2018 టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:

టయోటా కిర్లోస్కర్ ఇండియా విపణిలోకి 2018 టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో లగ్జరీ మరియు అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీ లాంచ్ అయ్యింది. సరికొత్త 2018 టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో విఎక్స్ఎల్ అనే ఒక్క వేరియంట్లో మాత్రమే లభిస్తోంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ధర రూ. 92.60 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో

2018 టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఎస్‌యూవీలో 3.0-లీటర్ల కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ ఉంది. 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం గల డీజల్ ఇంజన్ 170బిహెచ్‌‌పి పవర్ మరియు 410ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో

ఇండియాలో పొలిటీషియన్స్ ఫేవరెట్ ఎస్‌యూవీగా నిలిచిన 7-సీటర్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో 2,990 కిలోల బరువు మరియు 87 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి కలదు.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో

పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌తో సరికొత్త 2018 ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో లాంచ్ చేసింది. ఎక్ట్సీరియర్‌లో అధునాతన ప్రొజెక్టర్ టైప్ ఆటో ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, ఎల్ఇడి టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్, రియర్ కాంబినేషన్స్ ల్యాంప్స్, ముందు మరియు వెనుక వైపున ఫాగ్ ల్యాంప్స్, రియర్ స్పాయిలర్ మరియు రూఫ్ రెయిల్స్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో

ఇంటీరియర్‌లో, అసలైన లెథర్ అప్‌హోల్‌స్ట్రే, వుడ్ ఫినిషింగ్ స్టీరింగ్ వీల్, డోర్ల కోసం ఇల్యుమినేటెడ్ ఎంట్రీ సిస్టమ్, సైడ్ స్టెప్ క్యాబిన్, ముందు మరియు రెండవ వరుస సీట్ హీటర్లు, మెమోరీ సహాయంతో సీటు కదలికలను గుర్తుంచుకునే 8-మార్గాలలో అడ్జెస్ట్ చేసుకునే ఫ్రంట్ సీట్లు, కన్వర్జేషన్ మిర్రర్, ఓవర్ హెడ్ స్టోరేజ్ మరియు మూడవ వరుస సీటును 50:50 నిష్పత్తిలో మడిపే అవకాశం ఉంది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో

సరికొత్త 2018 టయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఎస్‌యూవీలో సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోసం వేరిబుల్ స్పీడ్ అసిస్ట్ గల పవర్ స్టీరింగ్, డౌన్ హిల్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటి కంట్రోల్, 7-ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇంకా ఎన్నో సేఫ్టీ ఫీచర్లు.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఎనిమిది విభిన్న రంగుల్లో లభిస్తోంది. అవి, వైట్ పర్ల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మెటాలిక్, గ్రే మెటాలిక్, బ్లాకిష్ ఏజియా గ్లాస్ ఫ్లేక్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, రెడ్ మైకా మెటాలిక్, అవంత్-గార్డ్ బ్రాంజ్ మెటాలిక్ మరియు వింటేజ్ బ్రౌన్ పర్ల్ క్రిస్టల్ షైన్.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో

ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పో లో టయోటో కిర్లోస్కర్ ఇండియా సరికొత్త 2018 ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో విపణిలో ఉన్న ఫార్చ్యూనర్ మరియు ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి200 మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఇది విపణిలో ఉన్న ఆడి క్యూ7, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ మరియు వోల్వో ఎక్స్‌సి90 వంటి మోడళ్లకు పోటీనిస్తుంది.

English summary
Read In Telugu: 2018 Toyota Land Cruiser Prado Launched In India: Priced At Rs 92.60 Lakh
Story first published: Sunday, March 18, 2018, 14:49 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark