నెక్ట్స్ ప్రొడక్ట్ సిద్దం చేసిన రెనో ఇండియా

Written By:

రెనో ఇండియా క్విడ్ రుచి మరిగిన తరువాత ప్రతి ఏడాది క్విడ్ ఆధారిత నూతన ఉత్పత్తులను మార్కెట్‌కు పరిచయం చేస్తాము అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను నిజం చేసే విధంగా క్విడ్ ఆధారిత క్లింబర్ హ్యాచ్‌బ్యాక్ వేరియంట్‌ను విడుదలకు సిద్దం చేసినట్లు తెలిపే కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ వేదికగా లీకయ్యాయి...

బ్రోచర్ ఆధారంగా క్విడ్ క్లింబర్ హ్యాచ్‌బ్యాక్ గురించి పూర్తి వివరాలు....

To Follow DriveSpark On Facebook, Click The Like Button
రెనో క్విడ్ క్లింబర్

రెనో ఇండియా మొదటి సారిగా క్విడ్ క్లింబర్ హ్యాచ్‌బ్యాక్ కారును తొలిసారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. గతంలో రెనో కంపెనీలోని సీనియర్ ఆధికారులు వెల్లడించిన వివరాల మేరకు రెనో ప్రతి ఏడాది కూడా క్విడ్ ఆధారిత ఉత్పత్తులను విడుదల చేస్తామన్న ప్రకటన తెలిసిందే.

రెనో క్విడ్ క్లింబర్

ఆటోస్అరేనా తమ వెబ్‌సైట్లో ప్రచురించిన కథనం మేరకు, ప్రొడక్షన్ దశకు చేరుకున్న ఫోటోలను విడుదల చేసింది. ఇక్కడ ఎలక్ట్రిక్ బ్లూ ఎక్ట్సీరియర్ మరియు అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, ఫ్రంట్ బంపర్ యాక్సెంట్స్, రూఫ్ రెయిల్స్ వంటి వాటిని ఆరేంజ్ రంగులో అందివ్వడం జరిగింది.

రెనో క్విడ్ క్లింబర్

ఫ్రంట్ డిజైన్‌లో అధిక మార్పులు చోటు చేసుకున్నాయి. కండలు తిరిగిన రూపాన్ని ప్రదర్శించే తీరులో ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ ఉన్న బ్లాక్ బంపర్, స్కిడ్ ప్లేట్లు మరియు ఆకర్షణీయమైన సిల్వర్ బంపర్ జోడింపు కలదు.

రెనో క్విడ్ క్లింబర్

క్విడ్ క్లింబర్ ప్రక్కవైపు డిజైన్‌ను పరిశీలిస్తే, మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, ముందు వైపు డోర్ మీద క్లింబర్ చిహ్నం కలదు. రియర్ డిజైన్ ఆవిష్కరించలేదు, అయితే ప్రంట్ బంపర్ కలిగి ఉన్న చిన్న సిల్వర్ బంపర్ తరహాలో వెనుక వైపున కూడా వచ్చే అవకాశం ఉంది.

రెనో క్విడ్ క్లింబర్

క్లిడ్ క్లింబర్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఆరేంజ్ రంగుల సొబగులు, గ్లాస్ బ్లాక్ సెంటర్ కన్సోల్, గేర్ నాబ్, డోర్ కార్డ్స్ మరియు క్లింబర్ చిహ్నాన్ని సీట్లకు పై భాగంలో ఉన్న హెడ్ రెస్ట్ మీద గుర్తించవచ్చు.

రెనో క్విడ్ క్లింబర్

సాంకేతిక అంశాల పరంగా ఇంకా ఎలాంటి వివరాలు స్పష్టం కాలేదు. అయితే ఆటో ఎక్స్ లో ప్రకటించిన వివరాల ప్రకారం. ఇందులో 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న ఎస్‌సిఇ పరిజ్ఞానం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది.

రెనో క్విడ్ క్లింబర్

ఇది 5,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 67బిహెచ్‌పి పవర్ మరియు 4,250ఆర్‌పిఎమ్ వద్ద 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. మరియు ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది.

రెనో క్విడ్ క్లింబర్

సాధారణ క్విడ్‌తో పోల్చుకుంటే దీని ధర సుమారుగా రూ. 30,000 నుండి 40,000 ల వరకు అదనపు ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

రెనో క్విడ్ క్లింబర్

ఈ ఏడాది ఓ కొత్త హ్యాచ్‌బ్యాక్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా...? మారుతి సుజుకి అతి త్వరలో 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనుంది. ఇది ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా... అయితే క్రింది గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి....

 
Read more on: #రెనో #renault
English summary
Renault Kwid Climber Brochure Leaked — Another Cosmetic Touch Up?
Story first published: Tuesday, March 7, 2017, 18:25 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark