వోక్స్‌వ్యాగన్ పస్సాట్ లగ్జరీ సెడాన్ విడుదల: ధర రూ. 29.99 లక్షలు

జర్మన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్లోకి పస్సాట్ లగ్జరీ సెడాన్ కారును విడుదల చేసింది.

By Anil

జర్మన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్లోకి నేడు(10/10/2017) పస్సాట్ లగ్జరీ సెడాన్ కారును విడుదల చేసింది. భారత్‌లోకి వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీ తర్వాత చేసిన రెండవ అతి పెద్ద విడుదల పస్సాట్ లాంచ్. పస్సాట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 29.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

వోక్స్‌వ్యాగన్ పస్సాట్

వోక్స్‌వ్యాగన్ పస్సాట్ వేరియంట్లు మరియు ధరల జాబితా

పస్సాట్ కేవలం డీజల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. మరియు ఇండియాలో దీనిని రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. అవి, కంఫర్ట్‌‌లైన్ మరియు హైలైన్.

Variant Price ex-showroom
Comfortline Rs 29.99 lakh
Highline Rs 32.99 lakh
వోక్స్‌వ్యాగన్ పస్సాట్

వోక్స్‌వ్యాగన్ పస్సాట్ ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

సరికొత్త 2017 వోక్స్‌వ్యాగన్ పస్సాట్ సెడాన్‌లో 2.0-లీటర్ కెపాసిటి గల టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. ఇది 3,600-4,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 174.5బిహెచ్‌పి పవర్ మరియు 1,500-3,500ఆర్‌పిఎమ్ మధ్య గరిష్టంగా 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

6-స్పీడ్ డిఎస్‌జి డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల పస్సాట్ లోని శక్తివంతమైన డీజల్ ఇంజన్‌ లీటర్‌కు 17.42కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

వోక్స్‌వ్యాగన్ పస్సాట్

వోక్స్‌వ్యాగన్ పస్సాట్ కొలతలు పొడవు 4,767ఎమ్ఎమ్, వెడల్పు 1,832ఎమ్ఎమ్, ఎత్తు 1,456ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 2,786ఎమ్ఎమ్‌గా ఉంది. ఎలక్ట్రిక్ పవర్ ద్వారా ఆపరేట్ చేయగల బూట్(డిక్కీ)లో 586-లీటర్ల స్పేస్ కలదు. మరియు చివరి వరుస సీటును మలిపివేయడం ద్వారా దీనిని 1,152-లీటర్లకు పెంచుకోవచ్చు.

Recommended Video

2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
వోక్స్‌వ్యాగన్ పస్సాట్

వోక్స్‌వ్యాగన్ పస్సాట్ డిజైన్

వోక్స్‌వ్యాగన్ మునుపటి తరానికి చెందిన పస్సాట్‌తో పోల్చుకుంటే లేటెస్ట్ వెర్షన్ అత్యంత పదునైన మరియు అగ్రెసివ్ డిజైన్ లక్షణాలతో విడుదలయ్యింది. పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో వాలుగా ఉన్న ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ మరియు ట్రిపుల్ స్లాట్ ఫ్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా కార్నరింగ్ లైట్లు, క్రోమ్ తొడుగులు గల ఫాగ్ ల్యాంప్స్ బంపర్‌లో ఒదిగిపోయాయి.

వోక్స్‌వ్యాగన్ పస్సాట్

ప్రక్క డిజైన్, వోక్స్‌వ్యాగన్ పస్సాట్ సైడ్ ప్రొఫైల్‌కు కూడా అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఫ్రంట్ వీల్ ఆర్చెస్ నుండి ప్రారంభమయ్యే ధృడమైన క్యారెక్టర్ లైన్స్ డోర్ల మీదుగా వెనుక డిజైన్‌లో ఉన్న టెయిల్ ల్యాంప్స్ వరకు పొడగించబడి ఉన్నాయి. 16-అంగుళాలు లేదా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పస్సాట్‌ను ఎంచుకోవచ్చు.

వోక్స్‌వ్యాగన్ పస్సాట్

రియర్ డిజైన్ విషయానికి వస్సే, పస్సాట్ బ్యాక్ ప్రొఫైల్ మొత్తం మలిచినట్లుగా ఉంటుంది. దీనికి తోడు ఆంగ్లపు సి-ఆకారంలో ఉన్న డార్క్ రెడ్ ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. బంపర్‌లో ఒదిగిపోయిన రియర్ ఫాగ్ ల్యాంప్స్‌ ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ పస్సాట్

వోక్స్‌వ్యాగన్ పస్సాట్ ఇంటీరియర్ ఫీచర్లు

పస్సాట్ ఇంటీరియర్‌లోకి ప్రవేశిస్తే, మొత్తం నలుపు రంగుని పులుముకున్న ఇంటీరియర్ మరియు బ్లాక్ లెథర్ అప్‌హోల్‌స్ట్రే దర్శనమిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు డోర్లకు లోపలి వైపున పైన్ లేదా యాష్ వుడ్ రంగులో ఉన్న ఆర్నమెంట్ తొడుగులు ఉండటంతో ఇంటీరియర్ మొత్తం ప్రీమియమ్ ఫీల్ సొంతం చేసుకుంది. కారులోని సెంటర్ కన్సోల్ పియానో బ్లాక్ మరియు ఏ/సి వెంట్స్ చుట్టూ స్పోర్ట్ క్రోమ్ సరౌండింగ్స్ ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ పస్సాట్

పస్సాట్‌లో 12.3-అంగుళాల పరిమాణం గల టిఎఫ్‌టి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, బ్లూటూత్ యాక్టివిటితో పాటు రివర్స్ పార్కింగ్ కెమెరాలకు డిస్ల్పేగా పనిచేస్తుంది.

వోక్స్‌వ్యాగన్ పస్సాట్

చెప్పుకోదగ్గ ఇతర ప్రధాన ఫీచర్ల గురించి చూస్తే, పస్సాట్ సెడాన్‌లో హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్(ఆటోమేటిక్ పార్కింగ్), విశాలమైన ప్యానోరమిక్ సన్ రూఫ్, మూడు జోన్ల క్లైమేట్ కంట్రోల్, సీట్ అడ్జెస్ట్‌మెంట్ గుర్తుపెట్టుకునే ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రానిక్ అడ్జెస్ట్‌మెంట్ మరియు డ్రైవర్ మోచేయి సపోర్ట్ ఇచ్చే లంబార్ వంటివి ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ పస్సాట్

భద్రత విషయానికి వస్తే, సరికొత్త వోక్స్‌వ్యాగన్ పస్సాట్ లగ్జరీ సెడాన్‌లో తొమ్మిది ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ పస్సాట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ పస్సాట్ లగ్జరీ సెడాన్‌లో అద్భుతం చేసిందనే చెప్పాలి. అత్యాధునిక ఫీచర్లను అందించి ఆకర్షణీయమైన ధరతో పస్సాట్ లాంచ్ చేసింది.

ఇదే సెగ్మెంట్లో ఉన్న హోండా అకార్డ్, టయోటా క్యామ్రీ మరియు స్కోడా సూపర్బ్ వంటి ఖరీదైన సెడాన్ కార్లకుచ జర్మన్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ విడుదల చేసిన పస్సాట్ గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Volkswagen Passat Launched In India; Prices Start At Rs 29.99 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X