2017 లో మారుతి విడుదల చేయనున్న కార్లు

మారుతి సుజుకి 2017 లో ఇండియన్ మార్కెట్లోకి భారీ సంఖ్యలో కార్లను విడుదల చేయనుంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో....

By Anil

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నూతన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి భారతీయున్ని కూడా ఆకట్టుకునే ఉత్పత్తులను విడుదల చేయడంలో మారుతి సుజుకిది ఎప్పటికీ ప్రత్యేక స్థానమే. ప్రతి ఏడాదిని కూడా తనకు తగ్గట్టుగా మలుచుకోవడంలో మారుతి సుజుకి ఎప్పుడూ ముందే ఉంటుంది.

అందుకు ఉదాహరణ 2016 ఏడాది, ఈ ఏడాదిలో తమ భవిష్యత్ ఉత్పత్తులను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. తరువాత మార్కెట్లోని రెండు విభిన్నమైన మరియు నూతన సెగ్మెంట్లయిన ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి బాలెనో మరియు కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లోకి వితారా బ్రిజా లను విడుదల చేసి మంచి విజయాన్ని అందుకుంది.

మారుతి సుజుకి కొత్త కార్లు

ప్రస్తుతం ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్ దాదాపుగా మారుతి ఆధీనంలో ఉంది. ఇందుకోసం మారుతి వచ్చే ఏడాది భారీ ఉత్పత్తులను విడుదల చేయనుంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో...

మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి సుజుకి ఈ ఇగ్నిస్ క్రాసోవర్ ను మొదటి సారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. సెలెరియో మరియు వ్యాగన్‌ఆర్‌లకు పైన మరియు స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ కారుకు క్రింద స్థానంలో మహీంద్రా వారి కెయువి100 కు పోటీగా విడుదల చేయనుంది.

ఇగ్నిస్ ఇంజన్ మరియు ఇతర వివరాలు

ఇగ్నిస్ ఇంజన్ మరియు ఇతర వివరాలు

మారుతి ఈ ఇగ్నిస్‌లో 1.3 లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌ను అందివ్వనుంది. ఇది సుమారుగా 74 బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును అదే విధంగా ఇది సుమారుగా 84 బిహెచ్‌పి పవర్‌ మరియు 115ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే 1.2 లీటర్ సామర్థ్యం ఉన్న కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది.

ఇగ్నిస్ ట్రాన్స్‌మిషన్ మరియు ధర వివరాలు

ఇగ్నిస్ ట్రాన్స్‌మిషన్ మరియు ధర వివరాలు

మారుతి సుజుకి ఈ ఇగ్నిస్‌లోని ఇంజన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లను అనుసంధానం చేస్తోంది.

ధర అంచనా: 4 నుండి 6 లక్షలు

విడుదల అంచనా: జనవరి 2017.

మారుతి సుజుకి బాలెనొ ఆర్‌ఎస్

మారుతి సుజుకి బాలెనొ ఆర్‌ఎస్

మారుతి సుజుకి 2015 డిసెంబర్ లో ఇండియన్ మార్కెట్లోకి తమ బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. మారుతి వారి నెక్సా ప్రీమియమ్ షోరూమ్ ద్వారా ఎస్-క్రాస్ తో జతగా అమ్మకాల్లో ఉంది.

మారుతి సుజుకి కొత్త కార్లు

ప్రస్తుతం మారుతి వారి బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎంతో విజయవంతంగా విక్రయాలు సాగిస్తోంది. హ్యుందాయ్ ఎలైట్ ఐ20 అమ్మకాలను ప్రత్యక్షంగా కొల్లగొడుతోంది ఈ బాలెనొ. పోటీదారులను మించి అద్భుతమైన అమ్మకాలు సాధిస్తున్న ఈ బాలెనొను మారుతి ఆర్‌ఎస్ బ్యాడ్జి పేరుతో సరికొత్తగా అందివ్వనుంది.

బాలెనొ ఆర్ఎస్ ఇంజన్ మరియు ఇతర వివరాలు

బాలెనొ ఆర్ఎస్ ఇంజన్ మరియు ఇతర వివరాలు

బాలెనొ ఆర్ఎస్ డిజైన్ పరంగా బాలెనొని పోలి ఉన్నప్పటికీ ఇందులో 1.0 లీటర్ బూస్టర్ జెట్ ఇంజన్‌ను అందివ్వనున్నట్లు సమాచారం. అయితే బాలెనొ ఆర్ఎస్ పేరులో ఉన్న ఆర్ఎస్ అనగా ర్యాలీ స్పోర్ట్ అనే అర్థం ఉన్నట్లు తెలిసింది.

ధర అంచనా: 5.5 నుండి 8.5 లక్షలు.

విడుదల అంచనా: 2017 ప్రారంభం నాటికి.

మారుతి వితారా బ్రిజా (పెట్రోల్)

మారుతి వితారా బ్రిజా (పెట్రోల్)

మారుతి సుజుకి తమ లైనప్‌లోకి వితారా బ్రిజాను విడుదల చేశాక ఇండియన్ ఎస్‌యువి సెగ్మెంట్లో పెను మార్పులు సంభవించాయి. దీనికి పోటీగా ఉన్న ఉత్పత్తులకు జాడ కరువయ్యే విధంగా విక్రయాలు సాధించింది. విడుదల సమయం నుండి సుమారుగా 83,000 లకు పైగా వితారా బ్రిజాలు అమ్ముడయ్యాయి.

మారుతి సుజుకి కొత్త కార్లు

మారుతి సుజుకి కాస్త ఆలస్యంగా ఎస్‌యువిల సెగ్మెంట్లోకి అడుగుపెట్టినప్పటికీ మంచి ముద్ర వేసుకుంది. మారుతి ఎటువంటి ఉత్పత్తి చేసినా అది పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో లభ్యమయ్యేది అలాంటిది వితారా బ్రిజా కేవలం డీజల్ వేరియంట్లో మాత్రమే విడుదలయ్యింది. అయితే మారుతి ఇప్పుడు వితారా బ్రిజా ను పెట్రోల్ వేరియంట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

వితారా బ్రిజా (పెట్రోల్) ఇంజన్ మరియు ఇతర వివరాలు

వితారా బ్రిజా (పెట్రోల్) ఇంజన్ మరియు ఇతర వివరాలు

వితారా బ్రిజా పెట్రోల్ మోడల్ 1.0 లీటర్ బూస్జర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి దానినే బాలెనొలో కూడా అందివ్వనుంది. దీనితో పాటు ఈ వితారా బ్రిజాలో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందివ్వనున్నారు.

ధర అంచనా: 7 నుండి 10 లక్షలు.

విడుదల అంచనా: 2017 మధ్య భాగానికి.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లోకి మారుతి సుజుకి మొదటి స్థానంలో నిలిచింది. మారుతి ఈ ఖ్యాతిని గడించడంలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పుడు దీనికి అప్‌డేట్స్ నిర్వహించి నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్‌గా 2017 నాటికి మార్కెట్లోకి మళ్లీ విడుదల చేయనుంది. ఇది దాదాపు స్పోర్టివ్ లుక్‌ను సొంతం చేసుకుంది.

మారుతి సుజుకి కొత్త కార్లు

మారుతి ఇప్పటికే స్విఫ్ట్ ‌ను రెండు సార్లు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో అందించింది. ఇక ఇప్పుడు మరోసారి ఫేస్‌లిఫ్ట్ రూపంలో రానున్న సరికొత్త స్విఫ్ట్‌లో నూతన హెడ్ లైట్లు, సరికొత్త ఫ్రంట్ గ్రిల్, వాలు నిర్మాణం అధికంగా ఉన్న రూఫ్ డిజైన్ ఇక ఇంటీరియర్ ఫీచర్ల పరంగా చూస్తే తాకే తెర గల ఇన్పోటైన్‌మెంట్ వ్యవస్థ, మూడు స్పోక్స్ గల స్టీరింగ్ వీల్ మరియు కొన్ని భద్రత ఫీచర్లతో రానుంది.

స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ గురించి మరిన్ని వివరాలు

స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ గురించి మరిన్ని వివరాలు

2017 నాటికి దేశీయంగా విడుదలయ్యే స్విఫ్ట్ లో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్, 1.3-లీటర్ సామర్థ్యం గల డిడిఐఎస్ డీజల్ ఇంజన్‌లతో పరిచయం కానుంది. ఈ రెండు వేరియంట్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది.

