భారీ ధరకు అమ్ముడుపోయిన 0001 రిజిస్ట్రేషన్ నెంబర్

Written By:

ప్రతి వాహనానికి వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పనిసరి. కానీ అలా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని ఫ్యాన్సీ నెంబర్లను ప్రత్యేకంగా వేల పాట ద్వారా విక్రయిస్తారు. ఉదాహరణకు 0007, 0555 , 0001 నెంబర్లను భారీ ధరకు వెచ్చించి తమ లగ్జరీ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయిస్తారు. కొత్త మంది కార్ల ఓనర్లు రేటు ఎంతైనా సరే వెనక్కి తగ్గరు.

0001 రిజిస్ట్రేషన్ నెంబర్

రవాణా శాఖ కూడా అడ్డూ అదుపు లేని ఆదాయాన్ని ఆర్జించేది ఇలాంటి సందర్భాల్లోనే. తాజాగా ఇలాంటి నెంబర్ ప్లేట్ ఢిల్లీలో అమ్ముడుపోయింది. 0001 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఏకంగా రూ. 16 లక్షలకు ఢిల్లీ రవాణా శాఖ విక్రయించింది. ఇంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నెంబర్‍‌ను ఈ కారు కోసమే తెలియదు కానీ అత్యంత ఖరీదైన కారు కోసమే వినియోగిస్తున్నారని అంచనా వేసుకోవచ్చు. హోటల్స్ మరియు క్యాంపెయిన్ సైట్లను నిర్వహిస్తున్న పామ్ ల్యాండ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఈ నెంబర్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.

0001 రిజిస్ట్రేషన్ నెంబర్

లక్షలు వెచ్చించి ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల కొనుగోళ్లు సంస్కృతి ఎప్పుడో మొదలయ్యింది. అయితే ఫ్యాన్సీ నెంబర్ కోసం టేబుల్ క్రింది వ్యవహారాలు ఎన్నో జరిగాయి. ఆ తరుణంలో 2014 లో ఆన్‌లైన్‌లో ఫ్యాన్సీ నెంబర్ల వేలం పాట(e-auction) ప్రారంభించాక 0001 సిరీస్ నెంబర్ల విక్రయాల ద్వారా రవాణా శాఖ మంచి ఆదాయాన్ని ఆర్జించడం ప్రారంభించింది.

0001 రిజిస్ట్రేషన్ నెంబర్

2011లో, 0001 నెంబర్‌ను రూ. 12.5 లక్షలకు మరియు 0009 నెంబర్‌ను రూ. 8.50 లక్షలకు విక్రయించారు. అదే విధంగా 2015లో, 0007 నెంబర్‌ 10.40 లక్షలకు అమ్ముడుపోయింది. ఆన్‌లైన్‌లో వేలం పాట నిర్వహించడం ద్వారా విఐపి నెంబర్ల కోసం అందరూ పోటీపడే పడుతున్నారు. అదే విధంగా డబ్బు కూడా ప్రభుత్వ ఖజనాకు సక్రమంగా చేరుతోంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ కెకె డాహియా ప్రకారం, "ఇండియాలో హోదాకు చిహ్నంగా ఉండే ఎర్ర మరియు నీలం రంగు బుగ్గలను కార్ల మీద నుండి తొలగించాలని కేంద్ర తెలిపిన అనంతరం వీఐపీ నెంబర్లకు డిమాండ్ పెరుగుతోందని తెలిపారు."

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయంగా ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ల కోసం లక్షల వెచ్చించడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కానీ 16 లక్షల రుపాయలకు ఫ్యాన్సీ నెంబర్ అమ్ముడుపోవడం ఇదే ప్రథమం మరియు ఎక్కువ కూడా ఇదే.

English summary
Read In Telugu VIP Registration Number Sold For 16 Lakh In Delhi

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark