ఇన్నోవా క్రిస్టాలో హైబ్రిడ్ వెర్షన్

Written By:

టయోటా తమ ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని విడుదల చేసిన తరువాత, స్పోర్టివ్ ఫీల్ కలిగించేందుకు ఇన్నోవా క్రిస్టాను టూరింగ్ స్పోర్ట్ అనే స్పెషల్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ఇప్పుడు ఇన్నోవా క్రిస్టా మరియు టూరింగ్ ఎడిషన్ వేరియంట్ల మైలేజ్ పెంచేందుకు హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉంది.

ఇన్నోవా క్రిస్టాలో హైబ్రిడ్ వెర్షన్

చిన్న కార్లు మాత్రమే అధిక మైలేజ్ ఇస్తాయి, పెద్ద కార్లు ఆశించిన మైలేజ్ ఇవ్వలేవనే వాస్తవం అందరికీ తెసిందే. ఏడు మంది కూర్చునే సామర్థ్యం అత్యుత్తమ సేఫ్టీ మరియు అధునాతన ఇంటీరియర్ ఫీచర్లు ఇలా అన్నింటి పరంగా ఇన్నోవా క్రిస్టా ఇండియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఇన్నోవా క్రిస్టాలో హైబ్రిడ్ వెర్షన్

అయితే మైలేజ్ విషయంలో నిరాశపరించింది. కానీ ఇది టయోటా తప్పు కాదు పెద్ద వాహనంలో పెద్ద ఇంజన్ ఉండాలి, కాబట్టి పెద్ద ఇంజన్‌లు మైలేజ్ ఇవ్వలేవు. మరి మైలేజ్ పెంచాలి అంటే ఎలా...? ఇందుకు పరిష్కారమే హైబ్రిడ్ వెర్షన్.

ఇన్నోవా క్రిస్టాలో హైబ్రిడ్ వెర్షన్

తాజాగా అందుతున్న సమాచారం మేరకు, టయోటా మోటార్స్ తమ ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్ వేరియంట్లో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని అందించి సెప్టెంబర్ 2017లో విపణిలోకి విడుదల చేయనున్నట్లు తెలిసింది. హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని జోడించడంతో పాటు మరికొన్ని మార్పులతో ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ రానుంది.

ఇన్నోవా క్రిస్టాలో హైబ్రిడ్ వెర్షన్

ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ జడ్ ఆటోమేటిక్ వేరియంట్లో ఉన్న హ్యాలోజియన్ ల్యాంప్స్‌ను ఎల్ఇడి ఫ్యాగ్ ల్యాంప్స్ స్థానంలో అమర్చనున్నారు. మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న ఇన్నోవా క్రిస్టా వేరియంట్లలో ఐడిల్ స్టార్ట్ మరియు స్టాప్(మైల్డ్ హైబ్రిడ్) టెక్నాలజీని అందిస్తోంది.

ఇన్నోవా క్రిస్టాలో హైబ్రిడ్ వెర్షన్

ప్రస్తుతం విఎక్స్ వేరియంట్లో లభించే ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్ లోని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ స్థానంలోకి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందివ్వనుంది. అదనంగా మైల్డ్ హైబ్రిడ్ పరిజ్ఞానంతో రానున్న ఈ వేరియంట్లో వెహికల్ స్టెబిలిటి కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్టెన్స్ కంట్రోల్ మరియు ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వంటి ఫీచర్లు రానున్నాయి.

ఇన్నోవా క్రిస్టాలో హైబ్రిడ్ వెర్షన్

ప్రస్తుతం విపణిలో ఉన్న జీప్ కంపాస్, హ్యుందాయ్ టుసాన్ మరియు టాటా హెక్సా లతో ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని సరికొత్త ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్‌లో మరిన్ని అధునాతన ఫీచర్లను జోడించనుంది. ఈ వివరాలను సెప్టెంబర్ 2017లో టయోటా వెల్లడించనున్నట్లు సమాచారం.

ఇన్నోవా క్రిస్టాలో హైబ్రిడ్ వెర్షన్

హైబ్రిడ్ టెక్నాలజీ అంటే ఏమిటి ?

హైబ్రిడ్ కార్లలో పెట్రోల్ లేదా డీజల్ ఇంజన్‌లతో పాటు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇలాంటి కార్లు అవసరాన్ని బట్టి పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్ ఆధారంగానే నడుస్తున్నాయి. మరికొన్ని సార్లు కేవలం ఇంజన్ మీద మాత్రమే నడుస్తాయి. కారు వేగాన్ని బట్టి ఎలక్ట్రిక్ మోటార్ లేదా ఇంజన్ పనిచేస్తూ ఉంటాయి.

ఇన్నోవా క్రిస్టాలో హైబ్రిడ్ వెర్షన్

మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ అంటే ఏమిటి ?

మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ అనగా కార్లు పూర్తిగా ఎలక్ట్రిక్ ఇంజన్ ఆధారంతో నడవలేవు. ఇంజన్ పనిచేస్తున్నపుడు అదనపు పవర్ అందించడానికి ఎలక్ట్రిక్ మోటార్లు సహాయపడతాయి. అంటే తక్కువ ఇంధన వినియోగించకుని కారుకు కావాల్సిన పవర్‌ను ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో చక్రాలకు అందిస్తాయి. తద్వారా ఇంధన ఆదా జరుగుతుంది. మరియు కారును ఐడిల్‌గా ఉంచినపుడు ఆటోమేటిక్‌గా ఆఫ్ మరియు ఆన్ అవుతుంది తద్వారా మైలేజ్ పెరుగుతుంది. దీనినే మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ అంటారు.

ఇన్నోవా క్రిస్టాలో హైబ్రిడ్ వెర్షన్

సాధారణ డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్‌లతో పోల్చితే మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ సిస్టమ్ మంచి మైలేజ్ ఇస్తుంది. అయితే మైల్డ్ హైబ్రిడ్ కంటే ప్యూర్ హైబ్రిడ్ వ్యవస్థలు అధిక మైలేజ్ ఇవ్వగలవు. మొత్తానికి ఇన్నోవా క్రిస్టా మైలేజ్ పెరిగే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Toyota Innova Touring Sport Mild Hybrid To Be Launched In India
Story first published: Thursday, August 24, 2017, 12:28 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark