భారత్‌లో పరీక్షలకొచ్చిన రెనో క్యాప్చర్- సరికొత్త కాంపాక్ట్ క్రాసోవర్

Written By:

ఫ్రెంచ్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ రెనో యొక్క ఇండియా విభాగం విపణిలోకి సరికొత్త కాంపాక్ట్ క్రాసోవర్ క్యాప్చర్ విడుదలకు చకచకగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే విడుదలకు ముందే దీని పనితీరు పరీక్షించడం కోసం రోడ్ల మీద టెస్టింగ్ నిర్వహించింది.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్

అభివృద్ది చేసిన మార్కెట్లలో రెనో ఈ కాంపాక్ట్ క్రాసోవర్‌ను Capture అనే పేరుతో మరియు అభివృద్ది చెందుతున్న ఇండియా వంటి మార్కెట్లలో దీనిని Kapture అనే పేరుతో అందుబాటులోకి తీసుకురానుంది.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్

క్యాప్చర్ క్రాసోవర్ చూడటానికి యూరోపియన్ తరహా డిజైన్ శైలిని కలిగి ఉంటుంది, అయితే మన మార్కెట్లోకి రానున్న క్యాప్చర్‌లో కొన్ని చిన్న మార్పులు గుర్తించవచ్చు. అందులో బంపర్ మీద ఉన్న పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు పెద్ద పరిమాణంలో ఉన్న గ్రిల్ కలదు.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్

క్యాప్చుర్ కాంపాక్ట్ క్రాసోవర్‌కు రహస్య ఫోటోలను పరీక్షిస్తే ఇందులో 7-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, మరియు క్లైమేట్ కంట్రోల్ (A/C) వంటి ఫీచర్లు ఉన్నాయి.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్

దేశీయంగా విడుదల కానున్న క్యాప్చర్ క్రాసోవర్‌‌లో ఐదు మంది కూర్చునే వెసులుబాటు ఉన్న సీటింగ్ వ్యవస్థ కలదు. 387 లీటర్ల సామర్థ్యం ఉన్న బూట్ స్పేస్, మరియు దీనిని 1200 లీటర్లకు పెంచుకోవచ్చు.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్

ఇండియన్ మార్కెట్లోకి రానున్న రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్‌లో 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. ఇదే ఇంజన్‌ను రెనో డస్టర్‌ ఎస్‌యూవీలో గుర్తించవచ్చు. ఇది రెండు రకాల పవర్ ఆప్షన్లలో (84బిహెచ్‌పి మరియు 108బిహెచ్‌పి) ఎంచుకోవచ్చు.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్

డస్టర్ ఎస్‌యూవీకి పై స్థానంలో ఇది నిలవనుంది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు హోండా బిఆర్‌-వి లకు గట్టి పోటీనివ్వనుంది.

Read more on: #రెనో #renault
English summary
Read In Telugu To know About Renault Kaptur Spotted Testing In India — Interior Revealed
Story first published: Wednesday, May 3, 2017, 13:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark