యారిస్ ఏటివ్ సెడాన్ కారును ఆవిష్కరించిన టయోటా మోటార్స్

Written By:

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా మోటార్స్ సరికొత్త యారిస్ ఏటివ్ సెడాన్ కారును ఆవిష్కరించింది. తొలుత ఈ సెడాన్ కారు థాయిలాండ్ మార్కెట్లో విక్రయాలకు సిద్దం కానుంది.

టయోటా యారిస్ ఏటివ్ సెడాన్

టయోటా వారి ప్రీమియమ్ సెడాన్ వియోస్ నుండి సేకరించిన అనేక విడి భాగాలతో యారిస్ ఏటివ్ సెడాన్ రూపొందించబడింది. అయినప్పటికీ, టయోటా వారి నూతన సెడాన్ డిజైన్ ఫిలాసఫీకి అనుగుణంగా అధునాతన ఎక్ట్సీరియర్ డిజైన్ కలిగి ఉంది.

Recommended Video - Watch Now!
2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
టయోటా యారిస్ ఏటివ్ సెడాన్

టయోటా యారిస్ ఏటివ్ ఫ్రంట్ డిజైన్‌లో విశాలమైన ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి హెడ్ లైట్లు మరియు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. హెడ్ లైట్ మరియు ఫ్రంట్ గ్రిల్ టయోటా కరోలా ఆల్టిస్ కారును పోలి ఉన్నాయి.

టయోటా యారిస్ ఏటివ్ సెడాన్

యారిస్ ఏటివ్ సెడాన్ సైడ్ ప్రొఫైల్‌లో ఫ్రంట్ డోర్ నుండి ప్రారంభమయ్యి, రియర్ డోర్ హ్యాండిల్ వద్ద ముగిసే ఆకర్షణీయమైన క్యారెక్టర్ లైన్స్ మరియు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. యారిస్ ఏటివ్ సెడాన్ రియర్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న ఎల్ఇడి ఎలిమెంట్లు మరియు కర్వీ టెయిల్ లైట్లు ఉన్నాయి.

టయోటా యారిస్ ఏటివ్ సెడాన్

టయోటా యారిస్ ఏటివ్ ఇంటీరియర్‌లో 7-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4.2-ఇంచ్ ఎమ్‍‌ఐడి ఓప్టిట్రాన్ ఇంస్ట్రుమెంట్ ప్యానల్, లెథర్ తొడుగులు గల స్టీరింగ్ వీల్ మరియు గేర్ నాబ్, ఆరు స్పీకర్లు గల మ్యూజిక్ సిస్టమ్ కలదు.

టయోటా యారిస్ ఏటివ్ సెడాన్

సాంకేతికంగా టయోటా యారిస్ సెడాన్‌లో 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. సివిటి-ఐ(ఆటోమేటిక్) గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 86బిహెచ్‌పి పవర్ మరియు 108ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టయోటా యారిస్ ఏటివ్ సెడాన్

భద్రత పరంగా టయోటా యారిస్ ఏటివ్ సెడాన్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటి కంట్రోల్ మరియు హిల్ స్టార్ అసిస్ట్ వంటి అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లున్నాయి.

టయోటా యారిస్ ఏటివ్ సెడాన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా లైనప్‌లో ఉన్న వియోస్‌కు క్రింది స్థానంలో యారిస్ ఏటివ్ సెడాన్ ప్రవేశపెట్టడం జరిగింది. అభివృద్ది చెందుతున్న మార్కెట్లను ఉద్దేశించి టయోటా దీనిని అభివృద్ది చేసింది. యారిస్ ఏటివ్ దేశీయ విపణిలోకి విడుదలైతే హోండా సిటి, మారుతి సుజుకి సియాజ్, నిస్సాన్ సన్నీ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి సెడాన్ కార్లకు గట్టి పోటీనివ్వగలదు.

English summary
Read In Telugu; Toyota Reveals Yaris Ativ Sedan
Story first published: Friday, August 18, 2017, 13:06 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark