రెనో నుండి వస్తున్న మూడు కొత్త కార్లు

Written By:

రెనో ఇండియా లైనప్‌లో ప్రస్తుతం ఎన్ని కార్లున్నాయో తెలుసా....? డస్టర్, లాజీ మరియు క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఉన్నాయి. ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం రెనో ఇప్పుడు సరికొత్త క్యాప్చర్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న మూడు కార్ల సంఖ్య నాలుగుకు చేరనుంది.

రెనో ఇండియా డైరక్టర్ సుమిత్ సాహ్నే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో విడుదలకు సిద్దం చేసిన వాటితో పాటు, భవిష్యత్తులో ప్రతి ఏడాది మరిన్ని కొత్త కార్లను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నాడు.

రెనో ఇండియాలోకి విడుదల చేయనున్న కార్లు, వాటి పూర్తి వివరాలతో పాటు అంచనాగా వాటి విడుదల మరియు ధర వివరాలు తెలుసుకుందాం రండి...

రెనో కొత్త కార్లు

రెనో క్యాప్చర్

రెనో క్యాప్చర్ ప్రీమియమ్ ఎస్‌యూవీని క్రాసోవర్ డిజైన్ లక్షణాలతో రూపొందించింది. విపణిలో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు హ్యుందాయ్ క్రెటా లకు గట్టి పోటీనిస్తు మార్కెట్లోకి రానుంది. డిజైన్ పరంగా అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా డస్టర్‌ను అభివృద్ది చేసిన ఫ్లా‌ట్‌ఫామ్ మీద దీనిని నిర్మించింది. ప్రస్తుతం చెన్నై ఆర్&డి కేంద్రంలో తుది దశ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
రెనో కొత్త కార్లు

క్రాసోవర్ ఎస్‌యూవీ రెనో క్యాప్చర్‌లో ఇంటీరియర్‌లో ప్రీమియమ్ ఫీచర్లు వస్తున్నాయి. స్మార్ట్ యాక్సెస్ కార్ మరియు ఇంజన్ స్టార్ట్ బటన్, 7-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇందులో రేడియో, బ్లూటూత్ టెక్నాలజీ, వాయిస్ గుర్తించే పరిజ్ఞానం, మ్యాప్స్, ఉష్ణోగ్రత మరియు సమయాన్ని డిస్ల్పే చూడవచ్చు.

రెనో కొత్త కార్లు

భద్రత పరంగా రెనో ఇండియా క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్ వంటి ఎన్నో భద్రత ఫీచర్లు ఉన్నాయి.

  • విడుదల అంచనా: అక్టోబరు 2017
  • ధర అంచనా: రూ. 10 నుండి రూ. 15 లక్షల మధ్య
రెనో కొత్త కార్లు

రెనో ఆర్‌బిసి ఎమ్‌పీవీ

రెనో ఇండియా క్యాప్చర్ ఎస్‌యూవీ తరువాత విడుదలకు సిద్దం చేసిన వెహికల్ 7-సీటర్ ఎమ్‌పీవీ. రెనో దీనిని ఆర్‌బివి కోడ్ పేరుతో అభివృద్ది చేస్తోంది. ఇది ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న మారుతి వారి సక్సెస్‌ఫుల్ ఎమ్‌‌పీవీ ఎర్టిగా వాహనానికి గట్టి పోటీనివ్వనుంది.

రెనో కొత్త కార్లు

చూడటానికి ఎమ్‌పీవీ రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, క్రాసోవర్ మరియు ఎస్‌యూవీ డిజైన్ లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్, కండలు తిరిగిన స్టైలింగ్ దీని సొంతం. తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ యొక్క లో-కాస్ట్ ఫ్లాట్‌ఫామ్ సిఎమ్‌ఎఫ్-ఎ మీద నిర్మిస్తోంది. పోటీతత్వమైన ధరల శ్రేణిలో రానున్న ఇది మార్కెట్లో డస్టర్ క్రింది స్థానాన్ని భర్తీ చేయనుంది.

  • విడుదల అంచనా: 2018లో
  • ధర అంచనా: రూ. 8 లక్షల నుండి రూ. 11 లక్షల మధ్య
రెనో కొత్త కార్లు

రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్

రెనో యూరోపియన్ బ్రాండ్ డాసియా ఈ మధ్యనే సరికొత్త డస్టర్‌ను ఆవిష్కరించింది. చూడటానికి సరికొత్త డస్టర్ అచ్చం ప్రస్తుతం ఉన్న మోడల్‌నే పోలి ఉన్నప్పటికీ, ఫ్రంట్ డిజైన్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అంతే కాకుండా విశాలమైన ఇంటీరియర్‌తో అధిక క్యాబిన్ స్పేస్ కూడా ఇందులో సాధ్యమైంది. సరికొత్త రెనో ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించనుంది.

రెనో కొత్త కార్లు

డిజైన్‌తో పాటు, ఎన్నో కొత్త ఇంటీరియర్ ఫీచర్లు కూడా ఇందులో రానున్నాయి. సౌకర్యం మరియు విలాసానికి పెద్ద పీట వేసే ఫీచర్లకు రెనో ప్రాధాన్యతనిస్తోంది. 7-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో రానుంది.

  • విడుదల అంచనా: 2019లో
  • ధర అంచనా: రూ. 9 లక్షల నుండి 13 లక్షల మధ్య
రెనో కొత్త కార్లు

రెనో ఇండియాలో విడుదలకు సిద్దం చేసిన ఈ మూడు వాహనాలు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ వేరియంట్లతో రానున్నాయి. అన్నింటిని కూడా తక్కువ ధరతో నిర్మించడానికి తమ లో-కాస్ట్ సిఎమ్‌ఎఫ్-ఎ ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమలో ఉన్న మొత్తం మార్కెట్ వాటాలో 5 శాతాన్ని సొంతం చేసుకోవడానికి రెనో ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాది ఒక కొత్త మోడల్ విడుదలకు సన్నద్దమవుతోంది.

English summary
Read In Telugu: Upcoming Renault Cars In India; Expected Launch Date & Price
Story first published: Friday, September 29, 2017, 10:59 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark