హ్యుందాయ్ ఐ20 మరియు మారుతి బాలెనో లక్ష్యంగా వస్తోన్న నిస్సాన్ కొత్త కారు

Written By:

నిస్సాన్ గత ఏడాది అంతర్జాతీయ విపణిలో కొత్త తరం మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టింది. నూతన ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించి, భారీ ఫీచర్లతో అప్‌డేట్ చేసి కొత్త తరం మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను అభివృద్ది చేసింది.

నిస్సాన్ మైక్రా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, విపణిలో ఉన్న మారుతి సుజుకి బాలెనో మరియు హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు పోటీగా కొత్త తరం నిస్సాన్ మైక్రా కారును విడుదల చేయడానికి సిద్దమైనట్లు తెలిసింది.

నిస్సాన్ మైక్రా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

యూరోపియన్ వెర్షన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను నిర్మించిన నిస్సాన్ వి-ఫ్లాట్‌ఫామ్ మీద కాకుండా, ఇండియన్ వెర్షన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారును కంపెనీ యొక్క లో-కాస్ట్ సిఎమ్‌ఎఫ్-ఎ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. ఇండియన్ వెర్షన్ క్యాప్చర్ మరియు డస్టర్ ఎస్‌యూవీలను కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేశారు.

నిస్సాన్ మైక్రా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

దేశీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, మైక్రా కొలతల్లో మార్పులు చేసి, కొత్త తరం మైక్రాను నిస్సాన్ బృందం అభివృద్ది చేసింది. తక్కువ ధరలో అందించేందుకు అంతర్జాతీయ విపణిలో ఉన్న మైక్రా లోని ఖరీదైన ఫీచర్లు కొన్ని మిస్సవుతున్నాయి. అయితే, కీలకమైన ఫీచర్లను మాత్రం యథావిధిగా అందిస్తున్నారు.

నిస్సాన్ మైక్రా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

ఇండియన్ వెర్షన్ నిస్సాన్ మైక్రా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు సేఫ్టీ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ బ్యాగులు మరియు ఇతర ఫీచర్లు తప్పనిసరిగా రానున్నాయి.

నిస్సాన్ మైక్రా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

కొత్త తరం నిస్సాన్ మైక్రా సాంకేతికంగా అవే మునుపటి 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభించనుంది. కానీ, మైలేజ్ మరియు పనితీరును మెరుగుపరిచేందుకు ఈ రెండు ఇంజన్‌లను ట్యూనింగ్ చేయనుంది.

నిస్సాన్ మైక్రా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

విపణిలో ఉన్న మారుతి సుజకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ వంటి మోడళ్లను ఎదుర్కునేందుకు మైక్రా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ధరలను అత్యంత పోటీతత్వముతో నిర్ణయించనుంది.

నిస్సాన్ మైక్రా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న నిస్సాన్ మైక్రాతో పోల్చుకుంటే, కొత్త తరం మైక్రా భారీ మార్పులతో రానుంది. కొత్త తరం మైక్రా హ్యాచ్‌బ్యాక్ నిస్సాన్ ఇండియాకు భారీ సేల్స్ సాధించపెట్టనుంది.

Source: Overdrive

English summary
Read In Telugu: Nissan’s Baleno And Elite i20 Rival Confirmed For India
Story first published: Friday, March 30, 2018, 17:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark