విన్నూత్నమైన వియోస్ ను విడుదలకు సిద్దం చేసిన టయోటా: పూర్తి వివరాల కోసం....

Written By:

టయోటా మోటార్స్ తమ విన్నూత్నమైన కాంపాక్ట్ సెడాన్ వియోస్ విడుదలకు దాదాపు లైన్ క్లియర్ చేసింది. ముందుగా 2018 ఫిబ్రవరిలో జరగనున్న ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించి అనంతరం 2018 మలిసగంలో మార్కెట్లోకి అమ్మకాలకు సిద్దం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

టయోటా వియోస్ సెడాన్

ఆటోకార్ ఇండియా తెలిపిన వివరాలు మేరకు టయోటా కిర్లోస్కర్ మోటార్ సంస్థ తొలుత 2018 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగే ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించి, తరువాత అదే ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి విడుదల మరియు ధర వివరాలను వెల్లడించనుందని పేర్కొంది.

టయోటా వియోస్ సెడాన్

టయోటా మోటార్స్ వియోస్ ను రహస్యంగా రహదారి పరీక్షలకు గురిచేసింది. ఫేస్‌లిఫ్ట్ రూపంలో థాయిలాండ్‌తో పాటు మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లలో కూడా దీనిని విడుదల చేసింది.

టయోటా వియోస్ సెడాన్

టయోటా వియోస్ ఫ్రంట్ డిజైన్‌లో కండలు తిరిగిన వి-ఆకారంలో గల ఫ్రంట్ గ్రిల్ కలదు. కనురెప్పల తరహాలో ఉన్న ఎల్ఇడి పార్కింగ్ లైట్లు, నిలువుటాకారంలో ఉన్న పగటి పూట వెలిగే లైట్లను బంపర్‌కు ఇరువైపులా అందివ్వడం జరిగింది.

టయోటా వియోస్ సెడాన్

రియర్ డిజైన్ విషయానికి వస్తే, చిన్న పరిమాణంలో పలుచగా ఉన్న టెయిల్ లైట్లు, బూట్ లిడ్ మీద క్రోమ్ స్ట్రిప్ కలదు. మొత్తం మీద పదునైన డిజైన్ లక్షణాలతో దీనిని అభివృద్ది చేశారు. ప్రస్తుతం సెడాన్ సెగ్మెంట్లో ఉన్న పోటీదారులకు ఇది గట్టిపోటీనివ్వనుంది.

టయోటా వియోస్ సెడాన్

వియోస్ ఇంటీరియర్‌లో స్పోర్టివ్ తాకే తెర పరిమాణం గల ఇన్ఫోనై‌మెంట్ సిస్టమ్, కనెక్టివిటి ఆప్షన్స్, ప్రీమియమ్ డ్యాష్ బోర్డ్ కలదు. ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి వియోస్ వేరియంట్లో మరిన్ని అదనపు ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది.

టయోటా వియోస్ సెడాన్

భద్రత పరంగా ఇందులో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్, ట్రాక్షన్ కంట్రోల్, పిల్లల సీటు కోసం ఐఎస్ఒ ఫిక్స్ మౌంటింగ్స్ కలవు. మరియు టాప్ ఎండ్ వేరియంట్లో బ్రేక్ అసిస్ట్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్ రానున్నాయి.

టయోటా వియోస్ సెడాన్

సాంకేతికంగా థాయిలాండ్ వియోస్ వేరియంట్లో 1.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 106బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

టయోటా వియోస్ సెడాన్

వియోస్ పెట్రోల్ వేరియంట్లో 7-స్పీడ్ సూపర్ సివిటి(ఆటోమేటిక్) ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో కలదు, మరియు అంతర్జాతీయ విపణిలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో రానుంది.

టయోటా వియోస్ సెడాన్

టయోటా మోటార్స్ అంతర్జాతీయ విపణిలో డీజల్ వేరియంట్ అందివ్వడం లేదు. అయితే ప్రస్తుతం ఎటియోస్ మరియు కరోలా కార్లలో ఉన్న 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌తో ఇండియన్ మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది.

టయోటా వియోస్ సెడాన్

టయోటా వియోస్ సెడాన్‌ను విపణిలోకి విడుదల చేస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా సిటి, మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, స్కోడా ర్యాపిడ్ మరియు వోక్స్‌వ్యాగన్ వంటి వాటితో గట్టి పోటీనివ్వనుంది.

 
English summary
Toyota Vios India Launch Details Revealed
Story first published: Wednesday, March 15, 2017, 19:06 [IST]
Please Wait while comments are loading...

Latest Photos