ప్రపంచపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా మరో సారి

Written By:

జర్మనీకి చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ ప్రపంచ వ్యాప్తంగా గడిచిన 2016 ఏడాదిలో 131 లక్షల కార్లను విక్రయించి మొదటి స్థానంలో నిలవగా, దీనికి గట్టి పోటీనిస్తున్న టయోటా ప్రపంచ వ్యాప్తంగా 117 లక్షల కార్లను విక్రయించింది.

జర్మన్ కార్ల తయారీ సంస్థ గత ఏడాది డీజల్ ఉద్గార కుంభకోణంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలతో పాటు వ్యతిరేకతను కూడా మూటగట్టుకుంది. అయితే ఎప్పటిలాగే ప్రపంచపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థ స్థానాన్ని కైవసం చేసుకుంది.

గణాంకాల ప్రకారం గడిచిన 2016లో ప్రపంచ మొత్తం మీద వోక్స్‌వ్యాగన్ 10.31 మిలియన్ కార్లను విక్రయించి మొదటి స్థానంలో, టయోటా మోటార్స్ ఉత్పత్తి చేసిన 10.21 కార్లలో 10.17 కార్లను విక్రయించి రెండవ స్థానంలో నిలవగా, జనరల్ మోటార్స్ మూడవ స్థానానికి పరిమితం అయ్యింది.

అమెరికాకు చెందిన కార్ల తయారీ సంస్థ విక్రయాలకు సంభందించిన అంకెలను వెల్లడించలేదు. అయితే ఏడాది మొత్తం మీద 9.5 మిలియన్ కార్ల అమ్మకాలు చేపట్టి ఉంటుందని అంచనా.

2015 ఏడాది అమ్మకాలతో పోల్చితే గత ఏడాది ఫలితాలు 3.8 శాతం వృద్దిని సాధించింది. ప్రపంచ డీజల్ వాహన పరిశ్రమను ఓ కుదుపు కుదిపేసిన వోక్స్‌వ్యాగన్ డీజల్ ఉద్గార కుంభకోణానికి వోక్స్‌వ్యాగన్ లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారే రాజీనామా చేశారు. అయినప్పటికీ వృద్దితో కూడుకున్న ఫలితాలను సాధ్యమవ్వడం గమనార్హం.

ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ గ్రూప్ గొడుగు క్రింద ఉన్న విభిన్న బ్రాండ్ల ఫలితాలతో కూడిన విక్రయాలను వెల్లడించింది. వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆడి, పోర్షే మరియు స్కోడా సంస్థలు ఉన్నాయి.

భూ గోళం మొత్తం మీదున్న వివిధ రీజియన్ల వారీగా ఫలితాలను పరిశీలిస్తే, ఆసియా-పసిఫిక్ రీజియన్లలో 4.3 మిలియన్లు, చైనాలో 2.9 మిలియన్లు మిగిలిన ప్రదేశాల్లో 12.2 మిలియన్ల అమ్మకాలు నమోదయ్యాయి.

యూరోపియన్ మార్కెట్లో మొత్తం 4.2 మిలియన్ల విక్రయాలు చేపట్టగా, వోక్స్‌వ్యాగన్ పుట్టిన దేశం జర్మనీలో మాత్రం 7.2 శాతం తిరోగమన వృద్దిని నమోదు చేసుకుంది.

నిజానికి డీజల్ ఉద్గార కుంభకోణం బయటపడింది అమెరికాలోనే అయినా... ఉత్తర అమెరికా విక్రయాల్లో 0.8 శాతం వృద్దిని సాధించి 9,39,100 కార్లు విక్రయాలు జరిపింది. అయితే దక్షిణ అమెరికాలో 4,12,300 యూనిట్లు అమ్ముడుపోయి 25 శాతం వృద్దిని కోల్పోయింది.

 

English summary
Volkswagen Group Is The World’s Largest Automaker In 2016
Story first published: Tuesday, January 31, 2017, 10:54 [IST]
Please Wait while comments are loading...

Latest Photos