స్కోడా కొడియాక్ ఎస్‌యూవీ సాంకేతిక వివరాలు లీక్

Written By:

చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా విపణిలోకి తమ కొడియాక్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కొడియాక్ ఎస్‌యూవీ పూర్తి సాంకేతిక వివరాలు రహస్యంగా లీక్ అయ్యాయి.

స్కోడా కొడియాక్

స్కోడా ఆటో అక్టోబర్ 4, 2017 న ఇండియన్ మార్కెట్లోకి కొడియాక్ ఎస్‌యూవీ విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఆన్‌లైన్ వేదికగా కొడియాక్ సాంకేతిక వివరాలను తెలిపే ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి.

స్కోడా కొడియాక్

ఇండియన్ స్పెక్ స్కోడా కొడియాక్ 2.0-లీటర్ సామర్థ్యం గల టుర్భో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌తో వస్తోంది. ఇది గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 340ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌లో కూడా ఇదే ఇంజన్ ఉంది. అయితే, దాని కంటే ఇది 7బిహెచ్‌పి ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

స్కోడా కొడియాక్

ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ చక్రాలకు చేరడానికి 7-స్పీడ్ ఆటోమేటిక్ డిఎస్‌జి ట్రాన్స్‌మిషన్ కలదు. కొలతల పరంగా స్కోడా కొడియాక్ పొడవు 4,697ఎమ్ఎమ్, వెడల్పు 1,882ఎమ్ఎమ్, ఎత్తు 1,676ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 2,791ఎమ్ఎమ్‌గా ఉంది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
స్కోడా కొడియాక్

స్కోడా కొడియాక్ గ్రౌండ్ క్లియరెన్స్ 140ఎమ్ఎమ్‌గా ఉంది. టిగువాన్‌తో పోల్చుకుంటే 9ఎమ్ఎమ్ వరకు తగ్గువగానే ఉంది. మరియు టిగువాన్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి(71-లీటర్ల)తో పోల్చుకుంటే కొడియాక్ ఇంధన ట్యాంక్ కెపాసిటి(63-లీటర్లు) కొద్దిగా తక్కువగానే ఉంది.

స్కోడా కొడియాక్

కొడియాక్‌లో మూడు వరుసల సీటింగే లేఅవుట్ కలదు. సాధారణంగా కొడియాక్ బూట్ స్పేస్ 270-లీటర్లుగా ఉంది. చివరి వరుస సీటును పూర్తిగా మడిపేయడం ద్వారా 2,005-లీటర్లకు లగేజ్ స్పేస్ పెంచుకోవచ్చు.

స్కోడా కొడియాక్

డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొడియాక్ వాహనం స్కోడా ఇండియాలో తొలి పూర్తి స్థాయి ఎస్‌యూవీగా వస్తోంది. ప్రస్తుతం దేశీయంగా ఉన్న వోక్స్‌వ్యాగన్ టిగువాన్, ఫోర్డ్ ఎండీవర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

స్కోడా కొడియాక్ ఎస్‌యూవీని రూ. 27 లక్షల నుండి రూ. 32 లక్షల శ్రేణిలో ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: India-Spec Skoda Kodiaq Technical Details Leaked
Story first published: Saturday, September 23, 2017, 13:09 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark