నాలుగు కార్లను మార్కెట్ నుండి తొలగించిన రెనో

Written By:

రెనో ఇండియా ఈ మధ్యనే క్యాప్చర్ ఎస్‌యూవీని విపణిలోకి ఆవిష్కరించింది. ఇండియన్ ప్రీమియమ్ ఎస్‌యూవీని సెగ్మెంట్లోకి సరికొత్త వెహికల్స్ పరిచయం చేయడానికి సిద్దమవుతోంది. అయితే, కొత్త మోడళ్లను పరిచయం చేస్తూనే మార్కెట్లో ఆశించిన ఫలితాలను కనబరచని తమ ఇతర మోడళ్లను శాశ్వతంగా మార్కెట్‌ను తొలగిస్తోంది.

నాలుగు కార్లను శాశ్వతంగా తొలగించిన రెనో

రెనో ఇండియా లైనప్‌లో ఉన్న నాలుగు కార్లను నిశ్శబ్ధంగా తొలగించింది. ఇక మీదట ఈ కార్లను కొనాలన్నా దొరకడం కష్టమే. ప్రస్తుతం డిస్కంటిన్యూ చేసిన వాటిలో పల్స్ హ్యాచ్‌బ్యాక్, స్కాలా మరియు ఫ్లూయెన్స్ సెడాన్ మరియు కొలియోస్ ఎస్‌యూవీలు ఉన్నాయి.

నాలుగు కార్లను శాశ్వతంగా తొలగించిన రెనో

నాలుగు మోడళ్లను విపణి నుండి తొలగించిన అనంతరం ప్రస్తుతం రెనో లైనప్‌లో క్విడ్ హ్యాచ్‌బ్యాక్, లాజీ ఎమ్‌పీవీ, డస్టర్ ఎస్‌యూవీలు ఉన్నాయి. అతి త్వరలో వీటి సరసన సరికొత్త క్యాప్చర్ ప్రీమియమ్ ఎస్‌యూవీ వచ్చి చేరనుంది. దీంతో రెనో విక్రయించే కార్ల సంఖ్య నాలుగుకు పడిపోయింది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
నాలుగు కార్లను శాశ్వతంగా తొలగించిన రెనో

ప్రముఖ పత్రికతో రెనో ఇండియా సిఇఒ మరియు మేనేజింగ్ డైరక్టర్ సుమిత్ సాహ్నే మాట్లాడుతూ, "సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం రెనో ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఎన్నో మోడళ్లను పరిచయం చేసినప్పటికీ కస్టమర్లు మెచ్చే మోడళ్లకే అధిక ప్రాధాన్యతనిస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ఆశించిన ఫలితాలను కనబరచని కార్లను మార్కెట్ నుండి తొలగించినట్లు తెలిపాడు."

నాలుగు కార్లను శాశ్వతంగా తొలగించిన రెనో

"ప్రస్తుతం దేశీయంగా కస్టమర్లు అధికంగా ఎంచుకుంటున్న క్విడ్, డస్టర్ మరియు లాజీ కార్లను మాత్రమే అందుబాటులో ఉంచాము. ఇక మీదట ప్రతి ఏడాది ఒక కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసే లక్ష్యంతో ఉన్నట్లు సుమిత్ చెప్పుకొచ్చాడు."

నాలుగు కార్లను శాశ్వతంగా తొలగించిన రెనో

మెరుగైన విక్రయాలు లేనందునే రెనో తమ ప్యాసింజర్ కార్లను ప్రక్షాళన చేసింది. విక్రయాలను పెంచుకునేందుకు నిస్సాన్ భాగస్వామ్యంలో ఉన్నపుడు పల్సర్ మరియు స్కాలా కార్లను నిస్సాన్ వారి మైక్రా మరియు సన్నీ కార్ల ఆధారంగా రీబ్యాడ్జ్ వెర్షన్‌లో ప్రవేశపెట్టింది.

నాలుగు కార్లను శాశ్వతంగా తొలగించిన రెనో

అదే విధంగా, ఫ్ల్యూయెన్స్ మరియు కొలియోస్ వెహికల్స్‌ను ఇండియాలో తయారు చేయకుండా పూర్తిగా నిర్మించిన మోడళ్ల రూపంలో దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయించసాగింది. దీంతో ధర ఎక్కువగా ఉండటమే కాకుండా వీటి స్పేర్ పార్ట్స్ లభ్యత కస్టమర్లకు చాలా ఇబ్బదికరంగా ఉండేది.

నాలుగు కార్లను శాశ్వతంగా తొలగించిన రెనో

కేవలం రెండు మూడు కొత్త మోడళ్లతోనే సక్సెస్ రుచి చూసిన రెనో భారత్‌ మార్కెట్లో వ్యూహాత్మక ప్రణాళికలు రచించింది. ఏడాదికొకటి చొప్పున ప్రతి సంవత్సరం ఒక కొత్త కారును విడుదల చేసే ఆలోచనలో ఉంది. ఈ ఏడాదిలో క్యాప్చర్, 2018 లో ఫేస్‌లిఫ్ట్ డస్టర్ మరియు 2019లో సరికొత్త ఎమ్‌పీవీని విడుదల చేయనుంది.

నాలుగు కార్లను శాశ్వతంగా తొలగించిన రెనో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త కార్లను విక్రయించడం పెద్ద సమస్య కాదు, కాని ఆ కార్ల రీసేల్ వ్యాల్యూ పటిష్టంగా ఉంటే కస్టమర్లు ఎక్కువగా సంతృప్తి చెందుతారు. సేల్స్ తరువాత అత్యుత్తమ సర్వీస్, స్పేర్ట్ పార్ట్స్ లభ్యత బాగుంటేనే సక్సెస్ సాధ్యమవుతుంది. ఇది గుర్తించని షెవర్లే ఇండియాలో శాశ్వతంగా తమ కార్యకలాపాలను నిలిపివేసింది.

అయితే, ఫ్రెంచ్ దిగ్గజం రెనో భారత్‌లో తమ ముఖ చిత్రాన్నే మార్చేసే ప్రయత్నం చేస్తోంది.

English summary
Read In Telugu: Renault Discontinues Several Cars In India — Here's Why
Story first published: Monday, October 9, 2017, 11:58 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark