ఇండియా యొక్క టాప్ 5 హాట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు

Written By:

దేశీయంగా ఎస్‌యూవీ సెగ్మెంట్లో అమ్మకాలు ఊపందుకున్న తరువాత సబ్ సెగ్మెంట్‌గా పరిచమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ అనేక ఉత్పత్తుల విడుదలకు నోచుకుంది. కారణం ఈ సెగ్మెంట్లో విడుదలయ్యే వాహనాలు మంచి అత్యుత్త విక్రయాలు సాధించడం. మచ్చుకు రెండు అనుకుంటే ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు రెనో డస్టర్. అప్పట్లో ఈ రెండూ తిరిగులేని అమ్మకాలు సాధించేవి. అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో కొన్ని కొత్త వాహనాలు విడుదలయ్యాయి.

ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు సాగిస్తున్న టాప్ 5 కాంపాక్ట్ ఎస్‌యూవీల గురించి నేటి కథనంలో తెలుసుకుందాం రండి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
5. రెనో డస్టర్

5. రెనో డస్టర్

ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం రెనో దేశీయంగా మొట్టమొదటి డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఇండియాలో రెనో ఉనికిని చాటి మొదటి ఉత్పత్తి కూడా ఇదే అని చెప్పవచ్చు. ధృడత్వం, రైడింగ్ సౌలభ్యం, పటిష్టమైన ఛాసిస్ మరియు అద్బుతమైన పనితీరు చూపే ఇంజన్ వంటి కారణాల చేత డస్టర్ కు అనతి కాలంలో భారీ స్పందన లభించింది. అయితే దీనికంటే తక్కువ ధరతో మరిన్ని కాంపాక్ట్ ఎస్‌యూవీల విడుదలతో విక్రయాలు నానాటికీ పడిపోతున్నాయి.

డస్టర్ సాంకేతిక వివరాలు

డస్టర్ సాంకేతిక వివరాలు

ఎస్‌యూవీ శైలిలో ఉన్న డస్టర్ రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజల్ ఇంజన్ , మరియు 1.6-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లతో డస్టర్‌ను ఎంచుకోవచ్చు.

4. మహీంద్రా టియువి300

4. మహీంద్రా టియువి300

ఎస్‌యూవీల తయారీ సంస్థగా మహీంద్రా అండ్ మహీంద్రా బాగా ప్రసిద్ది చెందింది. చూడటానికి ధృడమైన బాక్సీ ఆకారంలో నెచ్చెన తరహాలో ఉన్న ఛాసిస్‌తో రావడం మహీంద్రా ఎస్‌యూవీల ప్రత్యేకం. మహీంద్రా తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ టియువి300 లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించింది. ప్రస్తుతం దేశీయంగా ఈ సెగ్మెంట్లో ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ గల ఏకైక మోడల్ ఇదే.

టియువి300 సాంకేతిక వివరాలు

టియువి300 సాంకేతిక వివరాలు

మహీంద్రా గడిచిన జనవరి 2017లో 2,408 యూనిట్ల విక్రయాలు జరిపింది. ఇందులో 1.5-లీటర్ సామర్థ్యం గల 2-స్టేజ్ టర్బోఛార్జర్ గల ఇంజన్ కలదు, ఇది రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా ఈ టియువి300లో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించింది.

3. ఫోర్డ్ ఎకోస్పోర్ట్

3. ఫోర్డ్ ఎకోస్పోర్ట్

అమెరికాకు చెందిన ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ దేశీయ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ఎకోస్పోర్ట్ ను విడుదల చేసింది. ఇది అనేక ఫీచర్ల జోడింపుతో, శక్తివంతమైన ఇంజన్, ధృడమైన బాడీ మరియు అత్యుత్తమ రైడింగ్, హ్యాండ్లింగ్ లక్షణాలతో విడుదలై ఫోర్డ్‌కు మంచి విక్రయాలు సాధించి పెట్టింది. అనతి కాలంలో భారత దేశపు ఉత్తమ యుటిలిటి వాహనాల అమ్మకాల జాబితాలో చోటు సాధించింది.

ఎకోస్పోర్ట్ సాంకేతిక వివరాలు

ఎకోస్పోర్ట్ సాంకేతిక వివరాలు

మార్కెట్లోకి కొత్త వాహనాలు విడుదలయ్యే కొద్దీ రోజు రోజుకీ డిమాండ్ తగ్గిపోయింది. ఇందులో 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న ఎకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ ఆప్షన్‌లు ఇందులో ఉన్నాయి. ఫోర్డ్ ఈ మధ్యనే అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్‌ను జోడించింది.

2. హ్యుందాయ్ క్రెటా

2. హ్యుందాయ్ క్రెటా

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఎస్‌యూవీ పేరును బలపరిచే శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌లు ఇందులో ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి భద్రతపరమైన ఫీచర్లను క్రెటాలోని అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందించింది. ధర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ గడిచిన జనవరి 2017 లో 7,918 యూనిట్లు అమ్ముడుపోయాయి.

హ్యుందాయ్ క్రెటా సాంకేతిక వివరాలు

హ్యుందాయ్ క్రెటా సాంకేతిక వివరాలు

హ్యందాయ్ మోటార్స్ తమ క్రెటా కాంపాక్ట్ ఎస్‌యూవీలో పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌లను అందించింది. ఇందులోని 1.6-లీటర్ సామర్థ్యం పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో అదే విధంగా 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కూడా కలదు.

1. మారుతి సుజుకి వితారా బ్రిజా

1. మారుతి సుజుకి వితారా బ్రిజా

భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఉన్న అన్ని సెగ్మెంట్లలో మారుతి సుజుకి ఉత్పత్తి మొదటి స్థానంలో ఉంటుంది. ఇందుకు నేటి ఉదాహరణ బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మొదటి స్థానంలో ఉన్న వితారా బ్రిజా. ఈ సెగ్మెంట్లోకి ఆలస్యంగా చివరిలో విడుదలైనప్పటికీ భారీ విక్రయాలు సాధిస్తూ టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో స్థానంలో దక్కించుకుంది. ప్రత్యేకించి ఇండియన్స్ కోసం అభివృద్ది చేసిన ఇది పోటీగా నిలిచిన చుక్కులు చూపిస్తోంది.

వితారా బ్రిజా సాంకేతిక వివరాలు

వితారా బ్రిజా సాంకేతిక వివరాలు

గడిచిన జనవరి 2017 లో 8,932 యూనిట్ల వితారా బ్రిజా వాహనాలు అమ్ముడుపోయాయి. ఇందులో 1.25 లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

 
English summary
Top 5 Selling Compact SUVs In January 2017 In India
Story first published: Thursday, February 9, 2017, 16:17 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark