డ్యూయల్ టోన్ ఎటియోస్ లివా విడుదల చేసిన టయోటా మోటార్స్

Written By:

జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌ను డ్యూయల్ టోన్ ఆప్షన్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం లియా లైనప్‌లో ఉన్న వి మరియు విఎక్స్ ట్రిమ్‌లను పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన ఆప్షన్‌లతో విడుదల చేసినట్లు టయోటా తెలిపింది.

డ్యూయల్ టోన్ ఎటియోస్ లివా

డ్యూయల్ టోన్ పెట్రోల్ లివా వేరియంట్ల ధరలు రూ. 5,94,535 లు నుండి 6,44,861 లు వరకు మరియు డీజల్ వేరియంట్ లివా ధరలు 7,24,361 ల నుండి 7,61,403 లు మధ్య ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

డ్యూయల్ టోన్ ఎటియోస్ లివా

సాధారణ లివా మరియు డ్యూయల్ టోన్ లివా వేరియంట్‌కు మధ్య ఉన్న తేడా ఏమిటంటారా...? డ్యూయల్ టోన్ లివా హ్యాచ్‌బ్యాక్ మీద డ్యూయల్ టోన్ పెయింట్ జాబ్ అందించింది. మరియు వెనుక వైపున స్పోర్టివ్ స్పాయిలర్, సరికొత్త ఫ్రంట్ గ్రిల్, క్రోమ్ సొబగులు గల ఫాగ్ ల్యాంప్స్ మరియు ఎలక్ట్రిక్ ద్వారా మడిపేఅవకాశం ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ కలవు.

డ్యూయల్ టోన్ ఎటియోస్ లివా

ఇంటీరియర్‌లో, సరికొత్త లివా డ్యూయల్ టోన్ వేరియంట్ సరికొత్త పియానో బ్లాక్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్, వెనుక సీట్లకు హెడ్ రెస్ట్ తొలగించే అవకాశం ఉన్న ఫీచర్, భద్రత పరంగా ఇందులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ లాక్ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా అందించింది.

డ్యూయల్ టోన్ ఎటియోస్ లివా

సాంకేతికంగా ఇందులో స్టాండర్డ్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అందించింది. అందులో 1197సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ 79బిహెచ్‌పి పవర్ మరియు 104ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

డ్యూయల్ టోన్ ఎటియోస్ లివా

సరికొత్త డ్యూయల్ టోన్ ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌లో 1364సీసీ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. రెండు ఇంజన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

డ్యూయల్ టోన్ ఎటియోస్ లివా

ఎటియోస్ లివా డ్యూయల్ టోన్ వేరియంట్‌ను మూడు కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు.అవి, అల్ట్రామెరైన్ బ్లూ, వెర్మిలియన్ రెడ్ మరియు సూపర్ వైట్. లేటెస్ట్‌గా టయోటా విడుదల చేసిన లివా ఫేస్‌లిఫ్ట్ ఆధారంగా లివా డ్యూయల్ టోన్ ను అభివృద్ది చేసింది.

డ్యూయల్ టోన్ ఎటియోస్ లివా

ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా ఫేస్‌లిఫ్ట్ ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీని వీక్షించండి.

 
English summary
Toyota Etios Liva Dual Tone Launched In India
Story first published: Wednesday, February 8, 2017, 15:56 [IST]
Please Wait while comments are loading...

Latest Photos