ధర అంచనా: 5 నుండి 8 లక్షలు

విడుదల అంచనా: 2017 మలి సగంలో

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్ ఇప్పుడు నెక్ట్స్ జనరేషన్‌గా విడుదలవ్వడానికి సిద్దమవుతోంది. సరికొత్త స్విఫ్ట్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఈ నూతన డిజైర్ రూపుదిద్దుకోనుంది. మారుతి ఇప్పటికే దీనిని పలుమార్లు దేశీయంగా రహస్యంగా పరీక్షించింది.

మారుతి సుజుకి కొత్త కార్లు

ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ డిజైర్‌తో పోల్చుకుంటే 2017 మోడల్ కాంపాక్ట్ సెడాన్ మరింత అగ్రెసివ్‌గా పదునైన డిజైన్ భాషలో ఆకట్టుకోనుంది. 2017 లో విడుదలకు సిద్దమైన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ నుండి కొన్ని డిజైనింగ్ లక్షణాలను పొందనుంది. ఫీచర్ల పరంగా ఇందులో అధునాతన ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటీరియర్‌కు ఫ్యాబ్రిక్ హంగులను దిద్దడమైనది.

మారుతి సుజుకి కొత్త కార్లు

సాంకేతికంగా మారుతి ఈ నెక్ట్స్ జనరేషన్ 2017 స్విఫ్ట్ డిజైర్‌లో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌లకో రానుంది. అంతే కాకుండా ఇందులో హైబ్రిడ్ టెక్నాలజీని కూడా అందిస్తోందని ఊహాగానాలున్నాయి.

ధర అంచనా: 6 నుండి 8.5 లక్షలు

విడుదల అంచనా: అక్టోబర్ నుండి నవంబర్ 2017 మధ్య.

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

2016 లో మారుతి సుజుకి వారి అత్యుత్తమ సెడాన్ సియాజ్. దేశీయంగా ఉన్న వెర్నా మరియు హోండా సిటి లకు గట్టి పోటీనివ్వగలిగింది. మారుతి సియాజ్ సెడాన్‌లో 2014 విపణిలోకి పరిచయం చేసింది. అత్యుత్తమ విక్రయాలు సాధిస్తోన్న దీనిని ఫేస్‌లిఫ్ట్ రూపంలో 2017 ఏడాదిలో నెక్సా షోరూమ్ ద్వారా విడుదల చేయనుంది.

మారుతి సుజుకి కొత్త కార్లు

ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకు సిద్దమవుతున్న సియాజ్ లో జరిగే మార్పుల గురించి స్పష్టమైన సమాచారం లేదు. కాకపోతే ఇంటీరియర్ పరంగా స్వల్ప మర్పులకు నోచుకోనుంది. సాంకేతికంగా డీజల్ వేరియంట్లో మాత్రమే హైబ్రిడ్ టెక్నాలజీ ఉండేది. ఇప్పుడు పెట్రోల్ వేరియంట్లో కూడా మారుతి ఎస్‌హెచ్‌విఎస్ హైబ్రిడ్ టెక్నాలజీని పరిచయం చేయనుంది.

మారుతి సుజుకి కొత్త కార్లు

ప్రస్తుతం ఉన్న సియాజ్ సెడాన్‌లో 1.4-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 91బిహెచ్‌పి పవర్ మరియు 130ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. మరియు హైబ్రిడ్ టెక్నాలజీ అనుసంధానం గల 1.3-లీటర్ ఇంజన్ గరిష్టంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును

సియాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల సమయానికి ధర అంచనా: రూ. 8 నుండి 12.5 లక్షల మధ్య

విడుదల అంచనా: ఏప్రిల్ నుండి మే 2017 మధ్య.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి విపణిలోకి మరో ఫేస్‌లిప్ట్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం నెక్సా ద్వారా అమ్మకాలు సాగిస్తున్న ఎస్-క్రాస్ ప్రీయమ్ క్రాసోవర్ ను ఈ ఏడాది ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి సిద్దమవుతోంది. మారుతి ఈ ఫేస్‌లిఫ్ట్ ఎస్-క్రాస్ క్రాసోవర్ ను మొదటి సారిగా 2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించింది.

