చివరి దశ పరీక్షల్లో రెనో క్యాప్చర్

రెనో తమ కాంపాక్ట్ క్రాసోవర్ క్యాప్చర్‌ను విడుదల చేయడానికి ఒక్కొక్కటిగా ఏర్పాట్లను పూర్తి చేసుకుంటోంది. ఈ తరుణంలో మరోసారి రహదారి పరీక్షలకు తీసుకొచ్చింది.

By Anil

ఫ్రెంచ్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియా విభాగం తమ లైనప్‌లోకి సరికొత్త క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్‌ను విడుదలకు సిద్దం చేస్తోంది. అతి త్వరలో విడుదల ఉన్న నేపథ్యంలో దీనికి రోడ్ టెస్ట్ నిర్వహించారు.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్

అతి త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో రెనో ఇండియా విభాగం క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్‌కు రహదారి పరీక్షలు నిర్వహించింది. ఇండియన్ కాంపాక్ట్ క్రాసోవర్ సెగ్మెంట్లో కొన్ని మోడళ్లు మాత్రమే ఉన్నాయి. వీటి సరసన ఈ రెనో క్యాప్చర్ వచ్చి చేరనుంది.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్

పరీక్షలకు వచ్చిన రెనో క్యాప్చర్‌ను డిజైన్ పరంగా చూస్తే, ఫ్రంట్ డిజైన్‌లో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి. లైట్లను మినహాయిస్తే మరే ఇతర డిజైన్ ఫీచర్లను గుర్తించడానికి వీల్లేకుండా నలుపు మరియు తెలుగు రంగులో ఉన్న పేపర్‌తో బాడీ మొత్తం కవర్ చేశారు.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్

రెనో క్యాప్చర్ ముందు వైపున ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్ లైట్లు మరియు ఆంగ్లపు సి-ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లున్నాయి. వెనుక కూడా ఎల్ఇడి టెయిల్ లైట్లను అందివ్వడం జరిగింది.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్

రెనో క్యాప్చర్ ఇంటీరియర్‌లో 7-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. దీనితో పాటు క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లున్నాయి.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్

ఎక్ట్సీరియర్ పరంగా చూస్తే, బాడీ ఆకారం మరియు పరిమాణానికి తగిన విధంగా 17-అంగుళాల పరిమాణం ఉన్న అల్లాయ్ వీల్స్ అందించారు మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా కల్పించడం జరిగింది.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్

రెనో డస్టర్ ఎస్‌యూవీని అభివృద్ది చేసిన ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే క్యాప్చర్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్ కోసం రూపొందించడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇది పెట్రోల్ మరియు విభిన్న ఇంధనాన్ని వినియోగించుకునే ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్

దేశీయంగా రానున్న రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ డస్టర్‌లో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో రానుంది. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 105బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగా. డీజల్ వేరియంట్ రెండు రకాల పవర్ ఉత్పత్తి చేయును, అవి: 84బిహెచ్‌పి మరియు 108బిహెచ్‌పి.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ క్రాసోవర్

ఈ ఏడాది పండుగ సీజన్‌లో క్యాప్చర్ ఎస్‌యూవీని విడుదల చేయనున్నారు. రూ. 10 లక్షల రుపాయల ఎక్స్-షోరూమ్ అంచనా ధరతో విడుదల కావచ్చు.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Read In Telugu Renault Kaptur Spotted Testing
Story first published: Tuesday, May 23, 2017, 18:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X