జిఎస్‌టి అనంతరం రెనో క్విడ్ ధరలు

Written By:

ఫ్రెంచ్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియా, దేశీయంగా అమలైన నూతన ట్యాక్స్ విధానం జిఎస్‌టికి అనుగుణంగా తమ అన్ని మోడళ్లను ధరలను సవరించింది. వివిధ మోడళ్ల మీద గరిష్టంగా 7 శాతం వరకు ధరలు తగ్గించినట్లు రెనో పేర్కొంది.

రెనో లైనప్‌లో ఉన్న మోస్ట్ పాపులర్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ మీద జిఎస్‌టి ప్రతిఫలాలను ధరల తగ్గింపు రూపంలో కస్టమర్లకు అందిస్తోంది. అయితే తగ్గించబడిన అన్ని ధరలు కూడా వివిధ రాష్ట్రాలు మరియు డీలర్లతో పాటు వేరియంట్ల ఆధారంగా వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.

రెనో ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ సుమిత్ సాహ్నే మాట్లాడుతూ," ఒకే దేశం - ఒకే ట్యాక్స్ అంటూ భారత ప్రభుత్వం అమలు చేసిన జిఎస్‌టి గొప్ప విజయం అని కొనియాడారు. అంతే కాకుండా జిఎస్‌టి ద్వారా దేశీయంగా వ్యాపార అవకాశాలు మరింత మెరుగవుతాయని చెప్పుకొచ్చారు."

రెనో క్విడ్ లోని వివిధ వేరియంట్ల ఆధారంగా రూ. 5,200 నుండి 29,500 ల వరకు ధర తగ్గింది. రెనో క్విడ్ ప్రస్తుతం 800సీసీ మరియు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
పాత పన్ను విధానంతో పోల్చుకుంటే ప్రస్తుతం క్విడ్ చౌకగా లభిస్తోంది. ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్‌తో లభిస్తున్న స్మాల్ హ్యాచ్‌బ్యాక్‌ కారును ఎంచుకోవాలనుకునే వారికి క్విడ్ మంచి ఎంపిక.

Read more on: #రెనో #renault
English summary
Read In Telugu Renault Kwid Prices Drop After GST
Story first published: Thursday, July 6, 2017, 15:26 [IST]
Please Wait while comments are loading...

Latest Photos