తోంది. కొన్ని పరిమితమైన రంగులకు మాత్రమే శాస్వతం కాకుండా, విభిన్న డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ బాడీతో క్యాప్చర్ ఎంచుకోవచ్చు. అదే విధంగా డైమండ్ డెక్ మరియు అర్బన్ కనెక్ట్ అనే రెండు పర్సనల్ ఇన్నోవేటివ్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ కస్టమైజేషన్స్ క్యాప్తర్‌లో పొందవచ్చు

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

రెనో క్యాప్చర్ సాంకేతిక వివరాలు:

పొడవు 4329ఎమ్ఎమ్
వెడల్పు 1813ఎమ్ఎమ్
ఎత్తు 1619ఎమ్ఎమ్
వీల్ బేస్ 2673ఎమ్ఎమ్
పెట్రోల్ ఇంజన్ 1.5 హెచ్4కెఎల్
డీజల్ ఇంజన్ 1.5 డిసిఐ కె9కె
ఇంజన్ సామర్థ్యం పెట్రోల్- 1498సీసీ

డీజల్- 1461సీసీ

గేర్‌బాక్స్ పెట్రోల్: 5-స్పీడ్ మ్యాన్యువల్

డీజల్: 6-స్పీడ్ మ్యాన్యువల్

పవర్ పెట్రోల్:105Bhp@5600RPM

డీజల్:119Bhp@4000RPM

టార్క్ పెట్రోల్:142Nm@4000RPM

డీజల్:240Nm@1750RPM

టైర్ కొలతలు 215/60 ఆర్17
వీల్ సైజ్ ఆర్17 క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్
బూట్ స్పేస్ 392 లీటర్లు (1352 లీటర్ల వరకు పెంచుకోవచ్చు)
గ్రౌండ్ క్లియరెన్స్ 210ఎమ్ఎమ్
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 50-లీటర్లు
రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెనో ఇండియా విభాగం పూర్తిగా ఎస్‌యూవీ సెగ్మెంట్ మీద దృష్టిసారిస్తోంది. తాజాగా ఆవిష్కరించిన క్యాప్చర్ ఎస్‌యూవీ క్రాసోవర్ సెగ్మెంట్లో సరికొత్త సునామీ సృష్టించనుంది. ప్రపంచ స్థాయి మార్కెట్ కోసం రూపొందించిన క్యాప్చర్ ఇప్పుడు ఇండియన్ ఎస్‌యూవీ విభాగంలో తీవ్రపోటీని రాజేస్తోంది.

రూ. 10 నుండి 15 లక్షల ధరల శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉన్న క్యాప్చర్ విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యూవీ500 వాహనాలకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Renault captur unveiled in india booking amount specification features images
Story first published: Friday, September 22, 2017, 20:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X