భారత్‌లో రీకాల్ అవుతున్న కార్లు మరియు బైకుల డేటా ఇలా తెలుసుకోండి

Written By:

కార్లు లేదా బైకులు రీకాల్‌కు గురవ్వడం ఇండియన్ కస్టమర్లకు పెద్దగా నచ్చదు. తరచూ రీకాల్‌ అయ్యే వెహికల్స్ కొనడానికి కూడా చాలా మంది వెనుకడతారు. అయితే, రికాల్‌కు గురికాని కార్లు మరియు బైకులు ఏవి...? మనం ఎంచుకోవాలనుకున్న కారు లేదా బైకు రీకాల్ జాబితాలో ఉందా... లేదా...? వంటివి తెలుసుకోవడం చాలా కష్టమయ్యేది.

కానీ, ఇప్పుడు ఒక్క క్లిక్‌తో భారత్‌లో రీకాల్‌కు గురైన కార్లు లేదా బైకుల వివరాలను క్షణాల్లో పొందవచ్చు. ఇది ఎలా సాధ్యమో ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
భారత్‌లో రీకాల్‌కు గురైన కార్లు మరియు బైకులు

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) ఇప్పుడు ఇండియాలో రీకాల్‌ అయ్యే బైకుల మరియు కార్ల వివరాలను పొందడాన్ని మరింత సరళం చేసింది.

భారత్‌లో రీకాల్‌కు గురైన కార్లు మరియు బైకులు

సియామ్‌లో రిజిస్టర్ అయ్యి ఉన్న అన్ని కార్లు మరియు టూ వీలర్ల తయారీ కంపెనీలు, తమ వాహనాలకు సంభందించిన రీకాల్ వివరాలను SIAM వెబ్‌సైట్లో పొందుపరచనున్నాయి.

Recommended Video
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
భారత్‌లో రీకాల్‌కు గురైన కార్లు మరియు బైకులు

రీకాల్ అయిన వాహనాల వివరాలను, వాహనాల సంఖ్య, కారణం, రీకాల్ చేసిన సమయం, తయారు చేసిన తారీఖు వంటి ఎన్నో వివరాలను SIAM వెబ్‌సైట్‌ను సందర్శించే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రానున్నాయి.

భారత్‌లో రీకాల్‌కు గురైన కార్లు మరియు బైకులు

భారత వాహన పరిశ్రమలో అక్టోబర్ 2012 నుండి రీకాల్‌కు గురైన వాహనాలకు సంభందించిన పూర్తి వివరాలను సియామ్ తన వెబ్‌సైట్లో ప్రచురించనుంది. కస్టమర్లు తమ వాహనాలకు సంభందించిన రీకాల్ స్టేటస్ SIAM అధికారిక వెబ్‌సైట్లో పొందవచ్చు.

భారత్‌లో రీకాల్‌కు గురైన కార్లు మరియు బైకులు

SIAM ఆన్‌లైన్ రీకాల్ సిస్టమ్ ద్వారా రెండు ప్రయోజనాలున్నాయి. అవి, తొలిసారి వెహికల్ కొనుగోలు చేసిన కస్టమర్లు తమ వెహికల్ రీకాల్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఏదైనా కారణం రీత్యా రీకాల్ అయినట్లయితే, సంభందిత డీలర్ వద్ద సమస్యను ఫిక్స్ చేయించుకోవచ్చు.

భారత్‌లో రీకాల్‌కు గురైన కార్లు మరియు బైకులు

మరొకటి, సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుగోలు చేసే కస్టమర్ ఆ వెహికల్‌కు సంభందించిన రీకాల్ హిస్టరీ వెబ్‌సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఒక వేళ రీకాల్ జాబితాలో ఉన్నట్లయితే, కారు లేదా బైకు మొదటి కస్టమర్ చేత సమస్యను పరిష్కరించిన తర్వాత కొనుగోలు చేయవచ్చు, లేదంటే ఆ వెహికల్ కొనుక్కొని తర్వాత సమస్యను పరిష్కరించుకోవచ్చు. కాబట్టి వాహనంలో సాంకేతికంగా వచ్చిన తయారీ సమస్యను ఈ వెబ్‌సైట్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు.

భారత్‌లో రీకాల్‌కు గురైన కార్లు మరియు బైకులు

సియామ్ ప్రస్తుతం వాలంటరీ రీకాల్ పాలసీని అమలు చేస్తోంది. వాహన తయారీ సంస్థలు, ప్రయాణికుల భద్రత రీత్యా తమ వాహనాలలో తయారీ లోపం ఉన్నట్లు గుర్తించితే విక్రయించిన వాహనాలను తాత్కాలిక మరమ్మత్తుల కోసం వెనక్కి పిలుస్తాయి(రీకాల్). దీని ద్వారా తయారీ లోపం కారణంగా జరిగే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు.

భారత్‌లో రీకాల్‌కు గురైన కార్లు మరియు బైకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత్‌లో తయారీ లోపం కారణంగా రీకాల్‌కు గురైన కార్ల వివరాలను సియామ్ వెబ్‌సైట్ ద్వారా సులభంగా పొందవచ్చు. ఇది తొలిసారి కారును లేదా బైక్ కొనుగోలు చేసే కస్టమర్లు మరియు సెకండ్ హ్యాండ్ వెహికల్ ఎంచుకునే కస్టమర్లు ఆయా వాహనాల రీకాల్ హిస్టరీని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

English summary
Read In Telugu: Car And Bike Recall Information Now Easily Available For Customers
Story first published: Tuesday, September 12, 2017, 13:20 [IST]
Please Wait while comments are loading...

Latest Photos