దేశీయ పరిజ్ఞానంతో బలమైన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా అవతరణకు శ్రీకారం

Written By:

టాటా మోటార్స్ అతి త్వరలో దేశీయంగా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువిని దేశీయంగా విడుదల చేయనుంది. టియాగో విడుదలతో మంచి విజయాన్ని అందుకొన్న టాటా 2017 జనవరిలో హెక్సా ఎస్‌యువిని విడుదల చేసింది. ఇప్పుడు బలమైన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా అవతరించడానికి ఒక్కో సెగ్మెంట్లో తమ శక్తివంతమైన ఉత్పత్తులను సిద్దం చేస్తోంది. ఇండియాలో మంచి ఆదరణ పొందిన సెగ్మెంట్లలో ఒకటి కాంపాక్ట్ ఎస్‌యువి...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి

కాంపాక్ట్ ఎస్‍‌‌యువి సెగ్మెంట్లో భారీ విజయాన్ని అందుకున్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మారుతి సుజుకి వితారా బ్రిజా వాహనాలకు పోటీగా టాటా తమ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువిని విడుదలకు సిద్దం చేస్తోంది. ఈ రెండు ఉత్పత్తులను అదిగమించేందుకు నెక్సాన్ లో ఉన్న ప్రత్యేకతల గురించి ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి...

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి

టాటా మోటార్స్ 2014 లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శన వేదిక మీద కాన్సెప్ట్ దశలో ఉన్న నెక్సాన్ ను ప్రదర్శించింది. తరువాత గత ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రొడక్షన్ దశకు చేరుకున్న నెక్సాన్ ను ప్రదర్శించింది.

ఎక్ట్సీరియర్

ఎక్ట్సీరియర్

నెక్సాన్ ఎస్‌యువిని ఎక్ట్సీరియర్ పరంగా గమనిస్తే, ప్రపంచ వ్యాప్తంగా నూతన డిజైన్, ఫ్రెష్ లుక్ ఇందులో దర్శనమిస్తుంది. గతంలో ఉన్న మరే టాటా ఉత్పత్తితో కూడా దీనికి పోలిక ఉండదు. ముందు వైపున కండలు తిరిగిన ఆకృతి, కూపే తరహాలో రూఫ్ లైన్, విశాలమైన ఫ్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా కాస్త పై భాగంలో స్పస్టమైన ఎల్ఇడి, టర్న్ లైట్లతో కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లో ప్రీమియమ్ ఎస్‌యువి తరహాలో ఉంది.

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి

సైడ్ ప్రొఫైల్ గమనిస్తే, రెగ్యులర్ డిజైన్ తీరులో కాకుండా కూపే తరహాలో రూఫ్ రెయిల్ వాలుగా క్రిందకు ఉండే విధంగా డిజైన్ చేయబడింది. అయినప్పటికీ ఇది ఎస్‌యూవీ తరహాలోనే ఉంది. వెనుక వైపు డిజైన్‌లో డిజైన్ కట్ ఆకారంలో ఉన్న క్లస్టర్ టెయిర్ ల్యాంప్స్ ఉన్నాయి. టెయిల్ ల్యాంప్ సెక్షన్‌లో సిల్వర్ స్ట్రిప్ గుర్తించగలరు.

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి

టాటా ఆధునిక డిజైన్ తీరును వ్యక్తపరిచే విధంగా ప్రక్క మరియు వెనుక వైపున తెల్లటి పట్టీ (స్ట్రిప్) అందించింది, తద్వారా ఇది మిగతా వాహనాలతో పోల్చితే అత్యంత స్పోర్టి‌వ్‌గా ఉంటుంది. మారుతి వితారా బ్రిజా తరహాలో కాకుండా, ఇంటీరియర్ స్పేస్‌కు ప్రాధాన్యతనిస్తూనే అనేక వంపులున్న డిజైన్‌ను నెక్సాన్‌లో అనువర్తించింది టాటా.

ఇంటీరియర్

ఇంటీరియర్

టాటా నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యువిలో ప్రధానంగా గుర్తించిన ఫీచర్, 6.5-అంగుళాల పరిమాణం ఉన్న తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. డ్యాష్ బోర్డ్ మీద టాటా లైనప్‌లోని ఇతర ఫీచర్లను జోడించి, డ్యాష్ బోర్డ్ పై భాగంలో ఇన్ఫోటైన్‌మెట్ సిస్టమ్ అందించింది.

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి

టాటా పరిచయం చేసిన మరో విప్లవాత్మక ఇంటీరియర్ ఫీచర్, డయల్ తరహాలో ఉన్న డ్రైవ్ మోడ్ సెలక్టర్. బటన్ తరహాలో ఉండే స్థానంలో దీనిని ప్రవేశపెడుతూ, సెంటర్ కన్సోల్‌ మీద చేతికి అనువుగా ఎకో, సిటి మరియు స్పోర్ట్ అనే డ్రైవింగ్ మోడ్లను ఎంచుకునే డయల్ మోడ్ సెలక్టర్‌ అందివ్వడం జరిగింది.

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి

బాడీ మొత్తం డిజైన్‌లో అత్యంత కీలకమైనది సీటింగ్. ఇందులో ఐదు మంది ప్రయాణించవచ్చు. అయితే సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యువి ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన కారణంగా ఐదవ ప్యాసింజర్ కాస్త ఇబ్బందిపడే అవకాశం ఉంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఉత్తమ కుషనింగ్ గల సీట్లను అందివ్వడం జరిగింది.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

టాటా మోటార్స్ ఉత్పత్తులతో పాటు ఇంజన్ ప్రాబల్యాన్ని కూడా పెంచుకుంటోంది. అందుకు గాను ప్రత్యేకించి నాలుగు సిలిండర్ల, 1.5-లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అభివృద్ది చేసుకుంది. కాబట్టి ఫియట్ వారి 1.3-లీటర్ మల్టీ జెట్ డీజల్ వినియోగానికి స్వస్తిపలకనుంది. టియాగోలో పరిచయం చేసిన 1.05-లీటర్ డీజల్ ఇంజన్‌కు కొనసాగింపుగా దీనిని డెవలప్‌చేసింది.

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి

పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే టాటా తమ టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో అందించిన 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న రివట్రాన్ పెట్రోల్ ఇంజన్‌ను నెక్సాన్ పెట్రోల్ వేరియంట్లో అందివ్వనుంది. నెక్సాన్ లోని పెట్రోల్ వేరియంట్ 105బిహెచ్‌పి మరియు నెక్సాన్ డీజల్ వేరియంట్ 110బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

గేర్‌బాక్స్ వివరాలు

గేర్‌బాక్స్ వివరాలు

టాటా మోటార్స్ తమ నెక్సాన్ లోని డీజల్ వేరియంట్లకు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు పెట్రోల్ వేరియంట్లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసందానంతో విడుదల చేయనుంది. భవిష్యత్తులో ఈ రెండు వేరియంట్లను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా విడుదల చేయనుంది.

ధర వివరాలు

ధర వివరాలు

టాటా మోటార్స్ తమ ఉత్పత్తుల ధరలను నిర్ణయించడంలో ఎంతో ఆచితూచి వ్యహరిస్తోందని టియాగో మరియు హెక్సా ధరలతో స్పష్టమవుతోంది. కాబట్టి టాటా ఈ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువిని రూ. 7 నుండి 10 లక్షల మధ్య ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

పోటీదారులు

పోటీదారులు

విపణిలోని సబ్ కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లో విడుదల కానుంది కాబట్టి, ఇదే సెగ్మెంట్లో ప్రస్తుతం ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా వారి ట్యాంక్ తరహాలో ఉన్న టియువి300 వాహనాలకు ప్రత్యక్షంగా బలమైన పోటీనివ్వనుంది.

చివరి మాట

చివరి మాట

టాటా మోటార్స్ మొదటి సారిగా సబ్ కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లోకి విడుదల చేస్తున్న నెక్సాన్‌లో ప్రీమియమ్ ఫీచర్లు ఉండటం, మరే ఇతర మోడల్ లేని విధంగా ఫ్రెష్ డిజైన్, మరియు ధరకు తగ్గ విలువలతో విడుదలవుతుండటంతో కాంపాక్ట్ ఎస్‌యువి విభాగంలో టాటా కు మంచి విజయం ఖాయం....

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి

మారుతి సుజుకి ప్రస్తుతం భారత మార్కెట్లో 18 మోడల్(ళ్ల)ను ఆఫర్ చేస్తోంది. మారుతి సుజుకి కారు ధరలు, మోడళ్లు మరియు వేరియంట్ల గురించి తెలియజేయటంలో డ్రైవ్‌స్పార్క్ మీకు సహకరిస్తుంది, మారుతి సుజుకి అందిస్తున్న ఉత్పత్తుల యొక్క ఎక్స్-షోరూమ్, ఆన్-రోడ్ ధరలు, కలర్ ఆప్షన్స్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, లేటెస్ట్ న్యూస్ మరియు భారత్‌లో మారుతి సుజుకి యొక్క అన్ని కార్ల ఫొటోలను వీక్షించండి.... పూర్తి వివరాలకు......

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు తాజాగ అన్ని కార్లకు సంభందించిన ఫోటోలను ఒక చోటకు చేర్చి గ్యాలరీ సెక్షన్ ప్రారంభించింది. తయారీ దారులు మరియు మోడళ్ల ఆధారంగా వివిధ కార్ల ఫోటోలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి....

 
English summary
Tata’s Upcoming Sub-Compact SUV ‘Nexon’ — What We Know So Far
Story first published: Tuesday, January 24, 2017, 13:05 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark