షాకింగ్: రెనో నుండి 7-సీటర్ డస్టర్ ఎస్‌యూవీ

Written By:

రెనో నెక్ట్స్ జనరేషన్ డస్టర్‌ను అత్యంత రహస్యంగా స్పెయిన్‌లో పరీక్షించింది. వివిధ అంశాల వారీగా జరుగుతున్న టెస్టింగ్‌లో, రహదారి పరీక్షలకు వచ్చినపుడు మీడియా కంటబడింది. గ్రాండ్ డస్టర్ పేరుతో 7-సీటింగ్ సామర్థ్యంతో రానుందని అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఆధారం లేని వార్తలు వెలువడుతున్నాయి.

7-సీటర్ రెనో డస్టర్

కాంపాక్ట్ ఎస్‌యూవీని 7-సీటర్ ఎస్‌యూవీగా మార్చబోము, అదే విధంగా ఆల్ వీల్ డ్రైవ్ సామర్థ్యం ఉన్న డస్టర్ విషయంలో కాంప్రమైస్ అయ్యే చాన్సే లేదని రెనో కమర్షియల్ డైరక్టర్ ఫ్రాంకోసిస్ మారియట్ ప్రకటించాడు.

7-సీటర్ రెనో డస్టర్

ఆటోఎక్స్‌ప్రెస్‌తో మారియట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో, "డస్టర్‌కు ఉన్న అన్ని శక్తిసామర్థ్యాలను యథావిధిగా అందివ్వడానికి ప్రయత్నిస్తున్నాము, డస్టర్‌ను డెవలప్ చేసిన ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా లేదా డస్టర్‌లోని ఛాసిస్ ఆధారంగా నెక్ట్స్ జనరేషన్‌ను అభివృద్ది చేస్తున్నామని తెలిపాడు."

7-సీటర్ రెనో డస్టర్

5-సీటింగ్ కెపాసిటి గల డస్టర్‌ను 7-సీటర్‌గా మార్చే అవకాశమే లేదు. ఒక వేళ 7-సీటర్‌గా మార్చుకుంటే కాంపాక్ట్ రూపం మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ యొక్క సామర్థ్యాలను ఈ ఎస్‌యూవీలో కోల్పోతారు.

7-సీటర్ రెనో డస్టర్

సరికొత్త నెక్ట్స్ జనరేషన్ రెనో డస్టర్ సెప్టెంబర్‌లో జరగనున్న 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో వేదిక మీద ఆవిష్కరించనున్నారు. అదే విధంగా 2018 నాటికి ఇండియన్ రోడ్ల మీదకు విడుదల చేయనున్నారు. ఇంజన్ గురించి ఎలాంటి సమాచారం లేదు, అయితే ప్రస్తుతం డస్టర్‌లో ఉన్న అవే ఇంజన్‌లు యథావిధిగా కొనసాగనున్నాయి.

7-సీటర్ రెనో డస్టర్

ప్రపంచ విపణిలో ఉన్న డస్టర్‌ను స్పెయిన్‌లో పరీక్షించబడుతున్నడస్టర్‌తో డిజైన్‌ పరంగా పోల్చింతే, ఫ్రంట్ ఫాసికాలో పదునైన హెడ్ ల్యాంప్ క్లస్టర్ కలదు, దప్పమైన రూఫ్ రెయిల్స్ ఇందులో ఉన్నాయి. అప్ కమింగ్ నెక్ట్స్ జనరేషన్ రెనో డస్టర్ గురించిన తాజా సమాచారం కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు....

7-సీటర్ రెనో డస్టర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెనో ప్రతినిధి ఫ్రాంకోసిస్ మారియట్ ఇంటర్వ్యూ ప్రకారం, డస్టర్ ఆధారిత 7-సీటర్‌ను పరిచయం చేసే అవకాశాలు దాదాపు లేనట్లే అని స్పష్టమవుతోంది. అయితే ఇండియన్ మార్కెట్లో పోటీదారులను దృష్టిలో ఉంచుకుని డస్టర్ ను 7-సీటర్‌ రూపంలో ప్రవేశపెడితే మంచి సక్సెస్ అందుకోగలదు.

English summary
Read In Telugu: Next-Generation Renault Duster 7-Seater Unlikely
Story first published: Tuesday, July 18, 2017, 10:20 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark