వోల్వో వి90 క్రాస్ కంట్రీ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు

Written By:

వోల్వో ఇండియా విభాగం దేశీయ విపణిలోకి తమ తొలి లగ్జరీ క్రాసోవర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. వోల్వో వి90 క్రాస్ కంట్రీ ప్రారంభ ధర రూ. 60 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న ఎస్90 సెడాన్ ఆధారంగా వి90 క్రాస్ కంట్రీ ఎస్‌యూవీని అభివృద్ది చేసింది.

వోల్వో వి90 క్రాస్ కంట్రీ విడుదల

ఇండియన్ మార్కెట్లో లభించే వోల్వో వి90 క్రాస్ కంట్రీ ఎస్‌యూవీలో సాంకేతికంగా 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 235బిహెచ్‌పి పవర్ మరియు 430ఎన్ఎఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ మరియు ఎయిర్ రైడ్ సస్పెన్షన్ సిస్టమ్ కలదు.

వోల్వో వి90 క్రాస్ కంట్రీ విడుదల

వోల్వో వి90 క్రాస్ కంట్రీ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్ అచ్చం ఎస్90 సెడాన్ ఫ్రంట్‌ డిజైన్‌ను పోలి ఉంది. మెటాలిక్ తొడుగుల ఫ్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా థార్ హ్యామర్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్ కలదు. ఈ హెడ్ ల్యాంప్ క్లస్టర్‌లోనే పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి.

వోల్వో వి90 క్రాస్ కంట్రీ విడుదల

స్టేషన్ వ్యాగన్ శైలిలో వి90 క్రాస్ కంట్రీ దర్శనమిస్తుంది. 20-అంగుళాల పరిమాణం ఉన్న వీల్స్, ప్లాస్టిక్ క్లాడింగ్, మరియు 210ఎమ్ఎమ్ వరకు గ్రౌండ్ క్లియరెన్స్ కలదు. కొలతల పరంగా చూస్తే, పొడవు 4,938ఎమ్ఎమ్, వెడల్పు 2,019ఎమ్ఎమ్, ఎత్తు 1,542ఎమ్ఎమ్, వీల్ బేస్ 2,941ఎమ్ఎమ్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 210ఎమ్ఎమ్‌గా ఉంది.

వోల్వో వి90 క్రాస్ కంట్రీ విడుదల

ఎస్‌యూవీ వెనుక చూడటానికి చాలా బల్కీగా ఉంటుంది. దీంతో అత్యుత్తమ స్టోరేజ్ (590-లీటర్ల)సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎస్‌యూవీకి ఇరువైపులా స్కిడ్ ప్లేట్లు, ముందు మరియు వెనుక వైపున రీ డిజైన్ చేయబడిన బంపర్లు ఉన్నాయి.

వోల్వో వి90 క్రాస్ కంట్రీ విడుదల

వోల్వో వి90 క్రాస్ కంట్రీ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న 12.3-అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ల్పే కలదు. ఎస్‌యూవీలోని ప్రతి ప్యాసింజర్‌కు వ్యక్తిగత డిస్ల్పే, ప్రీమియమ్ ఫీల్ కలిగించే వుడ్ ఇన్సర్ట్స్ మరియు హై క్వాలిటీ మ్యాటీరియల్స్ ఇంటీరియర్ నిర్మాణంలో వినియోగించారు.

వోల్వో వి90 క్రాస్ కంట్రీ విడుదల

భద్రత పరంగా వి90 క్రాస్ కంట్రీలో పార్కింగ్ అసిస్ట్, లేన్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సిటి సేఫ్టీ, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు ఏడు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. వీటితో పాటు ఆటానమస్ డ్రైవింగ్ ఫీచర్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కలదు.

వోల్వో వి90 క్రాస్ కంట్రీ విడుదల

వోల్వో వి90 క్రాస్ కంట్రీ ఎస్‌యూవీ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, ఆడి క్యూ3 మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ లగ్జరీ ఎస్‌యూవీలతో గట్టి పోటీని ఎదుర్కోనుంది.

English summary
Read In Telugu: 2017 Volvo V90 Cross Country Launched In India; Priced At Rs 60 Lakh
Story first published: Thursday, July 13, 2017, 17:42 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark