సెకండ్ యానివర్సరీ ఎడిషన్‌లో విడుదలైన రెనో క్విడ్

Written By:

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో కి ఇండియాలో డస్టర్ తర్వాత మంచి గుర్తింపును తెచ్చిపెట్టిన మోడల్ క్విడ్. రెనో తమ క్విడ్ చిన్న కారును ద్వితీయ వార్షికోత్సవ ఎడిషన్‌గా విపణిలోకి విడుదల చేసింది. రెనో క్విడ్ 02 యానివర్సరీ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 3.543 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

రెనో క్విడ్ యానివర్సరీ ఎడిషన్

క్విడ్ మీద వచ్చిన భారీ స్పందనకు అనుగుణంగా క్విడ్ కారును 1.0 లీటర్ ఇంజన్ వేరియంట్లో, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో మరియు ఇండియాలో విడుదలయ్యి సంవత్సరం పూర్తయిన సంధర్భంగా మొదటి యానివర్సరీ ఎడిషన్‌ మరియు లివ్ ఫర్ మోర్ ఎడిషన్ లలో విడుదల చేసిన రెనో ఇప్పుడు రెండవ యానివర్సరీ ఎడిషన్‌లో విడుదల చేసింది.

Recommended Video - Watch Now!
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
రెనో క్విడ్ యానివర్సరీ ఎడిషన్

రెనో క్విడ్ రెండవ యానివర్సరీ ఎడిషన్ కారు ఇప్పుడు 53బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 0.8-లీటర్ ఇంజన్ మరియు 67బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.0-లీటర్ ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తున్నాయి.

రెనో క్విడ్ యానివర్సరీ ఎడిషన్

రెండవ వార్షికోత్సవానికి గుర్తుగా రెనో విడుదల చేసిన క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కారులో ప్రత్యేకతలేమిటి అంటారా....? ఎక్ట్సీరియర్ మీద మరియు ఇంటీరియర్‌లో కాస్మొటిక్ మార్పులు మినహాయిస్తే ఇంజన్ మరియు సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు.

రెనో క్విడ్ యానివర్సరీ ఎడిషన్

రెగ్యులర్ వెర్షన్ క్విడ్‌తో పోల్చితే విభిన్నంగా ఉండేందుకు ఎక్ట్సీరియర్ మీద తెలుపు మరియు ఎరుపు రంగుల్లో డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ కలదు. 02 నెంబర్‌తో ఎక్ట్సీరియర్ మీద ప్రత్యేక గ్రాఫిక్స్ ఉన్నాయి. తెలుపు మరియు ఎరుపు రంగులతో ముందు మరియు వెనుక వైపు స్కిడ్ ప్లేట్లు, వీల్ ఆర్చెస్ మరియు డ్యూయల్ టోన్ రంగులతో ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి.

రెనో క్విడ్ యానివర్సరీ ఎడిషన్

క్విడ్ సెకండ్ యానివర్సరీ ఎడిషన్ ఇంటీరియర్‌లో 02 ను సూచించే గుర్తులు సీటు అప్‌హోల్‌స్ట్రే, స్టీరింగ్ వీల్, ఫ్లోర్ మ్యాట్ల మీద అందివ్వడం జరిగింది. వీటికి తోడుగా ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ గేర్ నాబ్, డ్యాష్ బోర్డు మీద దంతపు ఆకారంలో ఉన్న పియానో బ్లాక్ సెంటర్ కన్సోల్ మరియు సైడ్ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి.

రెనో క్విడ్ యానివర్సరీ ఎడిషన్

రెనో క్విడ్ రెండవ వార్షికోత్సవ ఎడిషన్ ధర వివరాలు

వేరియంట్లు ధరలు
క్విడ్ ఆర్ఎక్స్ఎల్ 0.8-లీటర్ రూ. 3,42,800 లు
క్విడ్ ఆర్ఎక్స్‌టి 0.8-లీటర్ రూ. 3,76,400 లు
క్విడ్ ఆర్ఎక్స్ఎల్ 1.0-లీటర్ రూ. 3,64,400 లు
క్విడ్ ఆర్ఎక్స్‌టి 1.0-లీటర్ రూ. 3,97,900 లు

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

రెనో క్విడ్ యానివర్సరీ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయంగా లిమిటెడ్ ఎడిషన్ ఉత్పత్తులను ఎంచుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. క్విడ్ విడుదలయ్యి ఇప్పటికి సరిగ్గా రెండేళ్లు కావడం మరియు పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రెండవ యానివర్సరీ ఎడిషన్‌గా విడుదల చేసింది. రెనో క్విడ్ లోని రెగ్యులర్ కార్లతో పోల్చితే ఈ లిమిటెడ్ ఎడిషన్ కారు ధర రూ. 10,000 ల వరకు అధికంగా ఉంది.

English summary
Read In Telugu: Renault Kwid 02 Anniversary Edition Launched In India; Prices Start At Rs 3.43 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark