ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో మోడల్‌ విడుదలకు సిద్దమైన టయోటా

టయోటా కిర్లోస్కర్ ఇండియా దేశీయ విపణిలోకి ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో అనే మరో మోడల్‌ను విడుదల చేయడానికి సిద్దమైంది.

By Anil

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా మోటార్స్ ఫార్చ్యూనర్ ప్రీమియమ్‌ ఎస్‌యూవీని ఓ కొత్త వేరియంట్లో విడుదల చేయడానికి సిద్దమైంది. అంతర్జాతీయ విపణిలో ఉన్న టిఆర్‌డి స్పోర్టివో ఫార్చ్యూనర్‌ను అతి త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

పల్లెల నుండి పట్టణాల వరకు టయోటా ఫార్చ్యూనర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో ఇన్నోవా క్రిస్టా తరువాత అత్యధికంగా విక్రయిస్తున్న మోడల్ ఫార్చ్యూనర్ అంటే, దేశవ్యాప్తంగా దీనికెంత డిమాండ్ ఉందో తెలిసిపోతుంది.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

ఈ విజయాన్ని ఇలాగే కొనసాగించడానికి టయోటా కిర్లోస్కర్ ఇండియా దేశీయ విపణిలోకి ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో అనే మరో మోడల్‌ను విడుదల చేయడానికి సిద్దమైంది.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

అయితే, టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టిల్ 2వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ మోడల్ రూ. 31.43 లక్షల ఎక్స్-షోరూమ్(ముంబాయ్) ధరతో విడుదల కానున్నట్లు మరియు అతి త్వరలో దీని డెలివరీలను కూడా స్టార్ట్ చేయనున్నట్లు ఓ వైబ్‌సైట్ తమ కథనంలో పేర్కొంది.

Recommended Video

Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

ఇండియాలో విడుదల కానున్న టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో మోడల్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో లభించే మోడల్‌ను పోలి ఉంటుంది. రెగ్యులర్‌గా మన చూసే వేరియంట్లో ఉన్న క్రోమ్ గ్రిల్ స్థానంలో బ్లాక్ అవుట్ ఫ్రంట్ గ్రిల్, బాడీ కిట్ మరియు సైడ్ స్కర్ట్స్ ఇందులో ఉన్నాయి.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో వేరియంట్ ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ ఇంటేకర్ మరియు ఫ్రంట్ బంపర్‌ను అనుసంధానం చేస్తూ కలదు. ఇదే అమరికలో ఫాగ్ ల్యాంప్ క్లస్టర్ మరియు రెడ్ కలర్‌లో ఉన్న టిఆర్‌డి(TRD) లోగోను ఇక్కడ గమనించవచ్చు.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో ఇంటీరియర్ మొత్తం నలుపు రంగును పులుముకుంది. దీనికి తోడు అతి ముఖ్యమైన ఇంటీరియర్ ఫీచర్లను జోడించింది. స్పోర్టివ్ ఫీల్ కలిగించే ఉద్దేశ్యంతోనే ఎస్‌యూవీలో మార్పులు చేర్పులు జరిగాయి. అయితే, సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగలేదు.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో ఎస్‌యూవీలో సాంకేతికంగా 2.8-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో లభించే ఇది గరిష్టంగా 174బిహెచ్‌పి పవర్ మరియు 420ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో మోడల్ విడుదల గురించి ఆధారం లేని వార్తలు ఎన్నో వచ్చాయి. అయితే టయోటా మోటార్స్ దీని విడుదల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మోడల్ మార్కెట్లోకి వస్తే, ఇప్పటికే ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న ఫోర్డ్ ఎండీవర్, జీప్ కంపాస్, మిత్సుబిషి పజేరో స్పోర్ట్ మరియు ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ వంటి SUVల నోర్లు మూయించడం ఖాయం.

Most Read Articles

English summary
Read In Telugu: Toyota is all set to launch the Fortuner TRD Sportivo in the Indian market
Story first published: Friday, September 15, 2017, 16:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X