మారుతి సుజుకి కొత్త కార్లు

ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ముందు వైపు డిజైన్ అత్యంత అగ్రెసివ్‍‌గా ఉంది. పొడవాటి స్లాట్లున్న క్రోమ్ గ్రిల్ దీనికి అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. ఫ్రంట్ హెడ్ లైట్లు స్వెప్ట్ బ్యాక్ మరియు ఎల్ఇడి లైట్లను కలిగి ఉంది. రీ డిజైన్ చేయబడిన వాటిలో పెద్దగా ఉన్న ఎయిర్ ఇంటేకర్, ఫాగ్ ల్యాంప్స్ కలవు. ఇంటీరియర్ అనేక నూతన ఫీచర్లతో మార్పులుకు శ్రీకారం చుట్టింది.

మారుతి సుజుకి కొత్త కార్లు

మారుతి సుజుకి ఈ ఫేస్‌లిఫ్ట్ ఎస్-క్రాస్ లో 109బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ అదే విధంగా 138బిహెచ్‌పి పవర్ మరియు 220ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.4-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. అంతే కాకుండా ప్రస్తుతం ఎస్-క్రాస్‌లో ఉన్న ఇంజన్ వేరియంట్లు కూడా ఇందులో రానున్నాయి.

ధర అంచనా: రూ. 9 నుండి 13 లక్షల మధ్య

విడుదల అంచనా: 2017 చివరి నాటికి

మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ఎమ్‌పివి

మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ఎమ్‌పివి

మారుతి సుజుకి ఈ వ్యాగన్ ఆర్ ఎమ్‌పివిని ఎర్టిగా ఎమ్‌పివి కన్నా తక్కువ స్థానంలో విడుదల చేయనుంది. దీని ధర విషయానికి వస్తే చాలా ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. పోటిదారులను బోల్తా కొట్టించే రీతిలో దీని ధరలను నిర్ణయించనుంది మారుతి.

వ్యాగన్ఆర్ ఎమ్‌పివి ఇంజన్ మరియు ఇతర వివరాలు

వ్యాగన్ఆర్ ఎమ్‌పివి ఇంజన్ మరియు ఇతర వివరాలు

మారుతి ఈ వ్యాగన్‌ఆర్ ఎమ్‌పివిలో 1.0 లీటర్ పెట్రోల్ (వ్యాగన్ఆర్ లో ఉన్నది) మరియు 793 సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ను అందివ్వనుంది. ఇలాంటి దానినే సెలెరియోలో గుర్తించవచ్చు.

ధర అంచనా: 4.5 నుండి 6 లక్షలు.

మారుతి సుజుకి ఆల్టో 800 డీజల్

మారుతి సుజుకి ఆల్టో 800 డీజల్

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి ఆల్టో 800 ను విడుదల చేసినప్పటి నుండి రికార్డు స్థాయి అమ్మకాలను సాధిస్తూనే ఉంది. అయితే రెనో వారి తాజా ఉత్పత్తి క్విడ్ వలన కొంచెం తడబడినా కూడా నెంబర్ వన్ స్థానాన్ని మాత్రం కోల్పోలేదు. అయితే ఆల్టో 800 ప్రేమికుల కోసం ఇప్పుడు దీనిని డీజల్ ఇంజన్‌లో విడుదల చేయనుంది.

ఆల్టో 800 డీజల్ యొక్క ఇతర వివరాలు

ఆల్టో 800 డీజల్ యొక్క ఇతర వివరాలు

ఆల్టో 800 డీజల్ వేరియంట్ కోసం ఇందులో 793 సీసీ సామర్థ్యం ఉన్న సెలెరియోలోని డీజల్ ఇంజన్‌ను వినియోగించనున్నారు. ఇది సుమారుగా 47 బిహెచ్‌పి పవర్ మరియు 125 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర అంచనా: 4 నుండి 5 లక్షలు

Most Read Articles

English summary
Upcoming Maruti Suzuki Cars In 2017 — Here Is The Impressive List!
Story first published: Monday, January 2, 2017, 15:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X