32కిమీల మైలేజ్ ఇచ్చే స్విఫ్ట్ హైబ్రిడ్‌ను విడుదల చేసిన సుజుకి

Written By:

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ సుజుకి, జపనీస్ మార్కెట్లో తమ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను హైబ్రిడ్ వేరియంట్లో విడుదల చేసింది. సుజుకి తెలిపిన వివరాల ప్రకారం దీని మైలేజ్ లీటర్‌కు 32 కిలోమీటర్లు ఇస్తుంది.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ విడుదల

జపాన్‌లో స్విఫ్ట్ హైబ్రిడ్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. అవి, స్విఫ్ట్ హైబ్రిడ్ ఎస్‌జి మరియు స్విఫ్ట్ హైబ్రిడ్ ఎస్ఎల్. వీటి ధరలు వరుసగా 1,660,000 యెన్ నుండి 1,944,000 యెన్‌ల మధ్య ఉన్నాయి.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ విడుదల

అయితే ఇది వరకే జపనీస్ మార్కెట్లో లభించే స్విఫ్ట్ హైబ్రిడ్ ఎమ్ఎల్ మరియు హైబ్రిడ్ ఆర్ఎస్ వేరియంట్లు, ఇప్పుడు విడుదలైన వేరియంట్లు పూర్తిగా భిన్నమైనవని గుర్తుంచుకోండి. ఎందుకంటే పాత వేరియంట్లలో స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి అనే పేరుతో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. కానీ ఇప్పుడు విడుదలైన హైబ్రిడ్ స్విఫ్ట్‌లలో పూర్తి స్థాయి హైబ్రిడ్ టెక్నాలజీ కలదు.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ విడుదల

తాజాగా విడుదలైన పూర్తి స్థాయి హైబ్రిడ్ వేరియంట్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ మరియు 10కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ కలదు. 5-స్పీడ్ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న ఈ ఇంజన్ వ్యవస్థ గరిష్టంగా 90బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ విడుదల

స్విఫ్ట్ హైబ్రిడ్ వేరియంట్ తక్కువ వేగం వద్ద ఉన్నపుడు పెట్రోల్ ఇంజన్ ఆఫ్ చేసి పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో పరిమిత దూరం మేర నడుస్తుంది. కారు వేగం పెరిగితే ఆటోమేటిక్‌గా పెట్రోల్ ఇంజన్ కూడా పనిచేస్తుంది. తద్వారా ఇంధన ఆదా జరిగి మైలేజ్ పెరుగుతుంది.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ విడుదల

కార్లలో హైబ్రిడ్ వ్యవస్థను అందివ్వడం ద్వారా మైలేజ్ పెరగడమే కాకుండా సాధారణ కార్లతో పోల్చుకుంటే తక్కువ ఉద్గారాలు విడుదలవుతాయి. సుజుకి ప్రకారం, స్విఫ్ట్ హైబ్రిడ్ హ్యాచ్‌బ్యాక్ సగటు మైలేజ్ లీటర్‌కు 32కిలోమీటర్లుగా ఉంది. అయికే టూ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో మాత్రమే లభిస్తోంది.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ విడుదల

పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ వ్యవస్థను అందివ్వడంతో రెగ్యులర్ వెర్షన్ స్విఫ్ట్‌తో పోల్చుకుంటే దీని కొలతల్లో వ్యత్యాసం ఉంది. స్విఫ్ట్ హైబ్రిడ్ పొడవు 3,840ఎమ్ఎమ్, వెడల్పు 1,500ఎమ్ఎమ్, ఎత్తు 1,525ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 2,450ఎమ్ఎమ్‌గా ఉంది.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ విడుదల

ఇతర స్విఫ్ట్ మోడళ్లతో పోల్చితే ఇంటీరియర్‌లో ఎలాంటి అదనపు ఫీచర్లు రాలేదు, మార్పులు జరగలేదు. అయితే హైబ్రిడ్ వెర్షన్ కాబట్టి ఇంజన్ ఉత్పిత్తి చేసే పవర్ వివరాలను వెల్లడించే గ్రాఫిక్స్ డిస్ల్పేలో వచ్చేలా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా పెడల్ షిఫ్టర్స్ మరియు సుజుకి డ్యూయల్ కెమెరా బ్రేక్ సపోర్ట్ ఫీచర్లు ఉన్నాయి.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ విడుదల

గతంలో హైబ్రిడ్ కార్లను విక్రయించే మరియు కొనుగోలు చేసే వారికి భారత ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందించేది. అయితే నూతన ట్యాక్స్ విధానం జిఎస్‌టి అమలుతో మునుపు హైబ్రిడ్ కార్ల మీద ఉండే ట్యాక్స్ విపరీతంగా పెరగడంతో ప్రస్తుతం హైబ్రిడ్ కార్ల ధరలు భారీగా పెరిగాయి.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ విడుదల

కాబట్టి స్విఫ్ట్ హైబ్రిడ్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు దాదాపు లేనట్లే, అయితే అత్యుత్తమ మైలేజ్‌ ఇవ్వగలిగే విధంగా 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లను 2018 నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

English summary
Read In Telugu: Suzuki Launches New Swift Hybrid Model In Japan
Story first published: Saturday, July 15, 2017, 12:58 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark