దీపావళికి హెక్సా లిమిటెడ్ ఎడిషన్ సిద్దం చేసిన టాటా మోటార్స్

Written By:

ఇండియన్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ పండుగ సీజన్ కోసం హెక్సా ఎస్‌యూవీని సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌లో విడుదలకు సిద్దం చేస్తోంది. నూతన మెటాలిక్ బ్రౌన్ కలర్ పెయింట్ స్కీములో ఉన్న సరికొత్త హెక్సా వెహికల్‌ ఫోటోలు తాజాగా లీకయ్యాయి.

లిమిటెడ్ ఎడిషన్ మోడల్ హెక్సా లో కాస్మొటిక్ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఫోటోల్లో సందడి చేస్తున్న లిమిటెడ్ ఎడిషన్ హెక్సా స్టాండర్డ్ వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది.

టాటా హెక్సా లిమిటెడ్ ఎడిషన్

టాటా హెక్సా లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లో గ్లాస్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్ మరియు స్మోక్ హెడ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ సొబగులు ఉన్నాయి. ఫ్రంట్ బంపర్‌లో ఇంటిగ్రేటెడ్ సిల్వర్ స్కిఫ్ ప్లేట్లు, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ మరియు గ్లాస్ బ్లాక్ హౌసింగ్ ఇందులో ఉన్నాయి.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టాటా హెక్సా లిమిటెడ్ ఎడిషన్

హెక్సా లిమిటెడ్ మోడల్‌లో 19-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌ను ఎక్స్‌టి వేరియంట్లో స్టాండర్డ్‌గా అందిస్తోంది. వీటిని మినహాయిస్తే హెక్సా లిమిటెడ్ ఎడిషన్‌లో ఎలాంటి అదనపు మార్పులు చోటు చేసుకోవడం లేదు.

టాటా హెక్సా లిమిటెడ్ ఎడిషన్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న టాటా మోటార్స్ విక్రయ కేంద్రాలలో హెక్సా ఎస్‌యూవీ ఐదు విభిన్న రంగుల్లో లభిస్తోంది. అవి, అరిజోనా బ్లూ, టంగ్‌స్టన్ సిల్వర్, పర్ల్ వైట్, ప్లాటినమ్ సిల్వర్ మరియు స్కై గ్రే.

టాటా హెక్సా లిమిటెడ్ ఎడిషన్

లిమిటెడ్ ఎడిషన్ హెక్సా ఎస్‌యూవీలో 2.2-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. హెక్సా ఎక్స్ఇ వేరియంట్లో లభించే ఈ ఇంజన్ గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా హెక్సా లిమిటెడ్ ఎడిషన్

హెక్సా లోని ఎక్స్ఎమ్ మరియు ఎక్స్‌టి వేరియంట్లలోని శక్తివంతమైన ఇంజన్ 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హెక్సా బేస్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఎక్స్ఎమ్, ఎక్స్‌టి వేరియంట్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తున్నాయి. అదే విధంగా ఎక్స్‌టి ఆల్ వీల్ డ్రైవ్ సిస్టిమ్ కూడా ఉంది.

టాటా హెక్సా లిమిటెడ్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో హెక్సా ఎస్‌యూవీని విడుదల చేసింది. విడుదలైనప్పటి హెక్సాకు మంచి డిమాండ్ లభిస్తోంది. కస్టమర్ల నుండి కూడా మంచి రివ్యూ సొంతం చేసుకుంది. దీంతో ఎలాంటి బ్యాడ్ రివ్యూ లేని వెహికల్‌గా అత్యుత్తమ సేల్స్ సాధిస్తోంది.

ఇప్పుడు పండుగ సీజన్‌లో మరింత మంది కస్టమర్లను చేరుకోవడానికి టాటా తమ హెక్సా ఎస్‌యూవీని లిమిటెడ్ ఎడిషన్‌లో ప్రవేశపెడుతోంది. విభిన్న మోడల్ ఎంచుకోవాలనుకునే హెక్సా ప్రేమికులకు ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Spy Pics - Tata Hexa Limited Edition Spotted
Story first published: Thursday, October 12, 2017, 13:15 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark