క్విడ్ క్లింబర్ విడుదల చేసిన రెనో: ధర, ఇంజన్ మరియు స్పెసిఫికేషన్ల కోసం...

Written By:

ఫ్రెంచ్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియా విభాగం, దేశీయ విపణిలోకి క్విడ్ క్లింబర్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 4.30 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు రెనో ప్రతినిధులు పేర్కొన్నారు.

రెనో క్విడ్ క్లింబర్

రెనో ఇండియా తమ క్విడ్ క్లింబర్ వేరియంట్‌ను కేవలం 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే పరిచయం చేసింది. క్విడ్ క్లింబర్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు ట్రాన్స్‌మిషన్ల అనుసంధానం కలదు.

రెనో క్విడ్ క్లింబర్
 • క్విడ్ క్లింబర్ మ్యాన్యువల్ ధర రూ. 4,30,376 లు
 • క్విడ్ క్లింబర్ ఆటోమేటిక్ ధర రూ. 4,60,376 లు
రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.
స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్లు

 • ఇంజన్ సామర్థ్యం - 999సీసీ
 • పవర్ - 5,500ఆర్‌పిఎమ్ వద్ద67బిహెచ్‌పి
 • టార్క్ - 4,250ఆర్‌పిఎమ్ వద్ద 91ఎన్ఎమ్
 • మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్ - 23.01 కిమీ/లీ
 • ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ - 24.04 కిమీ/లీ
క్విడ్ క్లింబర్ కొలతలు

క్విడ్ క్లింబర్ కొలతలు

 • పొడవు - 3,992ఎమ్ఎమ్
 • వెడల్పు - 1,579ఎమ్ఎమ్
 • ఎత్తు (రూఫ్ రెయిల్స్‌తో కలుపుకొని) - 1,513ఎమ్ఎమ్
 • వీల్ బేస్ - 2,442ఎమ్ఎమ్
 • గ్రౌండ్ క్లియరెన్స్ - 180ఎమ్ఎమ్
క్విడ్ క్లింబర్ డిజైన్

క్విడ్ క్లింబర్ డిజైన్

ఇంజన్, స్పెసిఫికేషన్స్ మరియు డిజైన్ అంశాల పరంగా క్విడ్ క్లింబర్ 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్‌ను పోలి ఉంది. అయితే ఇది ఎలక్ట్రిక్ బ్లూ, అవుట్ బ్యాక్ బ్రాంజ్ మరియు ప్లానెట్ గ్రే వంటి రంగుల్లో లభించును.

రెనో క్విడ్ క్లింబర్

అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, రూఫ్ రెయిల్స్ మీద ఆరేంజ్ కలర్, ప్రక్క వైపుల డోర్ మీద క్లింబర్ పేరు అదే విధంగా 6-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి.

రెనో క్విడ్ క్లింబర్

ఇంటీరియర్ మొత్తాన్ని రెనో పూర్తిగా నూతన శైలిలో అందించింది. ఆరేంజ్ కలర్ సొబగులు అందించింది. ప్రత్యేకంగా డ్యాష్ బోర్డ్, డోర్ లోపలి వైపున, గేర్ నాబ్, మరియు సీట్ల మీద ఆరేంజ్ రంగుని అందివ్వడం జరిగింది. స్టీరింగ్ వీల్ మీద క్లింబర్ పేరును గుర్తించవచ్చు.

రెనో క్విడ్ క్లింబర్

భద్రత పరంగా రెనో క్విడ్ క్లింబర్ హ్యాచ్‌బ్యాక్‌లో సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్ మరియు డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగును అందించింది.

రెనో క్విడ్ క్లింబర్

రెనో క్విడ్ క్లింబర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రెనో విక్రయ కేంద్రాలలో అమ్మకాలకు సిద్దంగా ఉంది. మారుతి సుజుకి ఆల్టో కె10 మరియు టాటా టియాగో వేరియంట్లకు ఇది పోటీనివ్వనుంది.

రెనో క్విడ్ క్లింబర్

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.

 

Read more on: #రెనో #renault
English summary
Renault Kwid Climber Launched In India; Prices Start At Rs 4.30 Lakh
Story first published: Thursday, March 9, 2017, 18:16 [IST]
Please Wait while comments are loading...

Latest Photos