పరీక్షల కోసం రోడ్డెక్కిన కొత్త తరం హ్యుందాయ్ శాంట్రో

Written By:

హ్యుందాయ్ ఇండియా సరికొత్త స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును అభివృద్ది చేస్తున్నట్లు ఇది వరకే ప్రకటించాము. అయితే, తాజాగా హ్యుందాయ్ ఇప్పుడు కాన్సెప్ట్ దశలో ఉన్న ఏహెచ్2 స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తోంది.

కొత్త తరం హ్యుందాయ్ శాంట్రో

నెక్ట్స్ జనరేషన్ శాంట్రో పేరుతో హ్యుందాయ్ ఈ చిన్న కారును 2018లో ఇండయన్ మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సన్నద్దమవుతోంది. ఈ నేపథ్యంలో టెస్టింగ్‌ను వేగవంతం చేసినట్లు తెలిసింది.

Recommended Video - Watch Now!
High Mileage Cars In India - DriveSpark
కొత్త తరం హ్యుందాయ్ శాంట్రో

పరీక్షించబడిన మోడల్‌లో డిజైన్ అంశాలను గుర్తించడానికి వీల్లేకుండా కారు మొత్తాన్ని కప్పివేయడం జరిగింది. అయితే, ఫోటోల ప్రకారం రియర్ మిర్రర్ మీద స్టాప్ లైట్, స్మాల్ టెయిల్ ల్యాంప్స్, విండ్ షీల్డ్ వైపర్, ప్లాస్టిక్ వీల్ కవర్స్ మరియు బంపర్ మీద నెంబర్ ప్లేట్ పొజిషన్ వంటివి గమనించవచ్చు.

కొత్త తరం హ్యుందాయ్ శాంట్రో

ప్రస్తుతం డెవలప్‌మెంట్ మరియు టెస్టింగ్ దశలో ఉన్న 2018 శాంట్రో వచ్చే ఏడాది మధ్య భాగానికి పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ వెర్షన్‌లో విడుదలకు సిద్దం కానుంది. ఇంటీరియర్‌లో విశాలమైన క్యాబిన్ స్పేస్, టాప్ వేరియంట్లో పలు రకాల కొత్త ఫీచర్లు రానున్నాయి.

కొత్త తరం హ్యుందాయ్ శాంట్రో

2018 హ్యుందాయ్ శాంట్రోకు సంభందించి ఎలాంటి సాంకేతిక సమాచారం లేదు. అయితే, న్యూ శాంట్రో 800సీసీ లేదా ఐ10 కారులో ఉన్న 1.0-లీటర్ కెపాసిటి గల ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించవచ్చు.

కొత్త తరం హ్యుందాయ్ శాంట్రో

డ్రైవ్‌స్పార్త్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో శాంట్రో భారీ సక్సస్ సాధించిపెట్టింది. డిజైన్ పాతదైపోవడం మరియు పోటీ అధికమవ్వడంతో మార్కెట్ నుండి వైదొలిగింది. నూతన డిజైన్ శైలిలో రీలాంచ్‌కు సిద్దమైన శాంట్రో పూర్తి స్థాయిలో విడుదలైతే విపణిలో ఉన్న మారుతి సెలెరియో, టాటా టియాగో మరియు రెనో క్విడ్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

Trending On DriveSpark Telugu:

2017లో విడుదలైన బెస్ట్ బైకులు

2018 జనవరిలో విడుదలవుతున్న కొత్త కార్లు

పాక్‌‌ను చిధ్రం చేసే భారతదేశపు 10 శక్తివంతమైన యుద్ద విమానాలు

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Next-Generation Hyundai Santro Spotted Testing In India
Story first published: Wednesday, December 27, 2017, 19:03 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark